Weather Update : తెలంగానలో మరో 3 రోజులు వర్షాలు.. ఏపీలో రానున్న 24 గంటల్లోభారీ వర్షాలు..

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరరో 3 రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో ఆవర్తన ద్రోణి కొనసాగుతున్న వెళా.. నైరుతి రుతుపవనాలు తెలంగాణ అంతటా విస్తరిస్తున్నాయి.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరరో 3 రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో ఆవర్తన ద్రోణి కొనసాగుతున్న వెళా.. నైరుతి రుతుపవనాలు తెలంగాణ అంతటా విస్తరిస్తున్నాయి. దీంతో మరో 3 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక KNR, PDPL, BPL, NLG, SPT, MHBD, WGL, HMK, SDPT, BNR, RR, HYD, VKD, SND, MDK, ములుగు, జనగామ జిల్లాల్లో రేపు ఉదయం వరకు వర్షాలు పడతాయని తెలిపింది.

ఇక అటు ఏపీలో లోను రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల పిడుగులు, ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది.

అటు APలో ఉత్తరాంధ్ర మీదుగా తూర్పు పడమర మధ్య ద్రోణి సముద్ర మట్టానికి 3.1 నుంచి 5.8 కి.మీ. ఎత్తులో విస్తరించి ఉంది. దీంతో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి, కర్నూలు, నంద్యాల, శ్రీసత్యసాయి, అనంతపురంతో పాటు పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని APSDMA పేర్కొంది. విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రైతులు ఎవరు కూడా.. పొలాల్లో, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్లు, పోల్స్, టవర్స్ క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించారు. ఇక రానున్న వారం పాటు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ లోని చాలా జిల్లాల్లో సగటు ఒక సెంటీమీటర్ నుంచి ఎక్కువ వర్షపాతం నమోదు అవుతుందని అంచనా వేశారు.