ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాకినాడ జిల్లాలో మూడో రోజు పర్యటన కొనసాగుతోంది. ఈరోజు ఉప్పాడ సముద్ర తీరంలో కోతకు గురవుతున్న ప్రాంతాన్ని ఆయన పరిశీలిస్తున్నారు. తుఫాన్ పరిస్థితులపై ఫొటో గ్యాలరీని పరిశీలించారు. వాకతిప్ప ఫిషింగ్ హార్బర్, సూరప్ప తాగునీటి చెరువును పరిశీలించి.. మత్స్యకార గ్రామాల ప్రజలతో మాట్లాడారు. కొత్తపల్లిలో కోతకి గురికాకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో ఆయన చర్చించారు. పర్యటనకు వెళ్లిన పవన్‌పై స్థానికులు పూలు చల్లి ఘనస్వాగతం పలికారు. సాయంత్రం 4 గంటలకు పిఠాపురంలో వారాహి సభలో పవన్ పాల్గొననున్నారు. తనను గెలిపించిన పిఠాపురం నియోజక వర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రసంగం నిర్వహించనున్నారు. ఈ సభలో డిప్యూటీ సీఎం హోదాలో ఆయన ఇచ్చే ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.