విశాఖ జిల్లా భీమిలి జోన్ ఎగువపేటలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇంట్లోని పెంపుడు కుక్క కరిచి.. తండ్రీ కుమారుడు మృతి చెందారు. నాలుగు రోజుల వ్యవధిలో తండ్రి, కుమారుడు మృతి చెందడంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇక విషయంలోకి వెళితే..
విశాఖ జిల్లా భీమిలి జోన్ ఎగువపేటలో ఓ ఫ్యామిలీలో ఓ పెంపుడు కుక్కను పెంచుకుంటున్నారు ఓ కుటుంబం. ఆ కుక్క ఆ కుటుంబంలోని భార్గవ్‌ను ముక్కు మీద కరిచింది. అంతకు ముందు తన తండ్రి నరసింగరావుకు ఆరోగ్యం బాగోకపోవడంతో పదిరోజుల క్రితం విశాఖ కేజీహెచ్‌లో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. ఈ ఘటన జరిగిన 2 రోజులకు వారు అప్రమత్తమై యాంటీ రేబిస్ ఇంజక్షన్ తీసుకున్నారు. తండ్రి హాస్పిటల్‌లో ఉండడంతో తనను కుక్క కరిచిన విషయాన్ని పట్టించుకోలేదు భార్గవ్.. దీంతో ఒక్క డోస్ టీకా మాత్రమే వేయించుకున్నారు. ఆ కుక్కకు రేబిస్ వ్యాధీ సోకడంతో కాస్త ఆది భర్గవ్ ఆయన మెదడుకు వ్యాపించింది.. అయితే అప్పటికే మెదడు, కాలేయం, ఇతర భాగాలకు రేబిస్ సోకడంతో చికిత్స పొందుతూ.. ఆరోగ్యం విషమించి రెండు రోజుల క్రితం భార్గవ్ మరణించారు. భార్గవ్ చనిపోవడానికి రెండు రోజుల ముందు తన పెంపుడు కుక్క కూడా చనిపోయింది. కుటుంబ సభ్యులు అందించిన వివరాలతో పాటు కేజీహెచ్‌లో నర్సింగరావు డెత్ రిపోర్టును పరిశీలించిన వైద్యారోగ్య శాఖ సిబ్బంది.. కేవలం భార్గవ్ మాత్రమే రేబిస్‌తో చనిపోయారని నిర్ధారించారు. నాలుగు రోజుల వ్యవధిలో తండ్రి, కుమారుడు మృతి చెందడంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
మరణించిన తండ్రి కొడుకులు ఇద్దరు కూడా కుటుంబ పోషకులు అవ్వడం గమనార్హం.. తండ్ర ఏపీ ఆర్టీసీలో కండక్టర్ గా పనిచేశారు. తన కొడుకు భార్గవ్ రైల్వే శాఖలో పనిచేస్తున్నారు. వాళ్ల మరణంతో కుటుంబం ఇప్పుడు పెద్దరికం.. కుటుంబ పోషకులను కోల్పోయింది ఆ కుటుంబం..