YS SHARMILA: షర్మిలకు ఆ పదవే ఎందుకంటే.. క్యాంపెయినర్‌ కాదు.. చీఫ్‌గా బాధ్యతలు..

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో.. ఎలాగైనా సత్తా చాటేందుకు షర్మిలను పార్టీకి తీసుకున్నారు. స్టార్ క్యాంపెయినర్‌గా షర్మిల బాధ్యతలు స్వీకరిస్తారంటూ జరిగిన ప్రచారం అంతా ఇంతా కాదు. ఐతే ఆమెకు పీసీసీ చీఫ్ బాధ్యతలు అప్పగించేందుకు కాంగ్రెస్ హైకమాండ్‌ రెడీ అయినట్లు తెలుస్తోంది.

  • Written By:
  • Publish Date - January 9, 2024 / 04:53 PM IST

YS SHARMILA: ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయ్. టీడీపీ, వైసీపీ.. రెండు పార్టీలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తుంటే.. బౌన్స్‌బ్యాక్ అయ్యేందుకు కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. పార్టీని బలోపేతం చేసే విషయంలో కాంగ్రెస్‌ అధిష్టానం వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటోంది. కర్ణాటక, తెలంగాణ విజయాలు.. హస్తం పార్టీ పెద్దల్లో జోష్‌ నింపాయ్. ఏపీ మీద హోప్ క్రియేట్‌ చేశాయ్. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో.. ఎలాగైనా సత్తా చాటేందుకు వైఎస్‌ బ్రాండ్‌ షర్మిలను పార్టీకి తీసుకున్నారు.

REVANTH REDDY: శాసన మండలిపై రేవంత్ వ్యాఖ్యలు.. ఫిర్యాదు చేసిన ఎమ్మెల్సీలు..

స్టార్ క్యాంపెయినర్‌గా షర్మిల బాధ్యతలు స్వీకరిస్తారంటూ జరిగిన ప్రచారం అంతా ఇంతా కాదు. ఐతే ఆమెకు పీసీసీ చీఫ్ బాధ్యతలు అప్పగించేందుకు కాంగ్రెస్ హైకమాండ్‌ రెడీ అయినట్లు తెలుస్తోంది. ఐతే షర్మిలకు ఈ లెవల్‌లో ప్రాధాన్యం ఇవ్వడానికి.. పార్టీ చీఫ్ బాధ్యతలు అప్పగించడం వెనక భారీ కారణాలే కనిపిస్తున్నాయ్. రాష్ట్ర విభజన తర్వాత.. ఏపీకి శైలజానాథ్, రఘువీరా రెడ్డి, గిడుగు రుద్రరాజు.. ఏపీ కాంగ్రెస్‌ చీఫ్‌గా పనిచేశారు. ఐతే ఎవరిని కాంగ్రెస్ అధ్యక్షులుగా నియమించినా.. ఏ ప్రభావం కనిపించడం లేదు. ఎలాగూ పార్టీ పూర్తిగా దెబ్బతినడంతో.. ఎంతో కొంత ప్రభావం చూపించేందుకు షర్మిలను తీసుకొచ్చారనే చర్చ రాజకీయ వర్గాల్లో కనిపిస్తోంది.

నిజానికి షర్మిలను పార్టీలో చేర్చుకుని.. ఆమెకు స్టార్ క్యాంపెనర్‌గా బాధ్యతలు అప్పగించాలని భావించింది. అయితే, షర్మిల సోదరుడు ఏపీ సీఎం జగన్‌పై విమర్శలు చేసే విషయంలో ఆమె మొహమాట పడే అవకాశం ఉందని అంచనాకు వచ్చింది. అందుకే.. ఆమెకు ఆ బాధ్యతలు అప్పగించినా.. పెద్దగా యూజ్‌ ఉండదని భావించిన కాంగ్రెస్ అధిష్టానం.. ఆమెకు పీసీసీ అధ్యక్ష బాధ్యతలను అప్పగిస్తే.. పార్టీలో చేరికలను ప్రోత్సహించే విధంగా ప్రయత్నిస్తారని.. అలా అయినా పార్టీని బలోపేతం చేసుకునేందుకు అవకాశం ఉంటుందని కాంగ్రెస్ ఈనిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.