Amaravati : నేడు అమరావతికి చంద్రబాబు..

ఈరోజు ఉదయం 11 గంటలకు గత వైసీపీ ప్రభుత్వ హయంలో కూల్చివేసిన ఉండవల్లిలోని ప్రజావేదిక నుంచి ఆయన పర్యటన ప్రారంభం కానుంది. తర్వాత అమరావతి రాజధానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతంలో పర్యటిస్తారు. గతంలో తాము చేపట్టిన అభివృద్ధి పనులను ఆయన స్వయంగా చూసేందుకు అక్కడు వెళ్తున్నారు.

సీఎం చంద్రబాబునాయుడు నేడు ఏపీ రాజధాని అమరావతిలో పర్యటించనున్నారు. చంద్రబాబు నాయుడు నాలుగో సారి సీఎం హోదాలో.. మొదటిసారిగా పోలవరం పర్యటించారు. ఇక రెండో పర్యటన ఏపీ రాజధాని అమరావతి లో పర్యటించనున్నారు. 2019 ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం.. మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. విశాఖను పరిపాలన రాజధానిగా చేసుకుంటామని అప్పటి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. ఆ తర్వాత అమరావతిలో రాజధాని నిర్మాణాలు పూర్తిగా నిలిచిపోయాయి.

ఈరోజు ఉదయం 11 గంటలకు గత వైసీపీ ప్రభుత్వ హయంలో కూల్చివేసిన ఉండవల్లిలోని ప్రజావేదిక నుంచి ఆయన పర్యటన ప్రారంభం కానుంది. తర్వాత అమరావతి రాజధానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతంలో పర్యటిస్తారు. గతంలో తాము చేపట్టిన అభివృద్ధి పనులను ఆయన స్వయంగా చూసేందుకు అక్కడు వెళ్తున్నారు. ఆ తర్వాత సీడ్‌ యాక్సిస్‌ రోడ్‌, ఆల్‌ ఇండియా సర్వీసెస్‌ అధికారులు, మంత్రులు, న్యాయమూర్తుల క్వార్టర్స్‌లను సీఎం చంద్రబాబు సందర్శిస్తారని నారాయణ తెలిపారు. కాగా ఇప్పటికే సీఆర్డీఏ అధికారులు రాజధాని ప్రాంతంలో పెరిగిన ముళ్లకంపలను తొలగించి చదును చేసే కార్యక్రమాన్నంలో నిమగ్నమయ్యారు. చంద్రబాబు పర్యటన కోసం పిచ్చి మొక్కలను తొలగించి శుభ్రం చేసి ఉంచారు. ఇరిగేషన్ అధికారుల భవన సముదాయాలను ఆయన పరిశీలించనున్నారు. పర్యటన అనంతరం సీఆర్‌డీఏ ఆఫీసులో మీడియాతో మాట్లాడుతారు.