Chandrababu PPT : బాబు పీపీటీలో బూతు బొమ్మలా ? ఎన్నాళ్ళురా… ఈ ఫేక్ వీడియోలు

ఆంధ్రప్రదేశ్ లో గత ఐదేళ్ళుగా ఫేక్ వీడియోలు ఎంతగా హల్చల్ చేశాయో అందరికీ తెలుసు. వైసీపీ సోషల్ మీడియా నుంచి కొన్ని.... ఆ పార్టీ అభిమానులు మరికొన్ని... ఇలా ఏది రియలో... ఏది ఫేకో అర్థం కాక జనం కన్ ఫ్యూజ్ అయ్యారు. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చినా... ఇంకా ఫేక్ వీడియోల బాధ తప్పడం లేదు. ఇప్పటికీ వైసీపీ నుంచి వస్తున్న ఇమేజెస్, వీడియోలకు కౌంటర్ ఇస్తూ... ఇంకా ఎన్నాళ్ళీ ఫేక్ బతుకులు... ఇది ఫేక్ రా సామీ అంటూ తెలుగుదేశం అధికారిక ట్విట్టర్ మీడియా పోస్టులు చేస్తూనే ఉంది.

  • Written By:
  • Updated On - July 17, 2024 / 01:45 PM IST

ఆంధ్రప్రదేశ్ లో గత ఐదేళ్ళుగా ఫేక్ వీడియోలు ఎంతగా హల్చల్ చేశాయో అందరికీ తెలుసు. వైసీపీ సోషల్ మీడియా నుంచి కొన్ని…. ఆ పార్టీ అభిమానులు మరికొన్ని… ఇలా ఏది రియలో… ఏది ఫేకో అర్థం కాక జనం కన్ ఫ్యూజ్ అయ్యారు. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చినా… ఇంకా ఫేక్ వీడియోల బాధ తప్పడం లేదు. ఇప్పటికీ వైసీపీ నుంచి వస్తున్న ఇమేజెస్, వీడియోలకు కౌంటర్ ఇస్తూ… ఇంకా ఎన్నాళ్ళీ ఫేక్ బతుకులు… ఇది ఫేక్ రా సామీ అంటూ తెలుగుదేశం అధికారిక ట్విట్టర్ మీడియా పోస్టులు చేస్తూనే ఉంది.
రీసెంట్ గా సీఎం చంద్రబాబు నాయుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కి సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఆ వీడియో చూసిన వాళ్ళకి… అంత దారుణం జరిగిందా అని ఆశ్చర్యపోతున్నారు. జగన్ హయాంలో విద్యుత్ శాఖను ఎలా భ్రష్టు పట్టించారో చంద్రబాబు ఈమధ్య పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో చూపించారు. ఆ టైమ్ లో బాబు వేరే స్లయిడ్ కోసం రిమోట్ క్లిక్ చేయగానే… కార్టూన్లతో ఉన్న బూతు బొమ్మలు వచ్చాయి. ఆ తర్వాత బాబు సీరియస్ గా రెస్పాండ్ అయ్యారు. బాగా అలవాటై పోయింది… పనిచేసే విషయంలో ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి అంటూ అధికారులను హెచ్చరించినట్టు వీడియోలో ఉంది. ఈ వీడియోను వైసీపీ అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నిజంగా సీఎం పీపీటీలో బూతు బొమ్మలు వచ్చాయా అని అందరూ షాక్ అవుతున్నారు. కానీ అది నిజం కాదని ఆ తర్వాత తేలింది. విద్యుత్ శాఖ మీద చంద్రబాబు ప్రెజెంటేషన్ ఇస్తున్నప్పుడు… మధ్యలో టెక్నికల్ ఫాల్ట్ తో టీవీ స్క్రీన్ ఆగిపోయింది. దాంతో సీఎం చంద్రబాబు అధికారులపై ఫైర్ అయ్యారు. అయితే ఆ టీవీ స్క్రీన్ ఆగిపోయిన విజువల్ తీసేసి… అక్కడ కార్టూన్ బూతు బొమ్మలను యాడ్ చేసి ఎడిటింగ్ చేశారు కొందరు. ఈ మార్ఫుడ్ వీడియోనే తెగ వైరల్ అవుతోంది. టీడీపీ టెక్నికల్ టీమ్ ఆలస్యంగా రెస్పాండ్ అవడంతో… ఈ మార్ఫుడ్ వీడియోనే ఒరిజినల్ గా వైరల్ అయింది. ఈ ఇష్యూలో వైసీపీ సోషల్ మీడియా అలెర్ట్ నెస్ కనిపిస్తే… టీడీపీ మీడియా ఆలస్యం బయటపడింది.