New Delhi: అనుభవించు రాణి ! అకౌంట్లో రూ.41.. బిల్లేమో 6 లక్షలు.. ఢిల్లీ హోటల్లో ఏపీ మహిళ బిల్డప్

15 రోజులు అదే హోటల్‌లో ఎంజాయ్ చేసింది. రూ.6 లక్షల రూపాయల బిల్లు అయింది. ఇందులో ఆమె ప్రతి రోజూ స్పాకి వెళ్ళి అందంగా రెడీ అవడానికే రూ.2 లక్షలకుపైగా ఖర్చుపెట్టింది. బిల్లు చేసే పద్ధతి మాత్రం వేరే.

  • Written By:
  • Publish Date - February 1, 2024 / 05:30 PM IST

New Delhi: ఆమె దర్జాగా ఢిల్లీలో ఖరీదైన ఫైవ్ స్టార్ హోటల్ పుల్‌మాన్‌లో దిగింది. 15 రోజులు అదే హోటల్‌లో ఎంజాయ్ చేసింది. రూ.6 లక్షల రూపాయల బిల్లు అయింది. ఇందులో ఆమె ప్రతి రోజూ స్పాకి వెళ్ళి అందంగా రెడీ అవడానికే రూ.2 లక్షలకుపైగా ఖర్చుపెట్టింది. బిల్లు చేసే పద్ధతి మాత్రం వేరే. ప్రతి రోజూ మొబైల్ తీసి, యూపీఐ యాప్ ద్వారా డబ్బులు కడుతూనే ఉంది. కానీ ఫైవ్ స్టార్ హోటల్ బ్యాంక్ అకౌంట్లోకి మాత్రం ఆ పైసలు రావట్లేదు. 15 రోజుల తర్వాత ఆమె బండారం బయటపడింది.

TOLLYWOOD DRUGS: పూరీ రక్తంలో ఆ ఆనవాళ్లు..? డ్రగ్స్‌ కేసులో సంచలన మలుపు

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఝన్సీరాణి అనే మహిళ ఢిల్లీలోని ఏరోసిటీలో ఉన్న కాస్ట్‌లీ హోటల్ పుల్‌మాన్‌‌కు వెళ్లింది. ఇషా దేవ్‌ అనే పేరుతో హౌటల్‌ గదిని బుక్‌ చేసుకొని.. 15 రోజులు అందులోనే లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేసింది. ఓ యాప్ ఓపెన్ చేసి.. స్కాన్ చేసి.. బిల్లు చెల్లించినట్టుగా చూపించేది. చివరకు దాదాపు రూ.6 లక్షలు బిల్లు చేసింది. ఆమె హౌటల్‌ను విడిచి వెళ్లే టైంలో UPI యాప్‌ ద్వారా మళ్ళీ డబ్బులు పేమెంట్‌ చేసినట్టు సిబ్బందికి చూపించింది. అయితే బ్యాంకు అకౌంట్‌లో మాత్రం డబ్బులు పడలేదు. దాంతో హోటల్‌ నిర్వాహకులకు డౌట్ వచ్చి.. పోలీసులకు సమాచారం అందించారు. అప్పుడు ఝాన్సీ రాణి బండారం బయటపడింది. ఆమె వాడుతోంది డూప్లికేట్‌ యాప్‌ అని తేలింది. పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్ళి అసలు ఇంతకీ నీ బ్యాంక్ అకౌంట్‌లో ఎంత డబ్బు ఉందో చూపించమని అడిగారు. ఝాన్సీరాణి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయగానే ఢిల్లీ పోలీసులు షాక్ తిన్నారు.

ఆమె అకౌంట్లో ఉన్నది 41 రూపాయలు మాత్రమే. నిందితురాలు ఝాన్సీరాణి ఉపయోగించిన అకౌంట్‌ నకిలీదని తేలింది. హౌటల్‌ రూం బుక్‌ చేసేటప్పుడు ఇషా దేవ్‌ అని పేరు చెప్పింది. ఆ పేరుతో నకిలీ ఐడెంటిటీ కార్డు కూడా చూపించింది. ఝాన్సీ రాణి మోసం బయటపడటంతో పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు పెట్టి జైలుకు పంపారు. ఢిల్లీ పోలీసులు ఝాన్సీరాణి పూర్తి వివరాల కోసం ఏపీ పోలీసులను సంప్రదించారు. తనతో పాటు తన భర్త డాక్టర్లమని.. అమెరికాలోని న్యూయార్క్‌లో ఉంటామని ఝాన్సీరాణి చెప్పినట్లు పోలీసులు తెలిపారు. ఎయిర్ పోర్ట్ దగ్గర్లోని హోటల్లో అన్నిరోజులు ఎందుకు ఉండాల్సి వచ్చిందో ఎంక్వైరీ చేస్తున్నారు. కానీ 41 రూపాయలతో ఖరీదైన హోటల్‌లో 6 లక్షలు బిల్లు చేయడంపై పోలీసులతో పాటు హోటల్ సిబ్బంది కూడా పరేషాన్ అవుతున్నారు. మొత్తానికి డూప్లికేట్ యాప్ నుంచి డబ్బులు కడుతున్నట్టు నటిస్తూ ఏపీ మహిళ ఝాన్సీ రాణి 15 రోజులపాటు ఆ స్టార్ హోటల్లో లగ్జరీ లైఫ్ అనుభవించింది.