Pawan Kalyana : పవన్‌ విజయ రహస్యం ఆ రెండు ఉంగరాలేనా?

రాజకీయ నాయకులు (AP Politics) సెలబ్రిటీలు జాతకాలను బాగా నమ్ముతుంటారు. మంచి ముహూర్తంలో చేస్తే చాలు ఏ పని ఐనా సక్సెస్‌ అవుతుంది అనుకునేవాళ్లు చాలా మందే ఉంటారు.

 

 

 

రాజకీయ నాయకులు (AP Politics) సెలబ్రిటీలు జాతకాలను బాగా నమ్ముతుంటారు. మంచి ముహూర్తంలో చేస్తే చాలు ఏ పని ఐనా సక్సెస్‌ అవుతుంది అనుకునేవాళ్లు చాలా మందే ఉంటారు. ఇక జోతిష్యులు చెప్పిన ఉంగరాలు పెట్టుకుంటే తలరాతలు మారిపోతాయి అనుకునేవాళ్లు కూడా ఎక్కువే. ఈ కేటగిరీలో పవర్‌స్టార్‌, జనసేన అధినేత, పిఠాపురం (Pithapuram) ఎమ్మెల్యే పవన్‌ కళ్యాణ్‌ (Pawan Kalyana) ఫ్రంట్‌ లైన్‌లో ఉంటారు. ఏ కార్యక్రమం మొదలు పెట్టిన భారీ పూజలు చేయడం పవన్‌కు ముందునుంచీ అలవాటు. ఇక పవన్‌ చేతికి కూడా రెండు భారీ ఉంగరాలు ఉంటాయి. అవి ఒకటి నాగబంధం ఉంగరం రెండోది కుర్మావతార ఉంగరం.

ఈ నాగ బంధం, కూర్మావతారం ఉంగరాలకు మంచి విశిష్టత ఉంది. నాగ బంధం ఉంగరం విషయానికొస్తే.. నాగుపాము ఆకారంలో ఉండే నాగబంధం ఉంగరం వల్ల అపమృత్యు దోషాలు ఏమైనా ఉంటే.. తొలగిపోతాయి. అనుకోని విపత్తులు, గండాల నుంచి రక్షిస్తుంది. అలాగే ఎలాంటి దుష్ట శక్తులు మనపై పడకుండా ఈ ఉంగరం కాపాడుతుందని పురాణాలు చెబుతున్నాయి. అంతేగాక, రాహు కేతు దోషాలు, నరదిష్టి దోషాల నుంచి విముక్తి లభిస్తుందని పండితులు చెబుతున్నారు. అయితే, ఎవరుపడితే వాళ్లు నాగ బంధం ఉంగరాలు ధరించకూడదని.. జోతిష్యం ఆధారంగానే ధరించాల్సి ఉంటుందని అంటున్నారు.

ఇక కూర్మావతారం ఉంగరం ప్రయోజనాల విషయానికొస్తే.. ఈ ఉంగరం ధరించడం వల్ల అధికార, ధన యోగం సిద్ధిస్తుందనేది విశ్వాసం. అధికార యోగం రావాలంటే దైవబలం కావాలని ఆకాంక్షించేవారు.. ఇలాంటి కూర్మావతారం ఉంగరాలు ధరిస్తారని జ్యోతిష్య శాస్త్రం వివరిస్తోంది. ఎలాంటి దోషాలు లేకుండా అధికార యోగం కోరుకోవడం వల్లే పవన్ కళ్యాణ్ ఈ రెండు విశిష్టమైన ఉంగరాలు ధరించివుంటారని పండితులు చెబుతున్నారు. ఏది ఏమైనా ఇలాంటి నిష్టలు పాటిస్తారు కాబట్టే పవన్‌ కళ్యాణ్‌కు ఆ స్థాయి భారీ విజయం లభించిందని ఇప్పుడు చర్చ జరుగుతోంది.