AMBATI RAYUDU: అంబటి రాయుడు క్రికెట్‌లో ఎంత సంచలనమో.. రాజకీయాల్లో కూడా అంతే సంచలనం అయ్యారు. నిలకడలేని తనం, షార్ట్ టెంపర్, దూకుడు స్వభావంతో క్రికెట్ కెరీర్‌ని తొందరగా క్లోజ్ చేసుకున్నారు. సెంకడ్ ఇన్నింగ్స్ పేరుతో పాలిటిక్స్‌లోకి ఎంటరైన రాయుడు.. అంతే వేగంగా ఇంటిముఖం పట్టారు. పట్టుమని పదిరోజులు కూడా కాలేదు.. హ్యాండ్సప్ అన్నారు. ఆడుదాం ఆంధ్రాకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న రాయుడు.. ఆడకుండానే జారుకున్నాడు. వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. రాజకీయాలకు కొంతకాలం దూరంగా ఉంటానని.. త్వరలోనే యాక్షన్ ప్లాన్ ప్రకటిస్తానని తెలిపారు. వైసీపీలో చేరిన పది రోజులకే రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది.
SANKRANTHI HOLIDAYS: జూనియర్ కాలేజీలకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ
ఇంతలోనే ఇలాంటి నిర్ణయం తీసుకోడానికి కారణాలు ఏంటనే చర్చ జరుగుతోంది. వైసీపీకి అంబటి రాయుడు రాజీనామాపై సెటైర్లు వేశారు బుద్దావెంకన్న. ఆడుదాం ఆంధ్రాకు బ్యాట్ పట్టుకొని వచ్చిన క్రికెట్ ప్లేయర్ అంబటి రాయుడికి సీఎం జగన్ మనస్తత్వం అర్థమై బైబై చెప్పేశారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. గుంటూరు జిల్లాకు చెందిన అంబటి రాయుడు కొంత కాలంగా రాజకీయాలపై ఆసక్తి చూపిస్తూ వచ్చారు. మొదటి నుంచి వైసీపీ చేపట్టిన అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నారు. క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటి నుంచి పాలిటిక్స్ పట్ల ఇంట్రస్ట్ చూపించారు. పార్టీలో చేరడానికంటే ముందునుంచే గత కొంతకాలం వైసీపీకి దగ్గరగా ఉన్నారు. గుంటూరు నియోజకవర్గంలో వైసీపీ చేపట్టిన ప్రతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరు అనుకున్నట్లుగానే వారం క్రితమే పార్టీలో చేరారు. గతనెల 28న సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. ఏపీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను చూసి పార్టీలో చేరినట్లు ప్రకటించారు. కాపు సామాజికవర్గానికి చెందిన వ్యక్తి, పైగా మాజీ క్రికెటర్ పార్టీలో చేరడం ప్లస్ అవుతుందని భావించింది వైసీపీ.
టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో కాపు ఓటుబ్యాంకును చీల్చడానికి రాయుడును పోలిటికల్‌గా వాడుకోవాలని వైసీపీ భావించింది. పనిలో పనిగా కాపుల ఎఫెక్ట్ ఎక్కువగా ఉండే ఉభయగోదావరి జిల్లాల్లో కూడా అంబటి రాయుడు పర్యటనలు ఏర్పాటు చేసుకున్నారు. అంతలో రాజీనామా చేసి బయటకు వెళ్లిపోయారు. అయితే అంబటి రాయుడి ఎగ్జిట్‌పై సజ్జల ఆసక్తికర కామెంట్ చేశారు. అసలే ఉద్దేశంతో ఆయన పార్టీలో చేరారో కూడా తెలియదన్నారు. కారణాలు తెలిశాక మాట్లాడుకుందామని అన్నారు సజ్జల. వాస్తవానికి గుంటూరు లోక్‌సభ లేకుంటే, అసెంబ్లీ నుంచి పోటీ చేయాలనుకున్నారు రాయుడు. అదే హామీతో పార్టీలో చేరారు. గుంటూరు ఎంపీ స్థానం కన్ఫర్మ్ అని కూడా పార్టీ వర్గాల్లో చర్చ జరిగింది. అయితే సర్వే నివేదికలు అంబటి రాయుడికి అనుకూలంగా లేకపోవడం…గెలవరనే రిపోర్టు రావడంతో సీటుపై హామీ దక్కలేదని తెలుస్తోంది. నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలును గుంటూరు నుంచి పోటీ చేయించాలని అధిష్ఠానం భావిస్తోందని సమాచారం. అందుకే రాయుడిని మచిలిపట్నం నుంచి పోటీ చేయమన్నట్లు వార్తలు వచ్చాయి.
REVANTH REDDY: 6 వద్దు 9 ముద్దు.. 6ను నమ్ముకుని కేసీఆర్ మునిగిపోయాడు.. నేను 9లో ఉంటా..
గత ఆరేడు నెలల నుంచి గుంటూరు ప్రాంతలో తిరుగుతూ అక్కడే పోటీ అనుకుంటుంటే ఇప్పుడు సీట్ మార్చడం, వేరే చోటు నుంచి పోటీకి దిగమని చెప్పడం ఏంటని రాయుడు ప్రశ్నిచారని సమాచారం. ఆశించినట్లు టికెట్ రాకపోవడంతోనే పార్టీకి రాజీనామా చేశారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అంబంటి రాయుడు అనూహ్య నిర్ణయంతో ఆయన అనుచరులు సందిగ్ధంలో పడ్డారు. కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించడంపై పలు సందేహాలు తలెత్తుతున్నాయి. రాయుడు వేరే పార్టీలోకి వెళ్తారా? లేకుంటే ప్రత్యమ్నాయం చూస్తున్నారా అనే ప్రశ్నలు పొలిటికల్ సర్కిల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఏది ఏమైనా పాలిటిక్స్‌ని కూడా రాయుడు క్రికెట్‌లాగే చేశాడని సెటైర్లు పడుతున్నాయి.