ఏపీలో (AP Politics) చంద్రబాబు (Chandrababu) కేబినెట్ లో సీనియర్లకు చోటు దక్కలేదు. మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్న టీడీపీ (TDP) సీనియర్ నేతలు… కేబినెట్ లిస్ట్ చూసి బావురుమన్నారు. ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గోరంట్ల బుచ్చయ్య చౌదరికి కూడా మంత్రి పదవి రాలేదు. ఇక గంటా శ్రీనివాసరావు అయితే చంద్రబాబు తనకు కాకపోతే ఇంకెవరికి ఇస్తారు అని గట్టి నమ్మకం పెట్టుకున్నారు. కానీ ఆయనకీ మొండిచెయ్యే దక్కింది.
ఈసారి చంద్రబాబు నాయుడు (Chandrababu) కేబినెట్ మొత్తం లోకేష్ డిజైన్ చేసిందనీ… ఆయన మార్క్ స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు. 17 మందికి తొలిసారి ఏపీ కేబినెట్ లో ఛాన్స్ దక్కింది.
కొత్తవాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వడంతో… సీనియర్లకు ఛాన్స్ దక్కలేదు. సీనియర్లలో అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, కొలుసు పార్థసారధికి మాత్రమే చంద్రబాబు అవకాశం ఇచ్చారు. గంటా శ్రీనివాసరావుకి కూడా కేబినెట్ లో అవకాశం ఇవ్వలేదు. అందుకు ఎన్నికలకు ముందు గంటా వ్యవహరించిన తీరే కారణమని అంటున్నారు. గంటా శ్రీనివాసరావు (Ganta Srinivas) మొదటి నుంచి గోడమీద పిల్లిలా వ్యవహరించారు. చీపురుపల్లిలో బొత్ససత్యనారాయణపై (Botsa Satyanarayana) పోటీ చేయాలని స్వయంగా చంద్రబాబే ఆదేశించినా… భీమిలీ వదిలిపోవడానికి గంటా ఒప్పుకోలేదు. టీడీపీ ప్రకటించిన ఫస్ట్, సెకండ్ లిస్టుల్లో తన పేరు లేకపోవడంతో… మాజీ సీఎం జగన్ కి టచ్ లో ఉంటూ వైసీపీలో చేరడానికి ప్రయత్నించారు గంటా.. మంత్రి నారాయణ అల్లుడు, తన కొడుకు రవితేజ… నారాయణ సంస్థల్లో డైరెక్టర్. అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దు… తాను మంత్రిగా ఉన్న రోజుల్లో జరిగిన కుంభకోణాల్లో తనపై చర్యలు తీసుకోకూడదు అనే షరతులతో వైసీపీలోకి వెళ్లడానికి ప్రయత్నించారు గంటా శ్రీనివాసరావు. నాలుగేళ్ల పాటు చంద్రబాబుని కలవలేదు. అసెంబ్లీకి కూడా రాలేదు.
నియోజకవర్గాన్ని అసలు పట్టించుకోలేదు. వైసీపీ నేతలతో టచ్ లో ఉంటూ ఏ క్షణమైనా పార్టీ మారిపోవడానికి రకరకాలుగా ప్రయత్నించారు గంటా శ్రీనివాసరావు. అందుకే గంటా విషయంలో కఠినంగా వ్యవహరించారు చంద్రబాబు. 95 వేలకు పైగా మెజారిటీతో గెలిచినప్పటికీ గంటాకి మంత్రి పదవి ఇవ్వొద్దని టీడీపీ అధిష్టానం డిసైడ్ అయింది. పైగా గంటా వియ్యంకుడు నారాయణకు మంత్రి పదవి ఇచ్చారు. గతంలో కాంగ్రెస్, టీడీపీ హయాంలో మినిస్టర్ గా పనిచేశారు. గత ఐదేళ్లపాటు విశాఖలో టీడీపీని పట్టించుకోకపోవడం వల్లే…ఆయనకు మంత్రి పదవి ఇవ్వొద్దని లోకేష్ పట్టుబట్టారు. లోకేష్ అనుకున్నది సాధించాడు. గంటకు బుద్ధి చెప్పాడు. కాపుల్లో ఎలాగో చాలా మంది ఉన్నారు. అందువల్ల గంటాకి మంత్రి పదవి ఇవ్వకపోయినా వచ్చిన నష్టమేమీ లేదనుకున్నారు.