Home » Andhra_pradesh » Ap New Cabinet Pawan Kalyan With Deputy Cm Along With So Many Departments
AP New Cabinet : ఏపీ నూతన మంత్రి వర్గం.. పవన్ కల్యాణ్ కు డీప్యూటీ సీఎంతో పాటుగా ఇన్ని శాఖల..?
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తన కేబినెట్లోని 24 మంది మంత్రులకు శాఖలు కేటాయించారు. సీఎం చంద్రబాబు నాయుడు తన వద్ద సాధారణ పరిపాలన శాఖ, శాంతిభద్రత శాఖలను ఉంచుకున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా, పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు కేటాయించారు. చంద్రబాబు తనయుడు మంత్రి నారా లోకేశ్‌కు మానవ వనరులు, ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఆర్‌టీజీ శాఖలు ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. టీడీపీ (TDP) – జనసేన (Jana Sena) – బీజేపీ (BJP) – కూటమి తరఫున రాష్ట్ర సీఎంగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం కూడా దేశ ప్రధాని అధ్వర్యంలో జరిగిపోయింది. ఇదే కార్యక్రమంలో ఏపీ నూతన మంత్రివర్గం కూడా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో ఎవరెవరికి ఏ పదవులు వస్తాయి.. ఎవరు ఏ శాఖలో విధులు నిర్వహిస్తారు అనేది తెలుగు రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఆ సమయం రానే వచ్చింది. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తన కేబినెట్లోని 24 మంది మంత్రులకు శాఖలు కేటాయించారు. సీఎం చంద్రబాబు నాయుడు తన వద్ద సాధారణ పరిపాలన శాఖ, శాంతిభద్రత శాఖలను ఉంచుకున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా, పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు కేటాయించారు. చంద్రబాబు తనయుడు మంత్రి నారా లోకేశ్‌కు మానవ వనరులు, ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఆర్‌టీజీ శాఖలు ఇచ్చారు.
ఏపీ మంత్రులకు కేటాయించిన శాఖలు..
చంద్రబాబు నాయుడు ( సీఎం ) – సాధారణ పరిపాలన శాఖ, శాంతి భద్రతలు
కొణిదెల పవన్ కళ్యాణ్ ( డిప్యూటీ సీఎం ) – పంచాయతీరాజ్, పర్యావరణం, అటవీ, గ్రామీణాభివృద్ధి శాఖ, రూరల్ వాటర్ సప్లై, సైన్స్ అండ్ టెక్నాలజీ
నారా లోకేష్ – మానవ వనరులు, ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఆర్‌టీజీ