పాబ్లో ఎస్కోబార్ (Pablo Escobar) గా వరియా.. ఈ పేరు చెప్తే ఓ సందర్భంలో అగ్రరాజ్యం అమెరికా (America) కూడా వణికిపోయింది. అమెరికా అధ్యక్షుడికి, అధికారులకు నిద్రలేకుండా చేసిన పాబ్లో ఎస్కోబార్ పేరు.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ అస్త్రంగా మారింది. పాబ్లో పేరు చుట్టూ ఇప్పుడు పాలిటిక్స్ మండుతున్నాయ్. వైసీపీ అధినేత జగన్ (Jagan) ను జగన్‌ను పాబ్లో ఎస్కోబార్‌తో పోల్చారు ఏపీ సీఎం చంద్రబాబు. కొందరికి అవసరాలు ఉంటాయని, కొందరికి కోర్కెలు ఉంటాయని, కొందరికి పిచ్చి ఉంటుందని.. పిచ్చి పట్టినవాళ్లే ఇలాంటి దందాలు చేస్తుంటారని.. కడిగిపారేశారు. పాబ్లో ఎస్కోబార్‌లా సంపన్నుడు కావాలని జగన్ చేయకూడని పనుల చేశారంటూ.. అసెంబ్లీ సాక్షిగా ఈ డ్రగ్ డెన్ చరిత్ర చెప్పుకొచ్చారు చంద్రబాబు (Chandrababu).
చంద్రబాబు కామెంట్స్ తర్వాత.. పాబ్లో పేరు తెలుగు రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఇలా అన్నారు చంద్రబాబు అంటే.. జగన్ ఆ పేరు కూడా సరిగా పలకలేకపోయారు. ఎన్నిసార్లు ప్రయత్నించినా పాబ్లో ఎస్కోబార్ పేరు.. జగన్ నోటి వెంట రాలేదు. చంద్రబాబు ఆయుధంగా చేసుకున్న పేరు.. జగన్ పలకలేకపోయిన పేరు.. ఇంతకీ ఎవరీ పాబ్లో ఎస్కోబార్ అనే చర్చ సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది. పాబ్లో.. పిల్లల కోసం పాడు పనులు చేసిన ఓ తండ్రి.. కూతురుకు చలేస్తుందంటే నోట్ల కట్టలు మంటల్లో వేడి పుట్టించి కూతురు మొహంలో ఆనందం చూసిన మూర్ఖుడు.. పిల్లల తర్వాతే ఏదైనా, ఏమైనా చేస్తాను అనుకునే సున్నితమైన తండ్రి.. జాలి లేని డ్రగ్ డీలర్, అమెరికాను కొనేసేంత ఆస్తిపరుడు.. అనాధలా చనిపోయిన ఓ డ్రగ్ డెన్. తన చావును తనే రాసుకున్న రాక్షసుడు.. ఇదీ పాబ్లో గురించి నాలుగు ముక్కల్లో చెప్పాలంటే ! కొలంబియాలోని ఓ దిగువ మధ్యతరగతి కుటుంబంలో పట్టాడు పాబ్లో ఎస్కబార్. మొత్తం ఏడుగురు సంతానంలో ఒకడు. చిన్నప్పుడు స్కూల్‌కు సరిగ్గా వెళ్లేవాడు కాదు. ఎక్కడెక్కడో తిరిగేవాడు. చెడు స్నేహాలు అప్పుడే పరిచయం అయ్యాయ్. ఖర్చులకు పేరెంట్స్ డబ్బులు ఇవ్వడం లేదని.. దొంగ లాటరీ టికెట్లు అమ్మేవాడు. మొదట్లో తెలిసిన వారి ద్వారా దొంగ సర్టిఫికెట్లు అమ్మేవాడు.
ఏది ఎక్కువ డిమాండ్ ఉండే.. దాన్ని చేయడం పాబ్లోకు అలవాటు. రాత్రి సమయంలో శ్మశానాల్లోకి చొరబడి.. సమాధుల మీద ఉన్న పాలరాయిని దొంగతనం చేసి.. వాటి పేర్లు చెరిపేసి మళ్లీ విక్రయించేవాడు. దొంగచాటుగా డ్రగ్స్ నింపిన చుట్టలు, సిగరెట్లు అమ్మేవాడు. కారు, బైక్ కనిపిస్తే చాలు.. తన చేతివాటం చూపించేవాడు. ఇలా చిన్నతనంలోనే నేర ప్రవృత్తిని అలవాటు చేసుకున్నాడు పాబ్లో. కార్ల దొంగతనం కేసులో 1974లో మొదటిసారి పాబ్లో అరెస్ట్ అయ్యాడు. జైలుకు వెళ్లడం.. పాబ్లో జీవితాన్ని మార్చేసింది. గంజాయి, కొకైన స్మగ్లింగ్ ముఠాలతో జైలులో పరిచయాలు పెంచుకున్నాడు. చిల్లర దొంగతనాలు ఆపేసి.. డ్రగ్స్ మీద దృష్టిపెట్టడం బెటర్ అనే నిర్ణయానికి వచ్చాడు.
