WHY ALI RESIGN : అలీ రిజైన్ కి రీజన్స్ ఇవే.. ఆ దర్శకుడి సలహాతోనే…

2019లో వైసీపీలో చేరిన నటుడు అలీకి మొదట్లో వక్ఫ్ బోర్డు ఛైర్మన్ పదవి దక్కుతుందనీ... ఆ తర్వాత ఎమ్మెల్సీ లేదంటే రాజ్యసభకు పంపుతారని రకరకాల ఊహాగానాలు వచ్చాయి.

 

 

 

ఐదేళ్ళ రాజకీయ ప్రస్థానానికి నటుడు అలీ గుడ్ బై కొట్టారు. 2019లో పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చి… 2024లో ఎగ్జిట్ అయ్యాడు. నిన్నటిదాకా వైసీపీలో కొనసాగుతున్న ఆయన… ఆ పార్టీకి రిజైన్ చేయడమే కాదు… ఏకంగా రాజకీయాలకే దూరం అయ్యాడు. వైసీపీ ఘోరంగా ఓడిపోయి అధికారం కోల్పోయింది కాబట్టి రిజైన్ చేయడం వరకూ ఓకే. కానీ పాలిటిక్స్ నుంచి తప్పుకోవడం వెనుక అలీకి చాలా రీజన్సే ఉన్నాయి.

2019లో వైసీపీలో చేరిన నటుడు అలీకి మొదట్లో వక్ఫ్ బోర్డు ఛైర్మన్ పదవి దక్కుతుందనీ… ఆ తర్వాత ఎమ్మెల్సీ లేదంటే రాజ్యసభకు పంపుతారని రకరకాల ఊహాగానాలు వచ్చాయి. జగన్ మొక్కుబడిగా ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు పోస్టు ఇచ్చారు. మొన్నటి అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో పోటీకి అలీ తెగ ప్రయత్నించాడు. ఏపీలో జగన్ ఎక్కడ టిక్కెట్ ఇచ్చినా పోటీ చేస్తానని చెప్పాడు. కానీ వైసీపీ ఆ ఛాన్స్ ఇవ్వలేదు. పైగా ఉండీ లేనట్టుగా అడ్వైజర్ పోస్టు ముఖాన పడేశారే తప్ప… ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేసే ఛాన్స్ మాత్రం జగన్ ఇవ్వలేదు. అప్పటి నుంచి అసంతృప్తిగా ఉన్న అలీ… మొన్నటి ఎన్నికల్లో వైసీపీకి ప్రచారానికి కూడా వెళ్లలేదు. వైసీపీలో అలీకి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వకపోవడానికి ఇంకో కారణం కూడా ఉందని అంటారు. ఆ పార్టీలో ఉన్న మిగిలిన సినీ నటులు… రోజా, పోసాని కృష్ణ మురళీ … పొద్దున లేచిన దగ్గర నుంచీ… చంద్రబాబు, పవన్ మీద వ్యక్తిగత విమర్శలు చేసే వాళ్ళు.

బండబూతులు తిట్టేవారు… కానీ అలీ ఏనాడూ కూడా వ్యక్తిగత విమర్శల జోలికి వెళ్ళలేదు… ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవితో పాటు పవన్ కల్యాణ్, ఇతర మెగా హీరోల సినిమాల్లో అలీకి మంచి అవకాశాలే వచ్చాయి. పవన్ తో అయినా పోటీకి సిద్ధమని అలీ అన్నాడే తప్ప… ఎవర్నీ వ్యక్తిగతంగా తిట్టలేదు. అదే అలీకి వైసీపీలో మైనస్ గా మారింది.

ఇప్పుడు కూడా సినీ, టెలివిజన్ రంగాల్లో అలీకి మంచి కెరీర్ నడుస్తోంది. ఈటీవీలో అలీతో సరదాగా కార్యక్రమాన్ని ఆదరణ ఉంది. ఇప్పటికే వెయ్యికి పైగా సినిమాల్లో నటించాడు… రాబోయే రోజుల్లో ఇండస్ట్రీలో మంచి అవకాశాలే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఏరి కోరి మెగా స్టార్, నందమూరి ఫ్యామిలీలతో పెట్టుకోవడం అనవసరం అనుకున్నాడు. రోజా, పోసాని, యాంకర్ శ్యామల దాదాపు ఫేడ్ అవుట్ అయినట్టే . పైగా జగన్ హయాంలో సినీ పరిశ్రమ ఎన్నో ఇబ్బందులు పడింది.

ఇండస్ట్రీ పెద్దలను కూడా జగన్ ఘోరంగా అవమానించినట్టు ఫీలవుతున్నారు. ఈ పరిస్థితుల్లో వైసీపీలో ఉండి తాను సాధించేదేమీ లేదనుకున్నారు అలీ. పైగా ఆయనకు సినిమాలు తప్ప… వేరే ఎలాంటి బిజినెస్ యాక్టివిటీస్ లేవు… అందుకే గౌరవంగా రాజకీయాల నుంచి తప్పుకుంటే… హాయిగా సినిమాలు చేసుకొని బతకొచ్చని డిసైడ్ అయ్యారు అలీ. ఇండస్ట్రీకి చెందిన ఓ ప్రముఖ దర్శకుడు ఇచ్చిన సలహాతోనే అలీ పాలిటిక్స్ నుంచి కూడా తప్పుకున్నట్టు తెలుస్తోంది. జగన్ ను పట్టుకుంటే… సినిమాల్లో అవకాశాలు లేకుండా పోతాయ్… నీకు అవసరమా అని సలహా ఇవ్వడంతో … అలీ ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.