BABU 3 SIGNS : బాబు తొలి సంతకం ఆ ఫైలు మీదే

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రిగా చంద్రబాబు (Chandrababu) నాయుడు ఈనెల 12న ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అమరావతి (Amaravati) ప్రాంతంలో అందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రిగా చంద్రబాబు (Chandrababu) నాయుడు ఈనెల 12న ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అమరావతి (Amaravati) ప్రాంతంలో అందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే బాబు సీఎం పదవి చేపట్టాక ఏ ఫైల్స్ పై మొదటి సంతకాలు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చినట్టుగా మెగా డీఎస్సీపై మొదటి సంతకంతో పాటు మరో రెండు ఫైల్స్ పైనా సైన్ చేస్తారని అంటున్నారు.

గత వైసీపీ ప్రభుత్వం (YCP Govt) ఎన్నికల ముందు హడావిడిగా డీఎస్సీ నోటిఫికేషన్ (DSC Notification) రిలీజ్ చేసింది. టెట్ (Tet), డీఎస్సీ (DSC) వెంట వెంటనే నిర్వహించాలని భావించింది. అయితే ఉపాధ్యాయ నిరుద్యోగులు హైకోర్టును ఆశ్రయించడంతో ఆ ప్రక్రియకు బ్రేక్ పడింది. చంద్రబాబు (Chandrababu) మాత్రం తాము పవర్ లోకి రాగానే మొదటి సంతకం మెగా డీఎస్సీపై పెడతాననీ… భారీగా టీచర్ పోస్టులు (Teacher posts) భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. హామీ ఇచ్చినట్టే మెగా డీఎస్సీ ఫైల్ పై బాబు ఈనెల 12న ప్రమాణం చేయగానే సైన్ చేసే అవకాశముంది. ఇది కాకుండా… మరో రెండు ఫైళ్ళపై చంద్రబాబు సంతకాలు చేస్తారని అంటున్నారు. భూహక్కు చట్టం రద్దు చేస్తూ సైన్ చేసే ఛాన్సుంది. ఎన్నికల ప్రచారం సమయంలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పై రచ్చ జరిగింది.

తమ భూములను జగన్ లాగేసుకుంటాడని భయపడిన గ్రామీణ ఓటర్లు… టీడీపీ (TDP) కూటమికి జై కొట్టారు. అందుకే భూహక్కు చట్టం రద్దు చేస్తూ చంద్రబాబు రెండో సంతకం చేసే అవకాశముంది. బాబు మూడో సంతకం పెన్షన్ల పెంపుపై ఉండే ఛాన్సుంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రస్తుతం ఉన్న 3వేల ఫించన్… నాలుగు వేల రూపాయలు చేస్తామన్నారు. అది కూడా ఏప్రిల్ నుంచే అందిస్తామని హామీ ఇచ్చారు. అందువల్ల ఏప్రిల్, మే, జూన్ నెలల బకాయిలు మూడు వేలు, జులై నెల ఫించన్ కలిపి మొత్తం 7 వేల రూపాయలు ఇవ్వబోతోంది కూటమి ప్రభుత్వం. ఫించన్ల పెంపుపై చంద్రబాబు 3వ సంతకం చేస్తారని భావిస్తున్నారు.