Chandrababu Naidu: 52 రోజుల్లో ఏపీలో టీడీపీ, జనసేన కూటమి అధికారంలోకి రావడం ఖాయమన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. వైసీపీ పాలనకు ఇంకా 52 రోజులే మిగిలి ఉన్నాయన్నారు. బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గం ఇంకొల్లులో శనివారం నిర్వహించిన రా.. కదలిరా బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ పాలనపై సంచలన వ్యాఖ‌్యలు చేశారు. “టీడీపీ, జనసేన సైన్యాన్ని చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో మన గెలుపు ఖాయమని ముందే నిర్థారణ అవుతోంది.
Mallu Bhatti Vikramarka: సినిమా రేంజ్‌లో భట్టి లవ్‌స్టోరీ.. ప్రేమకథలో ఇన్ని ట్విస్ట్‌లా..
జగన్ కౌంట్ డౌన్ ప్రారంభమైంది. వైసీపీ పాలనకు ఇంకా 52 రోజులే మిగిలి ఉన్నాయి. వైసీపీని భూస్థాపితం చేస్తాం. రాజకీయాలను వైసీపీ కలుషితం చేసింది. అడ్డొచ్చిన వైసీపీ నేతలను తొక్కుకుంటూ పోతాం. ఏపీలో 52 రోజుల తర్వాత టీడీపీ-జనసేన కూటమి అధికారంలోకి వస్తుంది. ఎన్నికల ముందే టీడీపీ-జనసేన విజయం ఖాయమైంది. వైనాట్ పులివెందుల అనేదే మన నినాదం. జగన్‌కు అభ్యర్థులు దొరక్క దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఓటేస్తే ఏం జరుగుతుందో ఆలోచించాలి. వైసీపీ పాలనలో నేను, పవన్ కల్యాణ్ సహా అందరం బాధితులమే. దోపిడీని అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారిపై కేసులు పెట్టి వేధిస్తున్నారు. మాట్లాడితే జగన్ బటన్ నొక్కానని చెబుతున్నారు. అందుకే ఆర్టీసీ, విద్యుత్ ఛార్జీలు పెరిగాయి. అమరావతి పూర్తయితే రాష్ట్రం పరిస్థితి మరోలా ఉండేది. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్న జగన్ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు. కేంద్రం సాయం చేస్తామన్నా.. తీసుకోలేని పరిస్థితిలో జగన్ ఉన్నారు.
ఎన్నికల ముందు అమరావతే రాజధాని అని జగన్ చెప్పాడు. ఆ తర్వాత మూడు రాజధానులు అన్నాడు. ఇప్పుడు మళ్లీ హైదరాబాద్ నాలుగో రాజధాని అంటున్నాడు. హైదరాబాద్ పది సంవత్సరాలు ఉమ్మడి రాజధాని. ఇప్పుడు మేం మళ్లీ వస్తాం.. ఓ పక్కన ఉంటాం అంటే ఒప్పుకుంటారా? ఆనాడు బీజేపీతో విభేదించింది ప్రజల కోసం. రాష్ట్రం కోసమే. జగన్ పెట్టే ప్రతి స్కీమ్ వెనుక స్కామ్ ఉంటుంది. ఇలాంటి దోపిడీ ఎప్పుడూ చూడలేదు. జగన్‌ను ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. చిల్లర రాజకీయాలు వద్దు. గౌరవప్రదమైన రాజకీయాలు చేయడం నేర్చుకో” అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.