మొదట చిన్న సైజ్ స్మగ్లర్‌గా మారాడు. ఊరికి దూరంగా కొండ ప్రాంతంలో స్థావరం ఏర్పాటు చేసుకున్నాడు. పర్ఫెక్ట్ నాణ్యమైన కొకైన్‌ను సరఫరా చేసేవాడు పాబ్లో. అమెరికావాళ్లకు మనోడి సరుకు అంటే విపరీతమైన ఇష్టం. మొదట్లో స్మగ్లర్‌గా ఉన్న పాబ్లో ఆ తర్వాత.. సొంతంగా కొకైన బిజినెస్ స్టార్ట్ చేశాడు. సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కొని.. దందా చేసేవాడు. పోలీసుల కళ్లు కప్పి వ్యాపారం చేయడానికి పాబ్లో అనుసరించిన విధానాలు రెండే.. లంచాలు ఇవ్వడం, తప్పించుకోవడం.. అదీ కుదరకపోతే బుల్లెట్‌కు పనిచెప్పడం. పాబ్లో వ్యాపారం వెనక బ్రెయిన్ అంతా అతని అన్న రాబర్ట్దే. ఆ సమయంలో డ్రగ్స్ దందాలో ఫ్యాబియో అనే గ్యాంగ్‌స్టర్ ఉండేవాడు. అంతా అతని ఆధిపత్యంలో నడిచేది. ఎవరు డ్రగ్స్ సప్లయ్ చేసినా తనకే ఇవ్వాలనే డిమాండ్ పెట్టేవాడు. ఐతే అలా చేస్తే తనకు మిగిలేది ఏమీ ఉండదని భావించిన పాబ్లో.. ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడు. డ్రగ్స్ దందాకు తనేంటో, తను సృష్టించే భయం ఏంటో పరిచయం చేయాలనుకున్నాడు..
అదే చేశాడు కూడా ! ఫ్యాబియోను అతని గ్యాంగ్ ముందే అత్యంత కిరాతకంగా కాల్చి చంపాడు. ఆ తర్వాత ఆ గ్యాంగ్‌ను తనతో కలుపుకున్నాడు. ప్రతీ ఒక్కరికి బిజినెస్‌లో వాటా ఇచ్చాడు. డ్రగ్స్ దందాకు వన్ అండ్ ఓన్లీ అనేలా మారాడు. మొదట్లో కొద్దిమొత్తంలో అమెరికాకు పంపించే కొకైన్‌ను… ఏకంగా రోజుకు 15టన్నుల ఎగుమతి స్థాయికి చేర్చాడు. తప్పు అని తెలిసినా.. అదే తప్పులు చేసేవాడు. తన వ్యాపారానికి ఎవరు అడ్డు వచ్చినా.. వాళ్లను వదిలేవాడు కాదు పాబ్లో. లొంగిపోయారా సరే.. లేదంటే కిడ్నాప్‌లు, మర్డర్లు. ఇలా పాబ్లో చేతిలో చనిపోయిన వారు, చంపించిన వారిలో పోలీసులు, జడ్జిలు, రాజకీయ నాయకులు ఉన్నారు. 1985లో తనపై విచారణ చేయిస్తున్నారని ఏకంగా కోర్టుపై దాడి చేయించాడు పాబ్లో. 11మంది జడ్జిలను పొట్టనబెట్టుకున్నాడు. అతనికి డబ్బు కావాలి.. డబ్బుతో వచ్చే పేరు కావాలి. దీనికోసే కొలంబియాలో ఇళ్లు కట్టించాడు, ఆసుపత్రులు నిర్మించాడు. పిల్ల్లలకు ఫుట్‌బాల్ కిట్లు, స్కూళ్లు… పెద్దోళ్లకు స్టేడియాలు, చర్చిలు, నిరుపేదలకు చేతి నిండా సొమ్ము, కడుపు నిండా తిండి.. ఇలా చాలా చేశాడు ఎస్కోబార్. పాబ్లోను కూడా దేవుడిలా చూసేవాళ్లు ఉన్నారు అందుకే ! 1980నాటికి అతడు ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన డ్రగ్ కింగ్‌పిన్‌గా మారాడు.
