నలభై ఏండ్లలో నాలుగో ఫైనల్..
ప్రపంచ క్రికెట్లో 1970 -80ల్లో వెస్టిండీస్.. ఆ తర్వాత ఆస్ట్రేలియా ఆధిపత్యం చెలాయించగా
ఇప్పుడు భారత్ వంతు వచ్చింది అనిపిస్తోంది.
ఆసియా కప్ చాంపియన్‌గా నిలిచిన టీమిండియా సొంత గడ్డపై పుష్కరకాలం తర్వాత జరుగుతున్న మెగా టోర్నీ ప్రత్యర్థులను హడలెత్తిస్తోంది.
2019లో సెమీస్‌లో ఓటమితో ఇంటిదారి పట్టిన భారత్
ఈసారి ఆకలిగొన్న సింహంలా జూలు విదుల్చుతోంది.
టోర్నీలో తలపడుతున్న అన్ని జట్లను వరుస పెట్టి ఓడించిన రోహిత్ సేన..
12 ఏండ్లుగా ఊరిస్తున్న ఐసీసీ ట్రోఫీ (ICC Trophy) ని ఒడిసిపట్టుకునేందుకు సిద్ధమైంది.
వాంఖడే స్టేడియంలో న్యూజిలాండ్‌ను చిత్తుగా ఓడించి దర్జాగా ఫైనల్‌కు దూసుకెళ్లి..
ఈసారి భారత్ కప్పు కొడితే చరిత్రే.. ఆదివారం ఫైనల్ మ్యాచ్ ఆడనుంది భారత్