ఏపీ ఎన్నికల్లో కూటమి గ్రాండ్ విక్టరీ కొట్టేసింది. ప్రభుత్వం ఏర్పాటు చేసింది. చంద్రబాబు సీఎంగా, పవన్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టి.. తమ మార్క్ పాలనతో దూసుకుపోతున్నారు. కూటమి దెబ్బకు వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా పోయింది. ఎన్నికల ముందు పవన్‌ను, చంద్రబాబుపై తిట్ల వర్షం కురిపించిన నోళ్లన్నీ.. ఇప్పుడు మూసుకుంటున్నాయ్. కొందరయితే ఈ రాజకీయాలే వద్దు బాబోయ్ అంటూ చేతులెత్తేస్తున్నారు. అలీ చేసింది అదే ! వైసీపీ ఓటమితో తీవ్ర నిరాశలోకి వెళ్లిపోయిన అలీ.. ఇక రాజకీయాలు వద్దు అంటూ వైసీపీకి రాజీనామా చేశారు.
ఈ వద్దు అనే మాటకు నిజంగా స్టిక్ అయి ఉంటారా లేదా అన్న సంగతి పక్కనపెడితే.. పవన్‌కు అలీ మంచి స్నేహితుడు. అలాంటిది రాజకీయాల కోసం ఆయనకు దూరం అయ్యారు. ఓ స్టేజీలో పవన్ మీద ఘాటు విమర్శలు చేశారు కూడా ! ఆ మాటు మెగా కాంపౌండ్‌లో రేపిన రచ్చ అంతా ఇంతా కాదు. ఆ మాటల తర్వాతే.. పవన్, అలీ మధ్య దూరం పెరిగింది. పవన్ ప్రతీ సినిమాలో కనిపించే అలీ.. ఆ తర్వాత మాయం అయ్యారు. కట్ చేస్తే పవన్ డిప్యూటీ సీఎం అయ్యాక.. ఏకంగా రాజకీయాలు వదిలేశారు అలీ. సినిమాలు, షూటింగ్‌లే లోకం అంటున్నారు. ఇదంతా పవన్ ఫ్యాన్స్ ఎఫెక్టే అనే చర్చ జరుగుతోంది. మాములుగా ఓ మాట అన్న అలీ సంగతే ఇలా ఉంది అంటే.. పోసాని పరిస్థితి ఏంటి అనే చర్చ జరుగుతోంది. పవన్ విషయంలో పోసాని చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. జగన్‌కు వంత పాడడంతో పాటు.. పవన్ కేరక్టర్ డీగ్రేడ్ చేసేలా పోసాని మాట్లాడారు అని.. జనసైనికులు, పవర్‌స్టార్ ఫ్యాన్స్ రగిలిపోతున్నారు. అలాంటి పోసాని పరిస్థితి ఏంటి అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
పిఠాపురంలో పవన్ ఓడిపోతారు అన్న శ్యామలకే.. జనసేన కార్యకర్తలు చుక్కలు చూపిస్తున్నారు. అలాంటిది పోసాని వదులుతారా.. నెక్ట్స్ వేసేది నిన్నే గురూ అంటూ వార్నింగ్‌లు పంపుతున్నారు. ఇప్పటికే నట్టికుమార్‌లాంటి వాళ్లు పోసాని మీద యుద్ధం ప్రకటించారు. అన్ని తలుపులు మూసేసి, పాలవాడు వచ్చినా పోసాని తీయడం లేదని.. భయంతో వణికిపోతున్నారని అంటున్నారు. ఇదంతా ఎలా ఉన్నా.. అలీ వైసీపీ ముద్ర నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరి పోసాని ఏం చేస్తారు.. సినిమాలే ముఖ్యం అనుకొని బయటకు వస్తారా.. వైసీపీకి విధేయుడిలా ఉంటారా అనే చర్చ కూడా జరుగుతోంది.