POSTAL BALLOTS : పోస్టల్ బ్యాలెట్స్ ఎవరి తలరాతలు మార్చనున్నాయి

సామాన్యులు ఓట్లు ఎవరికి వేసారు, ఫలితాన్ని ఏ వైపు డిసైడ్ చేయనున్నారు అనే ప్రశ్నలతో పాటు మరొక ప్రశ్న కూడా ఇప్పుడు హాట్ టాపిక్. అవే పోస్టల్ బ్యాలెట్స్ ఎవరి తలరాతలు మార్చనున్నాయి అని..ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు ముందస్తుగా తమ ఓటు హక్కు వినియోగించుకోవడమే పోస్టల్ బ్యాలెట్.

సామాన్యులు ఓట్లు ఎవరికి వేసారు, ఫలితాన్ని ఏ వైపు డిసైడ్ చేయనున్నారు అనే ప్రశ్నలతో పాటు మరొక ప్రశ్న కూడా ఇప్పుడు హాట్ టాపిక్. అవే పోస్టల్ బ్యాలెట్స్ ఎవరి తలరాతలు మార్చనున్నాయి అని..ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు ముందస్తుగా తమ ఓటు హక్కు వినియోగించుకోవడమే పోస్టల్ బ్యాలెట్. ఈసారి ఆంధప్రదేశ్ వ్యాప్తంగా మొత్తం 4.3 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్, హోం ఓటింగ్, ఎసెన్షియల్ సర్వీస్ కేటగిరిలో వచ్చేవారు ముందస్తుగా ఓటు వేశారని ఏపీ ఎన్నికల సంఘం చెప్పింది. 2019 జరిగిన సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే.. ముందస్తు ఓటింగ్ 3.5 రెట్లు ఎక్కువగా నమోదు అవ్వటం ఇక్కడ రికార్డ్.

పోస్టల్ బ్యాలెట్ వేసిన ఉద్యోగుల్లో 1.2 లక్షల మంది సచివాలయ ఉద్యోగులు, 2 లక్షల మంది ఇతర ప్రభుత్వ ఉద్యోగులు.. 40,000 మంది పోలీస్ అధికారులు ఉంటే కాగా ఇంటి నుంచి ఓటు వేసిన వారి సంఖ్య 28వేలు, ఎసెన్షియల్ సర్వీస్ కేటగిరిలో 31వేలమంది పోస్టల్ బ్యాలెట్ ఆప్షన్ ని వినియోగించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో పోస్టల్‌ బ్యాలెట్‌ తొలిరోజునే ఉద్యోగులు కదం తొక్కడాన్ని గమనిస్తే వారు పూర్తిగా ఎటువైపు మొగ్గు చూపారన్నది నిగ్గు తేలుతోంది! కూటమికే వీరంతా జై కొట్టారనేది క్రిస్టల్ క్లియర్. ఓటుతో వైసీపీ సర్కార్‌కు బుద్ధి చెబుతామని ఉద్యోగులు ఎన్నో సందర్భాల్లో చెబుతూ వచ్చారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రారంభం రోజునే ఉద్యోగులు కదం తొక్కటం కూటమికి లాభించబోతోందన్నది అర్ధమౌతోంది. ఏదో నోటి మాటగా ఎందుకు కాస్త లెక్కలు తీసుకుని మాట్లాడుకుంటే… ఎన్టీఆర్‌ జిల్లావ్యాప్తంగా 3 రోజుల పాటు దాదాపుగా 20వేల మంది ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 90శాతానికి పైగా టీడీపీ కూటమికే ఓట్లు వేసినట్టు అర్థమౌతోంది. ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా 17లక్షల మంది ఓటర్లు ఉంటే వీరిలో 20వేల మంది ఉద్యోగులున్నారు. అంటే 1.17 శాతం ఓటర్లు. వారి కుటుంబ సభ్యులను కనీసం ఇద్దరిని కలుపుకుంటే 4 శాతానికి పెరుగుతుంది.ఒక్క పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారానే 3శాతం ఓట్లను ఉద్యోగులు ప్రభావితం చేయగలిగే ఛాన్స్ ఉంటే నేరుగా ప్రత్యక్ష ఎన్నికల్లో వినియోగించుకునే ఉద్యోగులు ఇంకెంత మందిని ప్రభావితం చేస్తారనేది, అసలు చేయగలరా లేదా అనేది కూడా అంచనాలకు అందని ప్రశ్న.

సో… పోస్టల్ బ్యాలెట్స్ మాత్రం దాదాపు 70శాతం కూటమికి ఫేవర్‌గా ఉండనున్నాయి. దీని వల్ల 160 నియోజకవర్గాల్లో తొలి రౌండ్ ఫలితాల్లో కూటమి ఆధిక్యం కనబరిచే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఎందుకు ఉద్యోగులు జగన్ సర్కార్ కు వ్యతిరేకంగా ఉన్నారనే విషయాన్ని రాబట్టేందుకు ప్రయత్నిస్తే రకరకాల కారణాలు చెప్పినప్పిటికి… మరి కొత్తగా ఎన్నికయ్యే ప్రభుత్వం మీ సమస్యలు తీర్చేస్తుందా మీకు హామీలు ఇస్తుందా అనే క్వశ్చన్స్ కు మాత్రం ఎంప్లాయిస్‌ సరైన సమాధానాలు మాత్రం చెప్పలేదు. ఏది ఏమైనప్పటికి వైసీపీ సర్కార్ గద్దె దిగాల్సిందే అనే పంతం క్లియర్ గా కనిపించింది. అయితే ఒక ముఖ్యవిషయాన్ని మాత్రం తప్పకుండా పరిగణించాలి. సామాన్య ఓటర్ల పల్స్‌కు ,ఉద్యోగుల పల్స్‌కు పోలీక తీసుకోవటం అనవసరం అని కొట్టిపారేయలేము, తీసి పారేయలేము ఎందుకంటే… పోస్టల్ బ్యాలెట్స్ 1 శాతానికి సమానం అయినప్పటికి… గెలుపుఓటములను డిసైడ్ చేయటం ఆ 1 శాతానికి కొన్నిసార్లు సాధ్యం కనుక…