చంద్రబాబు ప్రచారం అబ్జర్వ్ చేశారా.. ఎక్కడికి వెళ్లినా.. మందు మాటే ! తక్కువ ధరకే నాణ్యమైన మద్యం ఇస్తామని ప్రకటనలు చేస్తున్నారు. ఆ టైమ్‌కు, ఆ సభలో.. కార్యకర్తల్లో జోష్ కనిపిస్తున్నా.. చంద్రబాబు తనకు తాను సెల్ఫ్‌గోల్ వేసుకుంటున్నారా అనే చర్చ జరుగుతోంది. మందుబాబులను ఆకట్టుకునే పనిలో మహిళల పాలిట చంద్రబాబు విలన్‌గా మారుతున్నారా అనే చర్చ జరుగుతోంది. నిజానికి ఎన్నికలు వస్తే ఏ పార్టీ అధినేత అయినా.. తక్కువ ధరకే నాణ్యమైన వైద్యం.. నాణ్యమైన విద్య.. తక్కువ ధరకే నిత్యావసరాలు ఇస్తామని అంటారు.
నిజానికి చంద్రబాబు ఈ మాటలు కూడా చెప్తున్నారు. ఐతే వీటితో పాటు తక్కువ ధరకే మద్యం అంటూ చంద్రబాబు చేస్తున్న ప్రకటనలే.. ఇప్పుడు గందరగోళానికి దారి తీస్తున్నాయ్. పరోక్షంగా మహిళలకు.. చంద్రబాబు విలన్‌గా మారుతున్నారు అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయ్. సంపూర్ణ మద్యపాన నిషేధం అంటూ గత ఎన్నికల్లో జగన్ హామీ ఇచ్చారు. ఆ హామీ పూర్తి స్థాయిలో నెరవేరేలా కనపడలేదు. పైగా మందుల్లో కొత్త కొత్త బ్రాండ్‌లు.. వైసీపీకి కొత్త తలపోటుగా మారాయ్. ఎంత కవర్ చేసుకున్నా.. జగన్ మీద, ఫ్యాన్ పార్టీ మీద ట్రోలింగ్ ఆగడం లేదు.
ఇక రేట్లు పెంచేసి.. మద్యం ప్రియుల కోపానికి గురవుతున్నాడు జగన్. ఐతే దీన్ని క్యాష్ చేసుకుందామనుకున్నారో.. మరేదైనా కారణమో కానీ.. తక్కువ ధరకే మద్యం అంటూ చంద్రబాబు ప్రకటన చేస్తున్నారు. ఇక్కడే ఆయన సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారనే చర్చ జరుగుతోంది. నాణ్యమైన మద్యం అందుబాటులో లేదని, తాను అధికారంలోకి వస్తే ఆ పని చేస్తానని అంటున్నారు బాబు. సరిగ్గా ఇక్కడే బాబు సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారనే చర్చ జరుగుతోంది.