Chandrababu’s : పొత్తుల్లో ఇండియాలోనే… చంద్రబాబు ఆల్ టైం రికార్డ్

టిడిపి (TDP) అధ్యక్షుడు చంద్రబాబు (Chandrababu) నాయుడు గొప్ప వక్త కాదు. చూడ్డానికి గొప్ప పర్సనాలిటీ కూడా కాదు. పైగా సుదీర్ఘకాలంగా చర్మ రోగంతో బాధపడుతున్నారు. అంత గొప్ప మేధావి కూడా కాదు. విషయ పరిజ్ఞానం కూడా అంతంత మాత్రమే. అయినప్పటికీ ఈ మైనస్ పాయింట్లన్నీ అధిగమించి 14 యేళ్ళు ముఖ్యమంత్రి గా, 45 ఏళ్ల పాటు రాజకీయం చేశారు... అంటే దానికి ప్రధానమైన కారణం ఓపిక సహనం. ఎవడు ఏమనుకున్నా పట్టించుకోని తోలు మందం మనస్తత్వం. అదే మరోసారి తనకు తానుగా నిరూపించుకున్నారు చంద్రబాబు.

టిడిపి (TDP) అధ్యక్షుడు చంద్రబాబు (Chandrababu) నాయుడు గొప్ప వక్త కాదు. చూడ్డానికి గొప్ప పర్సనాలిటీ కూడా కాదు. పైగా సుదీర్ఘకాలంగా చర్మ రోగంతో బాధపడుతున్నారు. అంత గొప్ప మేధావి కూడా కాదు. విషయ పరిజ్ఞానం కూడా అంతంత మాత్రమే. అయినప్పటికీ ఈ మైనస్ పాయింట్లన్నీ అధిగమించి 14 యేళ్ళు ముఖ్యమంత్రి గా, 45 ఏళ్ల పాటు రాజకీయం చేశారు… అంటే దానికి ప్రధానమైన కారణం ఓపిక సహనం. ఎవడు ఏమనుకున్నా పట్టించుకోని తోలు మందం మనస్తత్వం. అదే మరోసారి తనకు తానుగా నిరూపించుకున్నారు చంద్రబాబు.

ఢిల్లీ వెళ్లి బిజెపి (BJP) అగ్రనేతలు అమిత్ షా(Amit Shah), జేపీ నడ్డాలతో కూర్చొని ఐదేళ్ల తర్వాత మళ్లీ వాళ్లతో పొత్తులు పెట్టుకుని విజయంతో వెనక్కొచ్చారు TDP అధ్యక్షుడు చంద్రబాబు. బాబు మనస్తత్వం సామాన్య జనానికి అందదు. ఆయన రాజకీయానికి ఒక స్పష్టమైన విధానం, ఒక విలువ, స్థిరత్వం ఏదీ ఉండదు. మీరు ఎన్ని విమర్శలు చేయండి, తిట్టండి, కడిగిపారేయండి. ఆయన అదేం పట్టించుకోరు. ఫైనల్ గా అధికారం చేజిక్కించుకున్నామా లేదా? రూట్ లో వెళ్ళాము అన్నది కాదు పవర్ లోకి వచ్చామా లేదా అన్నది మాత్రమే చంద్రబాబు ముఖ్యం. అందుకోసం ఆయన ఓపిగ్గా వేచి చూస్తాడు. ఆగర్భ శత్రువును కూడా ఆలింగనం చేసుకోగలుగుతాడు. ఆయన తనను తాను ఆ రకంగా మలుచుకోగలిగాడు. దీనిని ఆయన చుట్టూ ఉండే కార్యకర్తలు, కమ్మ సామాజిక వర్గం గొప్ప వ్యూహకర్తగాను, మేధావిగాను అభివృద్ధి ప్రధాతగాను ప్రచారం చేస్తూ ఉంటారు. భారతదేశంలో మిగిలిన పార్టీలు జనం ఓట్లతో గెలుస్తాయి. చంద్రబాబు నాయుడు కేవలం వ్యూహంతో గెలుస్తాడు. అదే చంద్రబాబు గొప్పతనం.

2018లో చంద్రబాబు నాయుడు మోడీ (Modi) ని బిజెపిని తక్కువ అంచనా వేశాడు. వెంటనే ప్రత్యేక హోదా పేరుతో అడ్డం తిరిగి పోయాడు. మోడీని చంద్రబాబు తిట్టిన తిట్లు వింటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. నరేంద్ర మోడీ వ్యక్తిగత జీవితాన్ని కూడా చంద్రబాబు వదిలిపెట్టలేదు. పెళ్ళాన్ని వదిలి పెట్టి దేశం మీద పడ్డాడనీ… నాకు కుటుంబం ఉంది… నీకు కుటుంబం ఉందా? అసలు నీకు కుటుంబ విలువలు తెలుసా… అంటూ మోడీని వ్యక్తిగతంగా చీల్చి చెండాడాడు చంద్రబాబు. 2019లో దారుణంగా ఓడిపోయాక ఆ మరుసటి రోజు నుంచి మళ్లీ బిజెపితో సంబంధాల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టాడు చంద్రబాబు. ఈ ఐదేళ్లలో ఎన్నడూ నేత మాటలు లేదు. వీలున్నప్పుడల్లా ప్రశంసిస్తూనే ఉన్నాడు. అవకాశం దొరికినప్పుడల్లా కనీసం షేక్ హ్యాండ్ ఇవ్వడానికైనా ప్రయత్నిస్తూ వచ్చాడు. ఈ ఐదేళ్ల కృషి ఫలించి మళ్లీ బిజెపి తలుపులు తీసింది. బిజెపి మూడోసారి అధికారంలోకి రావాలి. ఆ ఒక్క అవకాశాన్ని అడ్డం పెట్టుకొని… బిజెపి తలుపు తీయగానే చటుక్కున దూరిపోయాడు చంద్రబాబు.

