కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలోని గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. విమెన్స్ హాస్టల్ బాత్‌రూమ్‌ల్లో రహస్య కెమెరాలను అమర్చిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ విషయం తెలియగానే విద్యార్థులు ఆందోళనకు దిగారు. గురువారం రాత్రంతా నిరసనలకు దిగారు. క్యాంపస్‌లో బైఠాయించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఇంజినీరింగ్ కాలేజీ క్యాంపస్‌కు చేరుకున్నారు. దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనలో ఇప్పటివరకు ఒక విద్యార్థిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న వారందరినీ అరెస్ట్ చేయాలంటూ బాధిత విద్యార్థినులు డిమాండ్ చేస్తోన్నారు. హాస్టల్ బాత్‌రూమ్‌లల్లో హిడెన్ కెమెరాలను అమర్చి.. 3వందల మంది విద్యార్థినుల వీడియోలను సేకరించారని.. వాటిని డార్క్ వెబ్‌సైట్లల్లో అమ్ముకున్నారనే ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్. ఐతే కెమెరాలు ఏమీ లేవని కేసు కొట్టేశారని.. పైగా ప్రశ్నించినందుకు తమపైనే రివర్స్ కేసులు పెట్టారని మరికొందరు విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు, స్క్రీన్ షాట్‌లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్. ఈ పరిణామాలు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌ను ఇబ్బందుల్లోకి నెట్టాయ్. కూటమి ప్రభుత్వం గెలిచి.. పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత.. సాయిధరమ్ చేసిన ఓ పోస్టే దీనికి కారణం. ఇప్పుడు ఏపీ సేఫ్ హ్యాండ్స్‌లో ఉంది అంటూ.. మేమమామ పవన్ మీద ప్రేమను చూపిస్తూ సాయిధరమ్ తేజ్ ఓ పోస్ట్ పెట్టాడు. దాన్ని షేర్ చేస్తున్న నెటిజన్లు.. గుడ్లవల్లేరు దారుణాన్ని హైలైట్ చేస్తూ.. ఏపీ నిజంగానే సేఫ్ హ్యాండ్స్‌లో ఉందా అంటూ ప్రశ్నలు గుప్పిస్తున్నారు. ఈ ఘటనపై రియాక్ట్ కావాలంటూ కొందరు మెగా కాంపౌండ్ హీరోల అభిమానులు కూడా డిమాండ్ చేస్తున్నారు.