YCP PALACES : ఏపీ నీ తాత జాగీరా.. ఈ ప్యాలెస్ ల పిచ్చేంటి జగన్ ?

ఏపీలో అమరావతిలో కట్టిన వైసీపీ ఆఫీసును చంద్రబాబు ప్రభుత్వం కూల్చేసింది. వైజాగ్ లో అనుమతుల్లేకుండా కడుతున్న మరో ఆఫీసుకు నోటీసులు ఇచ్చింది. ఇవే కాదు... మొత్తం ఏపీలోని 26 జిల్లాల్లోనూ రాజభవనాలు లాంటి ఆఫీసులను కడుతోంది వైసీపీ.

 

 

ఏపీలో అమరావతిలో కట్టిన వైసీపీ ఆఫీసును చంద్రబాబు ప్రభుత్వం కూల్చేసింది. వైజాగ్ లో అనుమతుల్లేకుండా కడుతున్న మరో ఆఫీసుకు నోటీసులు ఇచ్చింది. ఇవే కాదు… మొత్తం ఏపీలోని 26 జిల్లాల్లోనూ రాజభవనాలు లాంటి ఆఫీసులను కడుతోంది వైసీపీ. 30యేళ్ళు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానన్న వైఎస్ జగన్ ధీమానో… ఏమోగానీ… తక్కువ రేట్లకు ప్రభుత్వ భూములను అప్పనంగా దొబ్బేసింది వైసీపీ. అదే విషయాన్ని ఫోటోలతో సహా బయటపెట్టారు రాష్ట్ర మంత్రి నారా లోకేశ్. ఆంధ్రప్రదేశ్ నీ తాత రాజారెడ్డి జాగీరా… వైసీపీ ఆఫీసులకు 26 జిల్లాల్లో 42 ఎకరాల్ని అప్పనంగా ఇచ్చారు.

వెయ్యి రూపాయల నామమాత్రపు లీజుకి 33 యేళ్ళకు కేటాయించారు. జగన్… నీ ఒక్కడి భూదాహానికి కబ్జా అయిన భూమి విలువ 600కోట్లు అంటే… 42 ఎకరాల్లో 4 వేల 200మంది పేదలకు సెంటు స్థలాలు ఇవ్వొచ్చు. జనం నుంచి దోచుకున్న డబ్బులతో 500 కోట్ల రూపాయలతో ప్యాలెస్ కట్టించావని లోకేశ్ మండిపడ్డారు. 500కోట్లు ఖర్చుపెట్టిన నీ విలాసాల ప్యాలెస్ కి బదులు 25వేల మంది పేదలకు ఇళ్ళు కట్టించవచ్చని ఫైర్ అయ్యారు. జగన్… ఏంటీ ప్యాలెస్ ల పిచ్చి అంటూ నిలదీశారు నారా లోకేశ్. నీ ధనదాహానికి అంతులేదా అని ప్రశ్నించారు.

ఏపీలోని 26 జిల్లాల్లో రాజప్రసాదాలు లాగా వైసీపీ ఆఫీసుల బిల్డింగ్స్ నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇందులో ఒక్క ప్రకాశం జిల్లాలో నిర్మిస్తున్న బిల్డింగ్ కి తప్ప.. మిగతా ఎక్కడా కూడా అనుమతులు లేకుండానే… 30యేళ్ళ అధికారంలో ఉంటాం… మమ్మల్ని ఎవడు అడిగేది అనే ధీమాలో వైసీపీ ఆఫీసులు కడుతున్నారు. వైసీపీకి కేటాయించిన ఈ ప్రభుత్వ స్థలాలన్నీ నేషనల్ హైవేకి దగ్గరగా ఉన్నాయి. పైగా ఖరీదైనవి కూడా. ఇందులో ఉద్యోగులకు, పేదల ఇళ్ళకు, రైతు శిక్షణా కేంద్రాలు, స్పోర్ట్స్ స్టేడియంలు, ఆర్టీసీకి, వివిధ ప్రభుత్వ శాఖలకు కేటాయించిన భూముల్నే వైసీపీ ఆఫీసులకు డైవర్ట్ చేశారు. 25 జిల్లాల్లోని వైసీపీ ఆఫీసుల స్థలాలకు పర్మిషన్లు తీసుకోకుండానే నిర్మిస్తున్నారు. ఇప్పటికే అమరావతిలో వైసీపీ ఆఫీసును టీడీపీ ప్రభుత్వం కూల్చేసింది. వైజాగ్ ఆఫీసుకు నోటీసులు ఇచ్చింది. మిగతా జిల్లాల పరిస్థితి ఏంటనేది చూడాలి. లోకేశ్ ప్రకటన తర్వాత వాటికి కూడా నోటీసులు ఇస్తారా… కూల్చేస్తారా అన్నది రెండు, మూడు రోజుల్లో తేలనుంది.