సరిగా 60 ఏళ్ళ క్రితం, బుడమేరు దెబ్బ, ఆంధ్రపత్రిక వైరల్

విజయవాడ నగరానికి కృష్ణా నది కంటే అత్యంత ప్రమాదకరం బుడమేరు వాగు అని ఇప్పుడు కాదు 60 ఏళ్ళ క్రితమే రుజువు అయింది. అవును 1964 సెప్టెంబ 8, 9 తారీఖులలో బెజవాడ నగరం బుడమేరు వరదకు అల్లాడిపోయింది.

  • Written By:
  • Publish Date - September 8, 2024 / 07:30 PM IST

విజయవాడ నగరానికి కృష్ణా నది కంటే అత్యంత ప్రమాదకరం బుడమేరు వాగు అని ఇప్పుడు కాదు 60 ఏళ్ళ క్రితమే రుజువు అయింది. అవును 1964 సెప్టెంబ 8, 9 తారీఖులలో బెజవాడ నగరం బుడమేరు వరదకు అల్లాడిపోయింది. ఇప్పుడు సోషల్ మీడియాలో అప్పటి ప్రముఖ న్యూస్ పేపర్… ఆంధ్రపత్రికకు సంబంధించిన ఒక క్లిప్ వైరల్ అవుతోంది. అప్పుడు బుడమేరు పొంగడంతో సత్యనారాయణ పురం, రైల్వే కాలనీ వంటి ప్రాంతాలు కూడా ముంపుకి గురయ్యాయి. ఇప్పుడు ఈ ప్రాంతాల్లో వరద రాలేదు.

ఇప్పుడు సింగ్ నగర్ తో పాటుగా వాంబే కాలనీ, పైపుల రోడ్డు, కబేళా, కండ్రిక సహా పలు ప్రాంతాల్లో వరదలు వచ్చాయి. అప్పుడు వచ్చిన వరదల్లో 10 మంది కొట్టుకుని పోగా… వేలాది గృహాలు నేలమట్టం అయ్యాయి. ఇప్పుడు అపార్ట్మెంట్ లు కాగా అప్పుడు కేవలం చిన్న చిన్న గుడిసెలు మాత్రమే ఉండేవి. అవన్నీ వరద తాకిడికి కొట్టుకుని పోయాయి. ఇప్పుడు ఎలా అయితే పత్రికల్లో కనీవినీ ఎరుగని వరద అని రాస్తున్నారో ఆంధ్రపత్రిక సైతం అలానే వార్తను ఆ రోజు ప్రచురించింది. ఇప్పుడు ఎలా అయితే రైలు రాకపోకలను అధికారులు రద్దు చేసారో అప్పుడు కూడా అలానే రద్దు చేసారు.

కీలక రైల్వే ట్రాక్ లు సైతం కొట్టుకుపోయాయి అని ఆంద్ర పత్రిక ప్రచురించింది. వేలాది ఎకరాల పంట, ఆస్తి నష్టం జరిగాయని, వేలాది పశువులు వరదల్లో కొట్టుకుపోయాయి అని పత్రిక పేర్కొంది. అప్పుడు ఆంధ్రా సిమెంట్ ఫ్యాక్టరీ విజయవాడలో బాగా ఫేమస్. ఆ సిమెంట్ ఫ్యాక్టరీ అధికారులు, కార్మికులు కూడా తమ ఇళ్ళను ఖాళీ చేసి వెళ్లిపోయారని పత్రికలో ప్రచురించారు. అప్పుడు అధికారులు అప్రమత్తమై మరికొందరిని నివాసాలు ఖాళీ చేయించి పంపించారు అంటూ పత్రిక పేర్కొంది.