Jagan Furniture : జగన్ పై కేసు పెట్టాల్సిందే.. ప్రభుత్వ ఫర్నిచర్ వాడకంపై నెటిజెన్స్ డిమాండ్

అధికారంలో ఉన్నప్పుడు తాను చేసిన తప్పులే ఇప్పుడు దిగిపోయాక మాజీ సీఎం జగన్ ను మెంటాడుతున్నాయి. అప్పట్లో అంటే... 2019లో ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు (Kodela Sivaprasada Rao) పై జగన్ ప్రభుత్వం ఫర్నిచర్ దొంగిలించినట్టు కేసు పెట్టింది.

 

 

అధికారంలో ఉన్నప్పుడు తాను చేసిన తప్పులే ఇప్పుడు దిగిపోయాక మాజీ సీఎం జగన్ ను మెంటాడుతున్నాయి. అప్పట్లో అంటే… 2019లో ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు (Kodela Sivaprasada Rao) పై జగన్ ప్రభుత్వం ఫర్నిచర్ దొంగిలించినట్టు కేసు పెట్టింది. ఏపీ అసెంబ్లీని హైదరాబాద్ నుంచి అమరావతిలో వెలగపూడిలో నిర్మించిన భవనాల్లోకి మార్చారు. హైదరాబాద్ నుంచి తెచ్చిన ఫర్నిచర్ ను కోడెల శివప్రసాద్ రావు గుంటూరులోని తన ఆఫీసుకు, సత్తెనపల్లిలో తన ఇంటికి తరలించారని కేసు నమోదైంది. కోడెల కూడా ఫర్నిచర్ తీసుకెళ్లమని అధికారులకు రిక్వెస్ట్ చేసినా పట్టించుకోలేదని చెప్పారు. ఆ తర్వాత కొన్ని రోజులకే కోడెల ఆత్మహత్య చేసుకున్నారు. జగన్ ప్రభుత్వం (Jagan Govt) అవమానించడంతో మనస్థాపంతోనే చనిపోయారని అప్పట్లో టీడీపీ (TDP) ఆరోపించింది.

అయితే ఇప్పడు మాజీ సీఎం జగన్ (Former CM Jagan) పైనా ఫర్నిచర్ దొంగతనం కేసు పెట్టాలన్న డిమాండ్ టీడీపీ శ్రేణుల నుంచి వస్తోంది. జగన్ సీఎంగా ఉన్నప్పుడు… వెలగలపూడిలో ఓ ఆఫీసులో కూర్చొని అధికారులు, మంత్రులతో సమీక్షలు చేసేవారు. చాలామంది అది సెక్రటరియేట్ లో సీఎం ఛాంబర్ అనుకున్నారు. ఇప్పుడు మాజీ అయ్యాక… పార్టీ కార్యకలాపాలు కూడా అదే రూమ్ నుంచి కంటిన్యూ చేస్తున్నారు. అప్పుడు.. ఇప్పుడు ఉన్న తేడా ఏంటంటే… అప్పట్లో జగన్ కుర్చీ వెనుక ఏపీ రాజముద్ర ఉండేది.

ఇప్పుడు దాన్ని తొలగించారు. అదే సీటులో కూర్చొని జగన్… పార్టీ లీడర్లతో మీటింగ్ పెడుతున్నారు. దాంతో ప్రభుత్వ సొమ్ముతో కొన్న ఫర్నిచర్ ను వాడుకుంటున్న జగన్ పై కేసు పెట్టాలని టీడీపీ అభిమానులు, నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. అప్పట్లో ఈ ఛాంబర్ కోసం 19 కోట్లు ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. ఆ రోజు కోడెల మీద ఫర్నిచర్ కేసుపెట్టి వేధించారు. ఇప్పుడు కోట్ల రూపాయల విలువైన గవర్నమెంట్ ఫర్నిచర్ వాడుతున్న జగన్ పై ఎందుకు కేసు పెట్టడం లేదనిప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియాలో జగన్ ఫోటోలు, వీడియోలను వైరల్ చేస్తున్నారు. జగన్ పార్టీ ఆఫీసులో ఉన్నది నిజంగా ప్రజల డబ్బుతో కొన్న ఫర్నిచరేనా… కాదా అన్నదానిపై వైసీపీ నుంచి ఇప్పటిదాకా వివరణ రాలేదు.