Prashant Kishore : ప్రశాంత్‌ కిషోర్‌ కొత్త పార్టీ.. కార్యక్రమానికి పవన్‌ కళ్యాణ్‌!

ఇండియాలో రాజకీయాల (India Politics) ను కాస్త క్లోజ్‌గా గమనించేవాళ్లుకు ప్రశాంత్‌ కిషోర్‌ (Prashant Kishore) ను పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

 

 

ఇండియాలో రాజకీయాల (India Politics) ను కాస్త క్లోజ్‌గా గమనించేవాళ్లుకు ప్రశాంత్‌ కిషోర్‌ (Prashant Kishore) ను పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటకే చాలా పార్టీలను విజయతీరాలకు చేర్చిన ప్రశాంత్‌ కిషోర్‌ ఎన్నికల వ్యూహాలు రచించడంలో దిట్ట. పార్టీతో పని లేకుండా ప్రాంతాలతో సంబంధం లేకుండా.. ఎంతో మందిని సీఎంలను చేశారు ప్రశాంత్‌ కిషోర్‌. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో చాలా పార్టీకు పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. జస్ట్‌ ప్రశాంత్‌ కిషోర్‌ మాతో ఉంటే చాలు మా పార్టీ గెలుస్తుంది అనుకునే పొలిటీషియన్స్‌ ఇండియాలో చాలా మంది ఉన్నారు అంటే ఆయన రేంజ్‌ ఏంటో అర్థం చేసుకోవచ్చు. పొలిటికల్‌గా అలాంటి ట్రాక్‌ రికార్డ్‌ ఉన్న ప్రశాంత్‌ కిషోర్‌ ఇప్పుడు స్వయంగా కొత్త పార్టీ పెట్టబోతున్నారు.

ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. నిజానికి ప్రశాంత్‌ కిషోర్‌ పొలిటికల్‌ (Political) ఎంట్రీ ఇస్తామనని ఎప్పుడో అనౌన్స్‌ చేశారు. కాంగ్రెస్‌ పగ్గాలు తనకు ఇస్తే కాంగ్రెస్‌ చేరతానని కూడా గతంలో చెప్పాడు. కానీ అప్పుడు అది వర్కౌట్‌ కాలేదు. తరువాత కూడా తను తన పొలిటికల్‌ కన్సల్టెన్సీని పక్కన పెట్టి పూర్తి స్థాయిలో రాజకీయాలపై కాన్సట్రేట్‌ చేస్తానని చప్పారు. అప్పటి నుంచి ప్రజల్లోనే ఉంటూ బిహార్‌తో తన సర్కిల్‌ ప్రజల్లో పెంచుకుంటున్నారు. ఇందుకోసం “జన్‌ సురాజ్‌ అభియాన్‌” (Jan Suraj Abhiyan) పేరుతో యాత్ర కూడా ప్రశాంత్‌ కిషోర్‌ చేస్తున్నారు. గ్రౌండ్‌ లెవెల్‌లో ఉన్న ప్రతీ సమస్యను తెలుసుకుంటున్నారు.

ఇప్పుడు తాను చేస్తున్న యాత్రనే తన పార్టీగా మార్చబోతున్నానంటూ చెప్పి కొత్త సంచలనానికి తెర లేపారు ప్రశాంత్‌ కిషోర్‌. రీసెంట్‌గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పారు. అక్టోబర్‌ 2న గాంధీ జయంతి సందర్భంగా తన పార్టీని ప్రకటిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమానికి లక్ష మంది హాజరయ్యేలా ప్లాన్‌ చేస్తున్నట్టు చెప్పారు. బిహార్ లోని బాపు సభాఘర్‌లో ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. దీనికి సంబంధించిన విధివిధానాలను త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు. 2025లో జరిగే బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో (Bihar Assembly Elections) తమ పార్టీ పోటీచేస్తుందన్నారు. ప్రశాంత్‌ కిషోర్‌ చేసిన ఈ ప్రకటన ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. పొలిటికల్‌ స్ట్రాటజిస్ట్‌గా మంచి ట్రాక్‌ రికార్డ్‌ ఉన్న పీకే.. ఇప్పుడు రియల్‌టైం పొలిటీషియన్‌గా ఎలాంటి రిజల్ట్‌ పొందుతారో చూడాలి.