మాజీ మంత్రి రోజా మెడకు మరో ఉచ్చు బిగిసుకుంటోంది. ఇప్పటికే ఆడుదాం ఆంధ్రా… సీఎం కప్ కార్యక్రమాల కోసం 100 కోట్ల రూపాయలకు పైగా స్కామ్ కి పాల్పడినట్టు ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై AP CID అధికారులు కేసులు కూడా పెట్టారు. ఇది కాకుండా ప్రతి వారం తిరుమలలో ప్రోటోకాల్ దర్శనాల పేరుతో కొంతమందిని తన వెంటబెట్టుకొని వెళ్ళారు. వాళ్ళ దగ్గర భారీగా డబ్బులు వసూలు చేసినట్టు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్ గా ఇంకో స్కామ్ బయటపడింది. అమౌంట్ 10 లక్షలు చిన్న మొత్తమే అయినా… క్రీడాకారులకు సన్మానం అని ప్రభుత్వ కార్యక్రమంగా చూపించి… తన ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, జబర్దస్త్ టీమ్ తో లగ్జరీగా ఖర్చులు పెట్టినట్టు ఆరోపణలు వస్తున్నాయి.
జనవరి ఫస్ట్… కొత్త సంవత్సరం వేడుకలను కొండపల్లిలో అప్పటిమంత్రి హోదాలో రోజా ఘనంగా నిర్వహించారు. ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేశారు. అయితే అది ప్రైవేట్ పార్టీ కాదట. జనం సొమ్ముతో నిర్వహించిన గవర్నమెంట్ ప్రోగ్రామ్. క్రీడాకారులకు సన్మానం పేరుతో ఈ కార్యక్రమం జరిగింది. అయితే ఇందులో అసలు ప్లేయర్లు ఎవరూ పాల్గొనలేదట. రోజా, ఆమెతో పాటు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులే ఎక్కువగా ఉన్నారని టాక్. మస్త్ లగ్జరీగా జరిగిన ఈ పార్టీకి మంత్రి హోదాలోనే రోజా హాజరయ్యారు. ఆమె, కుటుంబసభ్యులు విందులు చేసుకొని… చిందులు చేశారని టీడీపీ లీడర్లు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమంగా నిర్వహించినప్పుడు. అసలు ఈ ప్రోగ్రామ్ లో ప్లేయర్లు ఎవరు వచ్చారని ప్రశ్నిస్తున్నారు. ఇంకో సీక్రెట్ ఏంటంటే… ఈ కార్యక్రమంలో జబర్డస్త్ ఆర్టిసులే ఎక్కువగా పాల్గొన్నారట. మరి వాళ్ళు ఏ యాంగిల్ లో క్రీడాకారులు అని పిలవచ్చో రోజాకే తెలియాలని కామెంట్ చేస్తున్నారు.
ఈ వేడుకల కోసం శాప్ విభాగం నుంచి 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. ప్రతి రోజూ భవానీ ఐలాండ్ నుంచి మూడు పూజల భోజనం కూడా సప్లయ్ చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. కార్యక్రమం పేరేమో… క్రీడాకారులకు సన్మానం… జరిగింది మాత్రం… రోజా, ఆమె కుటుంబసభ్యులు, ఫ్రెండ్స్, జబర్దస్త్ టీమ్ కి ముప్పూటలా భోజనం… విందులు… వినోదాలు… ప్రజల సొమ్మును జల్సాలకు ఖర్చుపెట్టిన మాజీ మంత్రి రోజాపై కేసు నమోదు చేయాలని టీడీపీ నేతలు కోరుతున్నారు. ఆమె ఖర్చుపెట్టిన 10 లక్షలను రికవరీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.