ఏపీలో పోలింగ్ (AP Polling) ముగిసింది. ఫలితాలకు మరో 20రోజులు టైమ్ ఉంది. పోలింగ్ సరళిపై.. పార్టీలన్నీ పోస్ట్‌మార్టం మొదలుపెట్టాయ్. ఎవరికి ఎన్ని.. ఎవరికి ఏంటి అని లెక్కలు వేసుకుంటున్నాయ్. 80శాతానికి పైగా పోలింగ్ నమోదు కావడంతో.. ఈసారి ఫలితాల్లో సంచలనాలు ఖాయం అనే టాక్ వినిపిస్తోంది. ఇదంతా ఎలా ఉన్నా.. వైసీపీ (YCP) లో కొందరి ఓటమి ముందే ఖాయంగా కనిపిస్తోంది. మంత్రులు, మాజీ మంత్రులు కూడా ఈ లిస్ట్‌లో ఉన్నారు. కచ్చితంగా ఓడిపోతారు అనుకునే లిస్ట్‌లో.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తిట్టిన చాలామంది నేతలు ఉండడం హైలైట్. నిజానికి పవన్‌ను తిట్టేందుకు వైసీపీలో ఓ బ్యాచ్ ఉంటుంది.
కేవలం జనసేనను(Janasena), సేనానిని తిట్టడమే వాళ్ల పనా అన్నట్లు కనిపిస్తుంటుంది సీన్. మూడు పెళ్లిళ్లు అని, దత్తపుత్రుడు అని, కాపులను చంద్రబాబు దగ్గర తాకట్టు పెట్టారని.. ఇలా పవన్ టార్గెట్‌గా తిట్ల దండకం చదివిన నేతలందరూ.. ఓటమి చవిచూసే పరిస్థితులు కనిపిస్తున్నాయ్. కేవలం పవన్‌ను తిట్టడమే కారణమా అంటే.. ఇదే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. పవన్ మీద నోరు పారేసుకున్న వాళ్లు.. బండ బూతులు తిట్టిన వాళ్లు.. అసభ్యంగా, అసహ్యంగా మాట్లాడిన వాళ్లు.. వాళ్లందరినీ జనం తిరస్కరించబోతున్నారని తెలుస్తోంది. రాబోయే తీర్పును పోలింగ్ బూతుల దగ్గరే జనం మాట్లాడుకున్నారు. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానితో పాటు పవన్ అంటే అంతెత్తు ఎగిరే పేర్ని నాని, ఆయన కుమారుడు పేర్ని కిట్టుకు జనాలు షాక్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నారు.
ఇక నగరి నుంచి మంత్రి రోజా(Roja), మా కులపోడు అంటూ తిట్టే సత్తెనపల్లి ఎమ్మెల్యే, మంత్రి అంబటి రాంబాబు(Rambabu).. గాజువాకలో గుడివాడ అమర్నాథ్(Amarnath), పెనమలూరులో జోగి రమేష్, కాకినాడలో చంద్ర శేఖర్ రెడ్డి.. వీళ్లందరికీ ఓటమి బోర్డులు రెడీ అయ్యాయ్. నిజానికి ఈసారి పోలింగ్ భారీగా నమోదు కావడంలో మహిళలు, వృద్ధులతో పాటు యూత్ కూడా కీ రోల్ ప్లే చేశారు. యూత్‌లో మెజారిటీ ఫాలోయింగ్ పవన్ కల్యాణ్‌కే ఉంది. ఆ యూత్ అంతా కలిసి వీళ్లను ఓడించడమే పనిగా.. స్టాలిన్ ఫార్ములా ఫాలో అయ్యారట. ఈ లెక్కన పవన్‌ను తిట్టిన ప్రతీ నోరు ఫలితాల రోజు సైలెంట్ అవడం ఖాయం అని.. వాళ్లంతా ఓడిపోవడం తథ్యం అంటూ.. మాట్లాడుకుంటున్నారు జనాలు.