Pawan Kalyan : పవన్‌ పేరుతో ఏపీలో కొత్త పథకం.. తస్సాదియ్యా.. ఇది కదా కావాల్సింది!

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చింది.164 స్థానాల్లో కూటమి అద్భుతమైన విజయం సాధించింది అంటే.. అందులో పవన్ కల్యాణ్‌ది కీ రోల్ అనడంలో ఎలాంటి అనుమానం లేదు.

 

 

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చింది.164 స్థానాల్లో కూటమి అద్భుతమైన విజయం సాధించింది అంటే.. అందులో పవన్ కల్యాణ్‌ది కీ రోల్ అనడంలో ఎలాంటి అనుమానం లేదు. మూడు పార్టీల పొత్తు కుదరకపోయినా.. పవన్‌ తగ్గకపోయినా.. ఏపీలో ఎన్నికల ఫలితాలు ఇంకోలా ఉండేవి అనడంలో ఎలాంటి అనుమానం లేదు. వైసీపీని బలంగా ఢీకొట్టాలని ఫిక్స్ అయిన పవన్.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఒక్కటి కూడా చీలిపోవద్దని ఫిక్స్ అయ్యారు. కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. చరిత్రాత్మక విజయాన్ని కట్టబెట్టారు.

ఇంతలా కష్టపడ్డ పవన్‌కు చంద్రబాబు అరుదైన గౌరవాన్ని ఇవ్వబోతున్నారని పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే పవన్ కల్యాణ్‌కు డిప్యూటీ సీఎం పదవి అప్పగించిన చంద్రబాబు… ఇప్పుడు మరో అరుదైన గౌరవం ఇవ్వాలని డిసైడ్ అయ్యారట. పవన్ పేరుతో ప్రభుత్వ పథకాలకు పెట్టాలని అనుకుంటున్నారట. ఆ పథకం కూడా యువకులకు కనెక్ట్ అయ్యే పథకం అయితే బాగుంటుందని ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. రాష్ట్రంలో యువత ఓట్లు ఒక్కటి కూడా వైసీపీకి పడకుండా కూటమికే పడేటట్టు చేయడంలో పవన్ కీలక పాత్ర పోషించారని అనడంలో ఎలాంటి అనుమానం లేదు. అలాంటి పవన్ గౌరవ మర్యాదలు పెరిగేలా ఒక ప్రభుత్వ పథకానికి ఆయన పేరు పెట్టాలని భావిస్తున్నారట.

ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్టీఆర్, చంద్రబాబు పేరుతో అనేక పథకాలు వచ్చాయి. అలాగే జగన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చాక జగన్, వైఎస్‌ పేరుతో పథకాలు వచ్చాయి. ప్రస్తుతం మళ్లీ టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. దీంతో కొత్తగా పథకాలు అమలవుతున్నాయ్. వీటికి తోడు ఎన్టీఆర్, చంద్రన్న పేరుతో గతంలో ఉన్న పథకాలను మళ్లీ ప్రారంభించాలని డిసైడ్ అయ్యారు. ఇప్పుడు పవన్ పేరుతో పవన్ యువ వికాసం అనే పేరుతో ఒక పథకం ప్రవేశపెట్టి.. యువకులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చంద్రబాబు అనుకుంటున్నారట. మరి అసలు విషయం తెలియాలంటే.. ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే..