Chandrababu : ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీబిజీ.. 11 కేంద్ర మంత్రులతో బాబు భేటి..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీలో బిజీబిజీ షెడ్యూల్ లో ఉన్నారు. బుధవారం గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి సీఎం చంద్రబాబు ప్రత్యేక విమానంలో బయల్దేరి ఢిల్లీకి చేరుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీలో బిజీబిజీ షెడ్యూల్ లో ఉన్నారు. బుధవారం గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి సీఎం చంద్రబాబు ప్రత్యేక విమానంలో బయల్దేరి ఢిల్లీకి చేరుకున్నారు. రాత్రికి ఢిల్లీ అశోకా రోడ్డులోని 50వ నెంబర్ బంగ్లాకు వెళ్లారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమి ఎంపీలతో విందులో పాల్గొన్నారు. రాత్రికి హస్తినలోనే బసచేశారు. ఇవాళ షెడ్యూల్‌లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్రమంత్రులతో చంద్రబాబు అపాయింట్మెంట్ కొరినట్లు.. వారితో సమావేశంకానునట్లు తెలుస్తోంది.

హస్తినలో సీఎం చంద్రబాబు షెడ్యూల్..

సీఎం చంద్రబాబు నేడు, రేపు ఢిల్లీలో బిజీబిజీగా గడపనున్నారు. ఇవాళ ఉ.10.15 గంటలకు PM మోదీతో కీలక అంశాలపై చర్చిస్తారు. మ.12.15కు కేంద్ర రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ భేటి కానున్నారు. ఆ తర్వాత మ.2గంటలకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ సమావేశం కానున్నారు. అనంతరం మ.2.45కు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో సమావేశం కానున్నారు. సా.5.15కు కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో బాబు భేటి కానున్నారు. సా.6 గంటలకు కేంద్ర పెట్రోలియం , సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీతో భేటీ అవుతారు. ఇక రేపు ఉ.9 గంటలకు నీతి ఆయోగ్ CEO సుబ్రహ్మణ్యంతో సమావేశం కానున్నారు. ఉ.10కి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో ఏపీకి కేటాయించబోయే బర్జెట్ పై కీలక విషయాలు చర్చించనున్నారు. ఉ.10.45కు కేంద్ర ఆరోగ్య, సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా తో భేటి కానున్నారు. ఇక చివరిగా మ.12.30కు రామ్‌దాస్ అఠావలెతో సమావేశమవుతారు. అనంతరం తిరిగి ఆంధ్రప్రదేశ్ కు రానున్నారు.