కార్తీక మాసం విశిష్టత తెలుసా..? 

కార్తీక మాసము తెలుగు సంవత్సరంలో ఎనిమిదవ నెల

శ్లోకం.. న కార్తికసమో మాసో న కృతేన సమం యుగమ్, న వేదసదృశం శాస్త్రం న తీర్థం గంగయా సమమ్.

అర్ధం:  కార్తీకమాసానికి సమానమైన మాసమేదీ లేదు.. సత్యయుగంతో సమానమైన యుగమేదీ లేదు.. వేదములతో సమానమైన శాస్త్రమేదీ లేదు.. గంగానది వంటి ఇతర నదేదీ లేదు.

కృత్తికా నక్షత్రంలో చంద్రుడు పూర్ణుడై సంచరించుట వలన ఈ మాసానికి కార్తీక మాసమని పేరు.

ఈ మాసంలో శివార్చన చేసినవారికి గ్రహదోషాలు, ఈతి బాధలు ఉండవు.

ఈ మాసంలో దేశం నలుమూలలా ఉన్న ఆలయాలలో రుద్రాభిషేకాలు, లక్ష బిల్వార్చనలు, రుద్ర పూజలు విశేషంగా జరుపుతారు.

హిందువులు ఈ నెలలో శివుడిని, విష్ణువుని పవిత్రంగా కొలుస్తారు.

శివాలయములో ప్రార్థన, లింగార్చన, బిల్వార్చన వంటి పుణ్య కార్యములు ఆచరించుట ఈ మాసంలో విశేష ఫలాన్ని ప్రసాదిస్తాయి.