Anantha Babu case : అనంతబాబు కేసు రీ ఓపెన్? ఈయనకు మూడినట్లేనా ?

వైసీపీ సర్కార్ హయాంలో ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహారం రేపిన రచ్చ అంతా ఇంతా కాదు. కారు డ్రైవర్‌ హత్య కేసులో.. అనంతబాబు మీద కేసు నమోదు కాగా.. ఆ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చారు.

వైసీపీ సర్కార్ హయాంలో ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహారం రేపిన రచ్చ అంతా ఇంతా కాదు. కారు డ్రైవర్‌ హత్య కేసులో.. అనంతబాబు మీద కేసు నమోదు కాగా.. ఆ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చారు. ఐతే ఇప్పుడు ఆ కేసు మళ్లీ ఓపెన్ చేయబోతున్నారా.. అనంతబాబుకు మూడినట్లేనా.. అరెస్ట్ తప్పదా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయ్. అనంతబాు చేతిలో హత్యకు గురైన దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం కేసును ప్రత్యేక విచారణ సంస్థకు అప్పగించాలని ఏపీ పౌరహక్కుల సంఘం డిమాండ్ చేస్తోంది.

నిందితుడు వైసీపీ ఎమ్మెల్సీ కావడంతో.. కేసు నమోదు చేయడం నుంచి విచారణ వరకు అతన్ని కాపాడే ప్రయత్నం చేశారని వారు ఆరోపిస్తున్నారు. హత్య జరిగిన రోజు ఎమ్మెల్సీ గన్‌మెన్లు ఎక్కడున్నారనే కోణంలో విచారణ చేయలేదని అంటున్నారు. దీంతో ఇప్పుడు ఈ కేసు రీ ఓపెన్ చేస్తారా అనే చర్చ జరుగుతోంది. మన్యంలో గిరిజనులని వేధిస్తూ… జగన్ చీకటి దందాలకు సహకరిస్తారని అనంతబాబు మీద ఆరోపణలు ఉన్నాయ్. ఐతే డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంతబాబు వ్యవహారంపై స్పెషల్ ఫైల్ రెడీ అయినట్లుగా తెలుస్తోంది. నిజానికి ఈ కేసులో చాలా మొదటి నుంచి చాలా అనుమానాలు ఉన్నాయ్. ఈ కేసును పోలీసులు సరిగ్గా విచారణ చేయలేదనే విమర్శలు ఉన్నాయ్‌.

అనంతబాబు ఒక్కడే ఈ హత్య చేయలేడని.. మృతదేహాన్ని కారులో ఎక్కించుకుని తీసుకుని రాలేడనే విషయం ఎవరు చెప్పినా పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయ్. పోలీసులు ఈ కేసులో విచారణ చేయలేదని.. చార్జిషీటు వేయలేదని.. అందుకే అనంతబాబుకు సుప్రీంకోర్టులో బెయిల్ వచ్చిందని పలువురు బహిరంగంగానే విమర్శలు చేశారు. ఐతే ఇప్పుడు ప్రభుత్వం మారడంతో ఆ హత్య కేసు దర్యాప్తు పూర్తి స్థాయిలో ఊపందుకోనున్నట్లు తెలుస్తోంది. ఆ దర్యాప్తులో నిర్లక్ష్యంగా వ్యవహరించి హంతకుడికే మద్దతు పలికిన పోలీసులపై కేసులు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి.