AP Assembly Meetings : ఏపీలో ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు.. సమావేశాలకు దూరంగా మాజీ సీఎం వైఎస్ జగన్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. నిన్న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తున్నారు. గవర్నర్ ప్రసంగించిన తర్వాత సభను వాయిదా పడి.. రెండో రోజున సమావేశాలు ప్రరంభం అయ్యాయి. గవర్నర్ ప్రసంగంపై ఇవాళ అసెంబ్లీలో చర్చలు జరుగుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. నిన్న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తున్నారు. గవర్నర్ ప్రసంగించిన తర్వాత సభను వాయిదా పడి.. రెండో రోజున సమావేశాలు ప్రరంభం అయ్యాయి. గవర్నర్ ప్రసంగంపై ఇవాళ అసెంబ్లీలో చర్చలు జరుగుతున్నాయి. అసెంబ్లీ వర్గాల సమాచారం మేరకు ఈ నెల 26 వరకు ఐదు రోజుల పాటు సమావేశాలు జరిగే అవకాశముంది. అలాగే రేపు చర్చ జరగనుంది.

వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేస్తూ ఉపసంహరణ బిల్లును ప్రభుత్వం నేడు సభలో ప్రవేశపెట్టనుంది. అలాగే గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు, ఎక్సైజ్ విధానం, రాష్ట్ర అప్పులు, ఆర్థిక స్థితికి సంబంధించి శ్వేతపత్రాలను విడుదల చేయనుంది. సభ్యులు వీటిపై చర్చించే అవకాశముంది. అసెంబ్లీలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతు.. స్కూళ్లలో నాడు – నేడు పనుల్లో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. దీంతో వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యా వ్యవస్థ ప్రక్షాళన చేస్తామని అసెంబ్లీ సాక్షిగా వెల్లడించారు. కాగా ఈ సమావేశాలకు మాజీ సీఎం వైఎస్ జగన్ దూరంగా ఉన్నారు. కాసేపటి క్రితమే.. మాజీ సీఎం జగన్ తన పార్టీ MLAలతో కలిసి ఢిల్లీకి బయలుదేరారు. రేపు అక్కడ ధర్నా నిర్వహించి, గురువారం రాష్ట్రానికి తిరిగి రానున్నారు. తర్వాత శుక్రవారం ఒక్కరోజు మాత్రమే సమావేశాలు ఉంటాయి. అందువల్ల YCP ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చే అవకాశాలు లేవని తెలుస్తోంది.

Suresh SSM