కింగ్ కోహ్లీ రికార్డుల హోరు

విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు.

17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో 10 సీజన్లలో 400కు పైగా రన్స్ చేసిన ఆటగాడిగా నిలిచాడు.

సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేయడం ద్వారా విరాట్ కోహ్లీ ఈ ఫీట్ సాధించాడు.

ఈ సీజన్‌లో ఇప్పటికే విరాట్ కోహ్లీ 400 ప్లస్ రన్స్‌తో ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా కొనసాగుతున్నాడు.

ఐపీఎల్ 2011 సీజన్‌లో 557 పరుగులు చేసిన కోహ్లీ..

2013లో 634 , 2015లో 505 , 2016 లో 973 , 2018లో 530, 2019లో 464 , 2020లో 466, 2021లో 405, 2023లో 639 సీజన్లతో పాటు తాజా సీజన్‌లో 400 పరుగులు చేశాడు.

ఇక ఓపెనర్‌గానూ 4000 పరుగులు మైలురాయిని అందుకున్నాడు.

అలాగే మ్యాచ్ లో కొట్టిన నాలుగు బౌండరీలతో ఈ సీజన్లో కోహ్లీ కొట్టిన ఫోర్ల సంఖ్య 40కు చేరింది.

తద్వారా ఒక ఐపీఎల్ ఎడిషన్లో అత్యధిక బౌండరీలు బాదిన ప్లేయర్ గా విరాట్ రికార్డు సృష్టించాడు.