1989లో ప్రపంచంలోనే ఏడో సంపన్నుడిగా పాబ్లో ఉన్నాడంటే అర్థం చేసుకోవచ్చు అతని సంపాదన. తన పలుకుబడితో, పైసలతో.. కొలంబియా అధికారులను తనకు అనుకూలంగా మార్చుకున్నారు. మాములు పోలీసు నుంచి జడ్జిల వరకు.. అందరినీ భయపెట్టి గుప్పిట్లో పెట్టుకొని తన దందాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకున్నాడు. సంపాదనంతా తన పిల్లల కోసమే అని చెప్పి మరీ సంపాదించాడు పాబ్లో. చిన్న చిన్న దేశాల ప్రభుత్వాలు కూడా కూడబెట్టలేనంత.. పాబ్లో ఒక్కడు సంపాదించేవాడు అంటే.. అతని డ్రగ్స్ దందా ఎలా నడిచేదో అర్థం అవుతుంది. రోజుకు 70 మిలియన్ డాలర్లు బిజినెస్ చేసేవారు. కొందరి లెక్కల ప్రకారం ఏడాదికి 21బిలియన్ డాలర్ల పైమాటే! కుప్పలు తెప్పలుగా వచ్చిపడే సొమ్మును కట్టకట్టేందుకు.. రబ్బర్ బ్యాండ్ల కోసమే వారానికి వెయ్యి డాలర్లు ఖర్చు చేశారంటే.. ఆ డబ్బు ఎంతో మీ లెక్కలకే వదిలేస్తున్నాం.
పోగేసిన నోట్ల కట్టల్లో చాలావరకు ఎలుకలు కొట్టేసేవట. డబ్బులను ట్రాన్స్ఫర్ చేసేందుకు ఏకంగా ఓ స్పెషల్ జెట్ విమానాన్నే కొనుగోలు చేశాడు పాబ్లో. ఐతే ఇప్పటివరకు పాబ్లోకు సొంత ఫ్యామిలీ లేదు. తన దగ్గరే పనిచేసే మరియా హెక్టారియోను ఎత్తుకొచ్చి పెళ్లి చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు.. కొడుకు జోన్ పాబ్లో, కూతురు మానియెలా. కుటుంబం అంటే పాబ్లోకు ప్రాణం. వారి కోసం ఏకంగా ఏడు వేల ఎకరాల్లో పెద్ద కోటను నిర్మించాడు. ఇక లక్షల కోట్లను ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో… పేదలకు సాయం చేసేవాడు. ఇలా వచ్చిన మంచిపేరుతో 1982లో కొలంబియా కాంగ్రెస్‌కు పోటీ చేసి ఎంపీగా గెలిచాడు. ఇక్కడే పాబ్లో జీవితం కొత్త మలుపులు తీసుకుంది. ఇలాంటి క్రూరుడు పార్లమెంట్‌కు రావడం ఏంటి అని.. ఓ మంత్రి నుంచి ఆరోపణలు వినిపించాయ్. ఆధారాలు కూడా ఉండడంతో ఎంపీ పదవికి పాబ్లో రాజీనామా చేయాల్సి వచ్చింది. అదే రోజు సాయంత్రం.. ఆ మంత్రిని పాబ్లో దారుణంగా చంపించాడు. ఇదే పాబ్లో చేసిన అతిపెద్ద తప్పు. మంత్రినే చంపించాడు అని.. ప్రభుత్వం అతనిపై నిఘా పెట్టింది. ఈ ప్రాసెస్‌లో ఎన్నో వేల హత్యలు చేశాడు పాబ్లో. పాబ్లో కోసం వెతుకులాట ప్రారంభించారు.
దీంతో ఫ్యామిలీని ఓ రహస్య ప్రాంతానికి పంపించాడు పాబ్లో. ఐతే ఆ ఫ్యామిలీ గురించి సమాచారం ఇస్తున్నాడని.. ఓ ఇన్ఫార్మర్ను పాబ్లో చంపిన తీరు.. ఇప్పుడు తలుచుకున్న ఒళ్లు గగుర్పొచుకునేలా చేస్తుంది. ఆ ఇన్ఫార్మర్ ట్రావెల్ చేస్తున్న ఫ్లైట్‌లో బాంబ్ పెట్టించి చంపించేశాడు. ఈ ఘటనలో వంద మంది అమాయకులు కూడా చనిపోయారు. పాబ్లో క్రూరత్వానికి, మూర్ఖత్వానికి ఇంతకుమించిన ఎగ్జాంపుల్ ఉండదు. ఎస్కోబార్‌కు, అతని ప్రత్యర్థులకూ మధ్య జరిగిన హత్యలతో.. కొలంబియా ప్రపంచ హత్యా రాజధానిగా మారిపోయింది. దీంతో అప్పటివరకూ చూసీ చూడనట్టు ఊరుకున్న కొలంబియా ప్రభుత్వం.. ఎస్కోబార్‌ను టార్గెట్ చేసింది. ఐతే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. కొలంబియా కంటే ఎస్కోబార్ చాలా పెద్దోడు. అతడి స్థాయి, శక్తి పెద్దది. అతడిని ఒంటరిగా ఓడించడం కష్టం. ఇరవై ఏళ్లలో అతడో మహావృక్షమై కూర్చున్నాడు. అందుకే అమెరికా సాయం తీసుకుంది కొలంబియా. అగ్రరాజ్యానికి కూడా.. ఎస్కోబార్‌తో తలనొప్పే. ఎంత కంట్రోల్ చేయాలనకున్నా.. తమ దేశంలోకి కొకైన్‌ను పంపుతూనే ఉండేవాడు పాల్బో. అప్పటికీ వాల్డ్‌వైడ్‌గా 80శాతం డ్రగ్స్ వ్యాపారం ఒక్క ఎస్కోబారే చేతిలోనే ఉండేది.
దీంతో ఇక అతన్ని వదిలేది లేదని డిసైడ్ అయింది అమెరికా. తుపాకులు ఎక్కుబెట్టింది. ఐతే అది అంత ఈజీ కాలేదు. రెండు దేశాలు కలిసి ఓ ఆపరేషన్ నిర్వహిస్తే.. పాబ్లోను వేసేయడానికి ఏడాది పట్టింది. ఆ తర్వాత తన ఇన్‌ఫ్లూయెన్స్‌తో కొలంబియా కాంగ్రెస్‌తో కొత్త చట్టం చేయించుకున్నాడు. ఇక్కడి నేరస్థులను అమెరికా సహా ఏ దేశానికి పంపించేది లేదనే చట్టం తీసుకువచ్చాడు. ఆ తర్వాత 1991లో పాబ్లో పోలీసుల ముందు లొంగిపోయాడు. ఆ తర్వాత ప్రత్యేకంగా జైలు నిర్మించుకొని.. అక్కడి నుంచే సెటిల్మెంట్లు చేసేవాడు. జైల్లోనే నలుగురిని హత్య చేశాడు అంటే.. పాబ్లో తీరు ఎలా సాగేదో అర్థం చేసుకోవచ్చు. ఐతే ఆ తర్వాత జైలు నుంచి నాలుగు కిలోమీటర్లు సొరంగం తవ్వుకొని అక్కడి నుంచి పారిపోయాడు పాబ్లో. బయట భయానక వాతావరణం సృష్టించాడు. దీంతో ఈసారి కొలంబియా పోలీసులు.. అమెరికాతో కలిసి వేట మొదలుపెట్టారు. ఏడాది ఆపరేషన్ తర్వాత.. సరిగ్గా పుట్టినరోజు పాబ్లో.. పోలీసు తూటాలకు బలయ్యాడు. అతను చనిపోవడానికి కారణం పిల్లల మీదే ప్రేమే. తన కొడుకుతో ఫోన్లో మాట్లాడుతూ నిఘా వర్గాలకు అడ్డంగా దొరికిపోయాడు. కొందరి పేర్ల రాసేప్పుడు చరిత్ర కూడా ఎరుపెక్కుతుది.
చరిత్ర కూడా భయపడుతుంది. అలాంటి అందమైన రాక్షసుడే పాబ్లో ఎస్కోబార్ గావిరియా. ఎలా బతకాలో వాడే డిసైడ్ చేసుకున్నాడు. ఎలా బతకొద్దు పాఠంగా మిగిలాడు. చరిత్రలో నరమేథం అనే మాట వచ్చిన ప్రతీసారి.. ఈ పాబ్లో పేరు వినిపిస్తుంటుంది. చరిత్ర కంపిస్తూనే ఉంటుంది. ఇలాంటి పాబ్లోతో ఇప్పుడు జగన్‌ను పోల్చారు చంద్రబాబు. పాబ్లోలో ఉన్న చాలా పోలికలు జగన్‌లో ఉన్నాయని.. ఎస్కోబార్ జైలు నుంచి దందా నడిపిస్తే.. జైలు నుంచి జగన్ రాజకీయం చేశారని.. తన తప్పులు కవర్ చేసుకునేందుకు పాబ్లో ఓ తీవ్రవాద ముఠాను సృష్టిస్తే.. జగన్ పేటీఎం బ్యాచ్ క్రియేట్ చేశాడని.. ఇలా ఎస్కోబార్‌తో జగన్‌ను కంపేర్ చేస్తూ.. చంద్రబాబు మాటల తర్వాత సోషల్ మీడియాలో యుద్ధం మొదలుపెట్టింది టీడీపీ.