ఔషధ గుణలు

ఆరోగ్య సంజీవని కివానో..

సాధారణంగా "ముళ్ల దోసకాయ" అని పిలుస్తారు.

"కివానో" శాస్త్రీయ నామం కుకిమిస్ మెట్యూలిఫెరస్

కివానో వేసవి కాలపు పంట. భారతదేశంలో ఉష్టమండల, ఉప ఉష్టమండల ప్రాంతాలు దీని సాగుకు అనుకులం.

కివానో లో అనేక పోషక పదార్థాలు ఉన్నాయి. ముఖ్యంగా విటమిన్ C,A పుష్కలంగా ఉంటుంది.

ఇవి రోగనిరోధక శక్తి పెంచి వివిధ వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది.

 జీర్ణకోశ సంబంధిత సమస్యలకు ఇది సంజీవనిగా పనిచేస్తుంది.

దీనిలో పీచుపదార్థం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్దకం సమస్యలను అరికడుతుంది.

చక్కెర స్థాయిలను నియంత్రించి డయాబెటిస్ వ్యాధి బారిన పడకుండా నివారిస్తుంది.

ఈ పండులో ఉండే ఇనుము ధాతువు రక్తంలో ఉండే హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది.

ఈ పండును నిరంతరం తీసుకోవడం వల్ల క్యాన్సర్ , హృదయ రోగాలు దూరం అవుతాయి.