Babu Chakram : కేంద్రంలో చక్రం తిప్పనున్న బాబు.. స్పీకర్ + నాలుగు మంత్రి పదవులు

సొంతంగా మేజిక్ ఫిగర్ సాధించలేకపోకపోయిన బీజేపీకి ఇప్పుడు మిత్ర పక్షాల మద్దతు తప్పనిసరి అయింది. ఇందులో టీడీపీ, జేడీయూ కీలక భాగస్వాములుగా మారాయి. బాబుకి 16 ఎంపీ సీట్లు ఉంటే, నితీష్ కి 12 మంది ఉన్నారు.

సొంతంగా మేజిక్ ఫిగర్ సాధించలేకపోకపోయిన బీజేపీకి ఇప్పుడు మిత్ర పక్షాల మద్దతు తప్పనిసరి అయింది. ఇందులో టీడీపీ, జేడీయూ కీలక భాగస్వాములుగా మారాయి. బాబుకి 16 ఎంపీ సీట్లు ఉంటే, నితీష్ కి 12 మంది ఉన్నారు. అందుకే ఈ రెండు పార్టీలూ నెక్ట్స్ మోడీ ప్రభుత్వంలో కీలక శాఖలను కోరుతుతున్నాయి.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తమ పార్టీకి లోక్ సభ స్పీకర్ తో పాటు రెండు కేబినెట్, రెండు సహాయ మంత్రులు… మొత్తం ఐదు పదవులు కోరుతున్నట్టు సమాచారం. NDA లో టీడీపీ కీలకం కావడంతో… బీజేపీ పెద్దలు కూడా చంద్రబాబు డిమాండ్లను ఒప్పుకున్నట్టు చెబుతున్నారు.

స్పెషల్ స్టేటస్ కోసం చంద్రబాబు ఇప్పుడే పట్టుబట్టాలన్న డిమాండ్ ఏపీ ప్రజల నుంచి వస్తోంది. ఇలాంటి కీలక సమయంలో ప్రత్యేక హోదా తెచ్చుకుంటే… ఏపీని తొందరగా అభివృద్ధి చేసుకోవచ్చని అంటున్నారు. అటు INDIA కూటమి నుంచి ఏపీకి చట్టబద్ధతతో కూడిన స్పెషల్ స్టేటస్ ఇస్తామనీ… టీడీపీ తమతో కలవాలని కాంగ్రెస్ నుంచి ప్రపోజల్ కూడా వచ్చింది. అయితే బిహార్ కూడా స్పెషల్ స్టేటస్ కు పట్టుబట్టే అవకాశం ఉంది. అందువల్ల అది కుదరకపోయినా… ప్రత్యేక నిధులను కేంద్రం నుంచి కోరాలని అంటున్నారు. ఇదే కాకుండా… అమరావతి రాజధానిగా కొనసాగింపు, కేపిటల్ నిర్మాణానికి ప్రత్యేక నిధులు, పోలవరం ప్రాజెక్టు పూర్తి, విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలోనే ఉండేలా చూడటం, విశాఖకు రైల్వే జోన్, విశాఖ- కాకినాడ పెట్రో కారిడార్ తో పాటు ఏపీలో వెనుకబడిన ప్రాంతాలకు బుందేల్ ఖండ్ తరహాలో ప్యాకేజీ అడగాలన్న డిమాండ్ వస్తోంది.

విభజన టైమ్ లో ఏపీకి ఇచ్చిన హామీలు పెండింగ్ లో ఉన్నాయి. వాటిని కూడా వీలైనంత తొందర్లో ఏపీలోని కూటమి ప్రభుత్వం సాధించాలని కోరుతున్నారు. ఇవన్నీ నెరవేరాలంటే కేంద్రం మంత్రి వర్గంలో కీలక శాఖలు ఏపీకి ఉండాలన్న డిమాండ్ వస్తోంది. అందుకే కీలకమైన జల్ శక్తి, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, ఆరోగ్య శాఖలను బాబు కోరినట్టు సమాచారం. ఏపీ ఖజానాలో చిల్లిగవ్వలేదు… లక్షల కోట్ల రూపాయలతో ఎన్నికల హామీలను నెరవేర్చాల్సిన భాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉంది. ఈ టైమ్ లో చంద్రబాబు చాణిక్యం ప్రదర్శించి… తనదైన శైలిలో కేంద్రం నుంచి నిధులు రాబట్టే అవకాశం ఉందని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి.