సాధారణంగా యాపిల్స్ ఎరుపు రంగులో ఉంటాయి.

కొన్ని ఆకు పచ్చని రంగులో కూడా ఉంటాయి.

బ్లాక్ కలర్ యాపిల్ ఎప్పుడైనా చూశారా..?

యాపిల్ జాతుల్లోనే ఈ పండుకు ఓ ప్రత్యేకత ఉంది.

ఈ యాపిల్ కు బ్లాక్ డైమండ్ యాపిల్ ని కూడా పిలుస్తారు.

ఈ పండు రుచి కూడా పుల్లపుల్లగా .. తియ్యతియ్యగా ఉంటుంది.

ఈ బ్లాక్ డైమండ్ యాపిల్ ధర ఎంతో తెలుసా..?

ఒక్కో పండు అక్షరాల రూ. 500 వరకు ఉంటుంది.

చైనా, టిబెట్ లోని న్యింగ్ చీ పర్వత అడవుల్లో మాత్రమే ఈ పండ్లు పండుతాయి.

ఈ బ్లాక్ యాపిల్ తొలి పంట చేతికిరావడానికి దాదాపు 5 నుంచి 8 ఏళ్ల సమయం పడుతుంది.

దీని ధర అధికంగా ఉన్నప్పటికి.. పోషకాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి.