ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం టైమ్ లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రెండు కళ్ళ సిద్ధాంతం ఎత్తుకోవడంతో ఆ పార్టీ ఇప్పటికీ తెలంగాణలో కోలుకోలేదు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక… ఇక్కడ టీడీపీని వాషవుట్ చేసింది. ఆ పార్టీ లీడర్లందర్నీ కారు ఎక్కించుకొని… మంత్రి పదవులు కూడా ఇచ్చారు కేసీఆర్. క్రమక్రమంగా తెలంగాణలో ఉనికి కోల్పోయిన పార్టీని.. మొన్నామధ్య కాసాని జ్ఞానేశ్వర్ భుజాలకు ఎత్తుకోవడంతో… ఆయన అయినా తులసి నీళ్ళు పోస్తారని అనుకున్నారు. కానీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయకపోవడంతో జ్ఞానేశ్వర్ కూడా కారు ఎక్కేశారు.
ఏపీలో ఐదేళ్ళు జగన్ హయాంలో ఎన్నో ఇబ్బందులు పడి చివరకు అధికారంలోకి వచ్చి సీఎం అయ్యారు చంద్రబాబు నాయుడు. అందుకే ఇప్పుడు కొత్త ఉత్సాహంతో తెలంగాణలో పార్టీని పునరుద్దరించాలని డిసైడ్ అయ్యారు. పైగా ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉంది కూడా తన శిష్యుడు రేవంత్ రెడ్డి కావడం కలిసొచ్చే అంశం. టీటీడీపీ అధ్యక్షుడిగా ఎవర్ని పెట్టినా నాలుగు రోజులు ఉండి పోతున్నారు. అందుకే ఆ పోస్టులో ఎవరైనా ఉండనీయండి… వర్కింగ్ ప్రెసిడెంట్ గా బ్రాహ్మణికి బాధ్యతలు ఇవ్వాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారు. మంగళగిరి అసెంబ్లీ స్థానంలో లోకేష్ భారీ మెజారిటీతో గెలవడంలో బ్రాహ్మణి కీరోల్ పోషించింది. ప్రస్తుతం పాలిటిక్స్ లో బాగా యాక్టివ్ గా ఉంది. గ్లామర్ కి తోడు… జనంలో కలసిపోవడం కూడా అలవాటు చేసుకుంది. అందుకే తెలంగాణలో బ్రాహ్మణిని కీపోస్టులో ఉంచితే … ఇక్కడ కూడా టీడీపీకి పునర్ వైభవం వస్తుందనేది బాబు ఆశ. బ్రాహ్మణికి బాధ్యతలపై లోకేశ్ తో పాటు బాలకృష్ణ కూడా ఓకే చెప్పారట.
ఏపీలో స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబుని అరెస్ట్ చేసినప్పుడు. లోకేశ్ ను కూడా జైలుకు పంపుతారన్న టాక్ నడిచింది. ఆ టైమ్ లో టీడీపీకి ఆల్టర్నేట్ ఎవరన్న ప్రశ్న వచ్చింది. దాంతో నారా బ్రాహ్మణి పేరే ఎక్కువగా వినిపించింది. అంతేకాదు… లోకేశ్ ఢిల్లీలో ఉండి లాయర్లతో సంప్రదింపులు చేస్తుంటే… ఏపీలో బ్రాహ్మణి యాక్టివ్ గా ఉండి చంద్రబాబు అరెస్ట్ ఇష్యూని హైలెట్ చేస్తూ వచ్చారు. జగన్ ప్రభుత్వంపై టీడీపీ నిరసన కార్యక్రమాలను కూడా ఆమే హ్యాండిల్ చేసినట్టు చెబుతున్నారు. ఇటు హైదరాబాద్ లో సెటిలర్స్, ఐటీ పీపుల్, టీడీపీ అభిమానులతో ధర్నాలు చేయించడంలోనూ బ్రాహ్మణి యాక్టివ్ పార్ట్ తీసుకున్నట్టు టాక్ ఉంది. అందుకే తెలంగాణ టీడీపీకి బ్రాహ్మణి సెట్ అవుతుందని చంద్రబాబుతో పాటు లోకేశ్, బాలకృష్ణ కూడా భావిస్తున్నారు. ముందుగా తెలంగాణ టీడీపీకి అధ్యక్షుడిని ప్రకటించాక… ఆ తర్వాత బ్రాహ్మణిని వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తారని అంటున్నారు.