అవసరాలు… అవకాశాలు… ఈ రెండు మాత్రమే రాజకీయాల్లో ఉంటాయని ప్రతిసారి చంద్రబాబు నిరూపిస్తూనే ఉంటాడు.

భారతదేశంలో అన్ని పార్టీలతోనూ పొత్తులు పెట్టుకున్న ఏకైక పార్టీ తెలుగుదేశం. ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడే. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పుట్టింది తెలుగుదేశం పార్టీ. టిడిపి వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు తన చివరి క్షణం వరకు కాంగ్రెస్ ని వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ఆ పార్టీకి వ్యతిరేకంగా ఆయన నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి… వీపీ సింగ్ ని ప్రధానిగా చేశాడు. అలాంటి టిడిపికి అధ్యక్షుడైన చంద్రబాబు ఏ పార్టీని వ్యతిరేకించి టిడిపి పుట్టిందో ఆ పార్టీతో 2018లో సిగ్గు విడిచి నిర్లజ్జగా తెలంగాణలో పొత్తు పెట్టుకున్నారు. ఏ పార్టీ ఆంధ్రప్రదేశ్ ని రెండు ముక్కలు చేసిందో… తెలుగు రాష్ట్రాల అస్తవ్యస్తం చేసిందో ఆ పార్టీతో ఎలాంటి భయం లేకుండా, జనం ఏమనుకుంటారు అనే భీతి కూడా లేకుండా 2018లో పొత్తు పెట్టుకున్నాడు చంద్రబాబు. అలా ఎందుకు చేసావు అంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి అంటాడు. ఇది తిరుగులేని జవాబు.

చంద్రబాబు ఎలా కావాలంటే అలా తన రాజకీయాన్ని యూ టర్న్ తీసుకోగలుగుతాడు. కానీ సామాన్య జనం ఎలాపడితే అలాగే ఎస్ టర్న్ లు, యూ టర్న్ లు తీసుకోలేరు. కాంగ్రెస్ తో చంద్రబాబు జతకట్టడాన్ని జనం జీర్ణించుకోలేక 2019లో చిత్తు చిత్తుగా ఓడించారు. వెంటనే కాంగ్రెస్ ను వదిలి మళ్లీ బిజెపి వైపు చూడడం మొదలు పెట్టాడు చంద్రబాబు. ఇది ఒకటేనా ఆయన రాజకీయ చరిత్ర మొత్తం పొత్తుల మయమే. 1999 లో బిజెపితో పొత్తు ఎన్డీఏలో భాగస్వామ్యం. 2009 వచ్చేసరికి టిఆర్ఎస్ తో, లెఫ్ట్ పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు. చిరంజీవి PRP తో కూడా పొత్తు కోసం రామోజీరావుతో రాయబారం చేసినా అది ఫలించలేదు. 2014 కి బిజెపి జనసంతో పొత్తు.2018లో కాంగ్రెస్ తో పొత్తు. 2024లో ఇప్పుడు బిజెపి, జన సేనతో మళ్లీ పొత్తు. వామపక్షాలు, కాంగ్రెస్, బిజెపి మూడు పూర్తి భిన్నమైన వైరుధ్యమైన పార్టీలు. ఈ మూడు పార్టీలతో పెట్టుకున్న ఏకైక పార్టీ తెలుగుదేశం. అంటే తెలుగుదేశానికి ఒక స్పష్టమైన రాజకీయ విధానం గాని, విలువలు గాని లేవని చంద్రబాబు నాయుడు ప్రతిసారి నిరూపిస్తూ వచ్చారు.

దీనికి ఆయన వెంట ఉండే కమ్మ సామాజిక వర్గం, మీడియా పెట్టే పేరు వ్యూహం. బాబు గారు గొప్ప వ్యూహకర్త. పార్టీలు గెలుస్తాయి ఓడిపోతాయి. అధికారంలోకి వస్తాయి. అధికారాన్ని కోల్పోతూ ఉంటాయి. కానీ వాటికంటూ ఒక విధానం ఉంటుంది. ఏ విధానం లేకుండా వికారాన్ని చేజిక్కించుకోవడం మాత్రమే ఒక విధానంగా పార్టీలు బతికినప్పుడు వాటికి చరిత్రలో ఒక బ్లాక్ మార్క్ అలాగే ఉండిపోతుంది. చంద్రబాబు కూడా మరోసారి ముఖ్యమంత్రి అవ్వొచ్చు కానీ విలువ లేని రాజకీయం చేశాడు అనే ముద్ర ఎప్పటికీ ఆయనకు అలాగే ఉండిపోతుంది.