AP CENTRAL CABINET : ఏపీ నుంచి వీళ్ళేనా కేంద్ర మంత్రులు?

ఆంధ్రప్రదేశ్ లో కూటమి (BJP Alliance) ఘన విజయంతో కేంద్రంలో NDA కి మంచి బూస్టింగ్ వచ్చింది. కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో అండగా నిలిచిన ఏపీకి ఎన్ని కేంద్ర మంత్రి పదవులు దక్కుతాయన్న దానిపై చర్చ జరుగుతోంది.

 

 

 

ఆంధ్రప్రదేశ్ లో కూటమి (BJP Alliance) ఘన విజయంతో కేంద్రంలో NDA కి మంచి బూస్టింగ్ వచ్చింది. కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో అండగా నిలిచిన ఏపీకి ఎన్ని కేంద్ర మంత్రి పదవులు దక్కుతాయన్న దానిపై చర్చ జరుగుతోంది. ప్రధాని నరేంద్రమోడీతో పాటు 60 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తోంది. ఇందులో టీడీపీ, జనసేన (JanaSena), బీజేపీ (BJP) నుంచి ఎవరెవరికి కేబినెట్ లో అవకాశం దక్కుతుందన్న దానిపై ఊహాగానాలు నడుస్తున్నాయి.

మంత్రివర్గంలో టీడీపీ (TDP) కి బెర్తులపై చంద్రబాబు ఇప్పటికే బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) తో మాట్లాడారు. టీడీపీ నుంచి మొత్తం నలుగురికి కేంద్ర కేబినెట్ లో చోటు దక్కే ఛాన్సుంది. ఇద్దరికి కేబినెట్ హోదా, మరో ఇద్దరికి సహాయ మంత్రులు ఇస్తారని అంటున్నారు. కేబినెట్ జాబితాలో ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు పేరు మొదటగా వినిపిస్తోంది. శ్రీకాకుళం నుంచి ఆయన హ్యాట్రిక్ కొట్టడంతో పాటు పార్లమెంటులో బాగా మాట్లాడే వ్యక్తి. బీసీ వర్గానికి చెందిన నాయకుడు కూడా. రెండో కేబినెట్ పదవికి గుంటూరు నుంచి ఎంపీగా ఎన్నికైన పెమ్మసాని చంద్రశేఖర్ కు అవకాశముంది. అమెరికాలో బడా పారిశ్రామిక వేత్త, ఎన్నికల అఫిడవిట్ లో వేల కోట్ల రూపాయల ఆస్తులను ప్రకటించి దేశం దృష్టిని ఆకర్షించారు. కేంద్ర మంత్రి వర్గంలో చోటు కల్పిస్తే ఏపీకి పెద్ద ఎత్తున పరిశ్రమలను తీసుకొస్తారని చంద్రబాబు భావిస్తున్నారు. కేంద్ర కేబినెట్ లో అవకాశం ఉన్న మూడో వ్యక్తి వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ఈయన కూడా బడా పారిశ్రామికవేత్త.

గతంలో వైసీపీ (YCP) కి ఆర్థికంగా అండగా ఉన్నారు. ఎన్నికలకు ముందే టీడీపీలో చేరి నెల్లూరు నుంచి గెలిచారు. ఆ జిల్లాలో టీడీపీ క్లీన్ స్వీప్ చేయడంలో వేంరెడ్డి కీలకమని భావిస్తున్నారు. రాయలసీమ కోటాలో అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ పేరు వినిపిస్తోంది. ఈయన వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన నేత. అందువల్ల లక్ష్మీనారాయణ పేరును చంద్రబాబు పరిగణనలోకి తీసుకుంటారని అంటున్నారు. ఇక ఏపీలో జనసేన నుంచి ఇద్దరు ఎంపీలు గెలిచారు. మచిలీపట్నం నుంచి వల్లభనేని బాలశౌరి హ్యాట్రిక్ కొట్టారు. పవన్ కల్యాణ్ కి ఇష్టమైన నేత కూడా. అందువల్ల సీనియర్ అయిన బాలశౌరికి ఛాన్స్ దక్కొచ్చు. బీజేపీ నుంచి పురంధేశ్వరి పదవి ఖాయం అంటున్నారు. ఆమె గతంలో కూడా కేంద్ర మంత్రిగా పనిచేశారు. మరో పదవి ఇస్తే… అనకాపల్లి నుంచి గెలిచిన సీఎం రమేష‌ కి ఛాన్సుంది. NDA కి కీలకంగా మారిన ఏపీకి మాత్రం ఐదుకు తక్కువ కాకుండా కేంద్ర మంత్రి పదవులు దక్కే అవకాశం ఉందని అంటున్నారు.