Janasena Glass Symbol : కూటమికి దిమ్మతిరిగే షాక్‌.. ఇండిపెండెంట్‌కు గ్లాస్‌ గుర్తు..

ఏపీలో కూటమిని గాజుగ్లాస్‌ సింబల్‌ టెన్షన్‌ వెంటాడుతోంది. ఇప్పటికే ఈ గుర్తు విషయంలో జనసేన చాలా సార్లు సమస్యలు ఫేస్‌ చేసింది. ఇప్పడు నామినేషన్లు కూడా పూర్తయ్యాక కొత్త సమస్య తలెత్తింది. ఏపీలో ఇండిపెండెట్లుగా ఉన్న క్యాండెట్‌కు గాజు గ్లాస్‌ గుర్తు కేటాయించారు అధికారులు.

ఏపీలో కూటమిని గాజుగ్లాస్‌ సింబల్‌ టెన్షన్‌ వెంటాడుతోంది. ఇప్పటికే ఈ గుర్తు విషయంలో జనసేన చాలా సార్లు సమస్యలు ఫేస్‌ చేసింది. ఇప్పడు నామినేషన్లు కూడా పూర్తయ్యాక కొత్త సమస్య తలెత్తింది. ఏపీలో ఇండిపెండెట్లుగా ఉన్న క్యాండెట్‌కు గాజు గ్లాస్‌ గుర్తు కేటాయించారు అధికారులు. విజయనగరం నుంచి టీడీపీ రెబల్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మీసాల గీతకు గ్లాస్‌ గుర్తు కేటాయించారు. ఇండిపెంటెంట్‌ క్యాండెట్‌కు గ్లాస్‌ గుర్తు చూడటంతో అంతా షాకయ్యారు.

తమ పార్టీ గుర్తును ఇండిపెండెంట్లకు ఎలా కేటాయిస్తారంటూ ఈసీని ఆశ్రయించారు జనసేన నేతలు. కానీ వాళ్ల నుంచి ఎలాంటి రియాక్షన్‌ ఇప్పటి వరకూ లేదు. రిటర్నింగ్‌ ఆఫీసర్స్‌ కూడా ఈ విషయంలో తమకు ఎలాంటి సమాచారం లేదంటున్నారు. గాజుగ్లాస్‌ గుర్తు ఇప్పటికీ ఫ్రీ సింబల్స్‌ జాబితాలోనే ఉందని.. ఆ కారణంగానే ఇండిపెండెంట్లకు గ్లాస్‌ సింబల్‌ కేటాయించారంటూ చెప్తున్నారు. గతంలో కూడా ఈ గుర్తు విషయంలో జనసేన చాలా సమస్యలు ఎదుర్కుంది. ఇదే గుర్తును పోలి ఉన్న బకెట్‌ గుర్తు కూడా ఓ పార్టీకి ఈసీ కేటాయించడంతో జనసేన నేతలు ఈసీకి లేఖ రాశారు.

ఆ గుర్తును రద్దు చేయడంతో పాటు గాజుగ్లాస్‌ గుర్తును జనసేన పార్టీకి కేటాయించాలంటూ కోరారు. కానీ ఇప్పటికీ ఆ గుర్తు ఇంకా ఫ్రీ సింబల్స్‌ జాబితాలోనే ఉండటం ఇప్పుడు ఏపీ హాట్‌ టాపిక్‌గా మారింది. ఏపీలో 21 అసెంబ్లీ స్థానాలు రెండు ఎంపీ స్థానాల్లో జనసేన పోటీ చేస్తోంది. మిగిలిన స్థానాల్లో బీజేపీ, టీడీపీ నేతలకు మద్దతు ఇస్తోంది. ఇలాంటి టైంలో జనసేన గుర్తు ఇండిపెంట్లకు వెళ్లడం ఆ పార్టీకి తీవ్ర నష్టం చేకూర్చే అవకాశం ఉంది. దీంతో ఈ సమస్యనుంచి గట్టేందుకు అన్ని మార్గాలు వెతుకుతోంది జనసేన పార్టీ.