ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అదనంగా 30 మంది ఐపీఎస్ లు రాబోతున్నారు. ఏపీలో 2024 అసెంబ్లీ సమావేశంలో భారీ విజయం సాధించిన కూటమి ప్రభుత్వం.. ముఖ్యమంత్రి చంద్రబాబు అభ్యర్థన మేరకు కేంద్ర సానుకులంగా స్పందించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అదనపు ఐపీఎస్‌లను కేటాయించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసిన సీఎం చంద్రబాబు రాష్ట్రంలో ఐపీఎస్‌ల కొరత, ఇతర అంశాలపై వివరించారు. మరో వైపు ఏపీలో గత ప్రభుత్వ హయాంలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా చేసిన విషయం తెలిసిందే.. దీంతో రాష్ట్రా వ్యాప్తంగా 26 జిల్లాలో నిఘా వ్యవస్థ విభాగాల్లో, క్రైం విభాగాల్లో పోలీసు అధికారుల కొరత తీవ్రంగా ఉంది. దీంతో మరింత మంది అధికారుల ఏపీలోకి అవసరముందని ఏపీ కూటమి ప్రభుత్వం విన్నవించారు. గతంలో తెలుగు రాష్ట్రాల విభజన తర్వాత ఐపీఎ్‌సల కొరతను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం తమకు పోలీసు సిబ్బందిని ఎక్కువ మందిని కేటాయించాలని కేంద్రాన్ని కోరినా ఫలితంలేకపోయింది. ఈ విషయంలో ఏపీకి మంచి ఫలితాలు వచ్చాయి. కేంద్రలో ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటులో టీడీపీ పార్టీ కీలక పాత్ర పోషించడంతో ఏపీకి అదనంగా ఐపీఎస్ లు రాబోతున్నారు.
ఈ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ అదనంగా 30 మంది IPS అధికారుల్ని కేటాయించింది. దీంతో ప్రస్తుతం 144గా ఉన్న ఐపీఎస్‌లు సంఖ్య 174కి చేరనుంది.