జూన్ 4న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ (AP Assembly), లోక్ సభ ఎన్నికల (Lok Sabha Elections) ఫలితాలు రాబోతున్నాయి. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందన్న దానిపై టెన్షన్ నడుస్తోంది. అధికార వైసీపీతో పాటు టీడీపీ (TDP) కూడా తామే అధికారంలోకి వస్తామని చెప్పుకుంటున్నాయి. ఆ పార్టీ లీడర్లు జూన్ 9న ముహూర్తాలు కూడా పెట్టేశారు. వైసీపీ (YCP) అయితే జగన్ వైజాగ్ లో ప్రమాణం చేస్తాడని చెబితే… చంద్రబాబు (Chandrababu) అమరావతిలో ప్రమాణం చేస్తారని టీడీపీ కూటమి (TDP alliance) అంటోంది. ఈ విషయంలో జగన్ ప్రమాణానికి సంబంధించి ఆ పార్టీ సోషల్ మీడియా మరో హైప్ క్రియేట్ చేసింది. జూన్ 9 కోసం విశాఖలో హోటల్ రూములన్నీ బుక్ అయిపోయాయనీ… బస్సులు, ట్రైన్లల్లో సీట్లు దొరకడం లేదంటూ వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేస్తోంది.
ఈ క్యాంపెయిన్ చూసి ఏపీ జనం కూడా ఆశ్చర్యపోతున్నారు. ఆలూ లేదు చూలు లేదు అన్నట్టు … ఎన్నికల కౌంటింగ్ ఇంకా జరగలేదు… పైగా వైసీపీ, టీడీపీ కూటమి మధ్య టగ్ ఆఫ్ వార్ నడిచింది. ఎవరు గెలుస్తారో… ఎవరు అధికారం చేపడతారో అన్న కన్ ఫ్యూజన్ నడుస్తోంది. ఈ టైమ్ లో వైసీపీ తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందనీ… జూన్ 9న వైజాగ్ లో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయనే ప్రచారం జోరుగా నడుస్తోంది. ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వడానికి వైసీపీ అభిమానులు, నేతలు భారీగా హోటళ్ళు బుక్ చేసుకున్నారనీ… పార్టీ తరపున కొన్ని బ్లాక్ చేశారని వార్తలు హల్చల్ చేశాయి. కానీ ఇది డిజిటల్ యుగం. ఆన్ లైన్లో కొట్టి చూస్తే… అన్ని నిజాలు బయటకు వస్తాయి. మేక్ మై ట్రిప్ వెబ్ సైట్ లేదా యాప్ లోకి వెళ్ళి జూన్ 8, 9 తేదీల్లో వైజాగ్ లో హోటల్ రూమ్స్ కోసం ప్రయత్నిస్తే… అన్నీ ఖాళీగానే కనిపించాయి.
1500 నుంచి 14 వేల రూపాయల వరకూ రోజువారీ రెంట్ కి హోటల్ రూమ్స్ ఖాళీగా ఉన్నాయి. పైగా వీటిల్లో డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. గో ఐబి బో, మైక్ మై ట్రిప్, ఓయో యాప్స్ లో అన్నింట్లోనూ హోటల్ రూమ్స్ ఖాళీలు చూపిస్తున్నాయి. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నుంచి వైజాగ్ కి వచ్చే బస్సుల్లో కూడా సీట్లు ఖాళీగా ఉన్నాయి. వీటిల్లో కూడా కొన్ని ప్రైవేట్ యాప్స్ టిక్కెట్ల రేట్లపై డిస్కౌంట్స్ ఇస్తున్నాయి. సో … జూన్ 9 కోసం వైజాగ్ బ్లాక్ … రూములు ఫుల్ అనేది ఫేక్ క్యాంపెయిన్ అని తేలిపోయింది.