A.R. రెహమాన్
రెహమాన్ 1967 జనవరి 6న చెన్నైలో జన్మించారు.
ఈయన అసలు పేరు అల్లా రఖా దిలీప్ కుమార్.
ప్రముఖ భారతీయ గాయకుడు, రచయిత, నిర్మాత, శాస్త్రీయ సంగీత దర్శకుడు.
మొదటగా వాణిజ్య ప్రకటనలకు సంగీత దర్శకుడిగా వ్యవహరించారు.
ఇళయరాజా, రాజ్ కోటి, రమేష్ నాయుడు, వంటి సంగీత దర్శకుల కింద పనిచేశారు.
మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన రోజా చిత్రానికి సంగీతం అంధించారు. దీంతో రెహమాన్ కు ఆ సినిమాతో మంచి పేరు వచ్చింది.
ప్రేమ దేశం, రోజా, జీన్స్, సఖి, వంటి సినిమాలకు రెహమాన్ సంగీతం మంచి పేరు తెచ్చి పెట్టింది.
స్లమ్ డాగ్ మిలియనీర్ అనే చిత్రంలో జై హో అనే పాటకు ప్రతిష్ఠాత్మక మైన గోల్డెన్ గ్లోబ్ అవార్డు వరించింది.
ఇదే పాటకు రెండు ఆస్కార్ అవార్డులను అందుకొన్న తొలి భారతీయుడు.