EX Mantri Roja : ఆ ఒక్క తప్పు ముంచేసింది.. రోజా కెరీర్‌ ఇక ముగిసినట్టేనా!

ఎన్నికల్లో ఓడిపోవటం ఏంటో గానీ వైసీపీ నేతల పరిస్థితి మరీ దారుణంగా తయారయ్యింది. ఒకప్పుడు తమకు ఎదురే లేదు అన్నట్టు మాట్లాడిన చాలా మంది నేతలు ఇప్పుడు కనుమరుగైపోయారు.

 

 

 

ఎన్నికల్లో ఓడిపోవటం ఏంటో గానీ వైసీపీ నేతల పరిస్థితి మరీ దారుణంగా తయారయ్యింది. ఒకప్పుడు తమకు ఎదురే లేదు అన్నట్టు మాట్లాడిన చాలా మంది నేతలు ఇప్పుడు కనుమరుగైపోయారు. ప్రభుత్వం విమర్శలు చేయడంలేదు సరికదా.. అసలు మీడియా ముందుకు కూడా చాలా మంది రావడంలేదు. వీళ్లందరిలో మాజీ మంత్రి రోజా పరిస్థితి ఇంకా దారునంగా తయారయ్యింది. ఇక్కడ అన్నిటికంటే హైలెట్‌ పాయింట్‌ ఏంటి అంటే.. సొంత పార్టీ నేతలే రోజాను విమర్శిస్తున్నారు.

నగరిలో వైసీపీ ఓడిపోడానికి రోజానే పెద్ద కారణం అనేది చాలా మంది వైసీపీ నేతలు చెప్తున్న మాట. నిజానికి గనరి సీట్‌ రోజాకు ఇస్తారా లేదా అనే విషయంలో చాలా సస్పెన్స్‌ నడిచింది. కానీ చివరి నిమిషంలో ఆ సీటు రోజాకే ఇచ్చారు జగన్‌. కానీ నగరిలో ఆమెను ఓడించడానికి సొంత పార్టీ నేతలే పని చేశారు అనేది ఇంటర్నల్‌ టాక్‌. ఇందులో నిజమెంత అనే విషయం పక్కన పెడితే.. ఓడిపోయిన తరువాత టీడీపీ నేతల కంటే వైసీపీ నేతల నుంచి రోజాకు ఎక్కువ వ్యతిరేకత వస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు టీడీపీని చంద్రబాబును రోజా అనని మాట లేదు. తన స్థాయిని మర్చిపోయి వ్యక్తిగతంగా తిట్టిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి.

ఇక పవన్‌ను విమర్శించే క్రమంలో మెగా ఫ్యామిలీని, చిరంజీవిని, సినీ ఇండస్ట్రీకి చెందిన చాలా మందిని రోజా విమర్శించారు. దీంతో ఇప్పుడు రెంటికీ చెడ్డ రేవడిలా తయారయ్యింది రోజా పరిస్థితి. రోజాకు ఈ పరిస్థితి రావడానికి ఆమె నోటిదురుసే ఓ కారణం అనేది విశ్లేషకుల మాట. అధికారం ఎవరికీ ఎప్పుడూ శాశ్వతం కాదు అన్న విషయాన్ని రోజా గుర్తుంచుకుంటే ఇవాళ ఆమె పరిస్థితి కాస్తైనా మెరుగ్గా ఉండేది అంటున్నారు చాలా మంది. అధికారంలో ఉన్నప్పుడు టీడీపీని ఓ ఆటాడుకున్న చాలా మందికంటే కూడా ఇప్పుడు రోజానే డేంజర్‌ జోన్‌లో ఉంది. వైసీపీలో ఉన్న వ్యతిరేకత ఒక సమస్య ఐతే.. ఇక టీడీపీలోకి రోజాకు ఎప్పటికీ ఎంట్రీ లేదు. అన్నీ వదిలేసి సినిమాలు చేసుకుందామన్నా.. ఇండస్ట్రీ వ్యక్తులపై ఆమె చేసిన కామెంట్స్‌తో అవకాశాలు రావడం కష్టమే. దీంతో ఆమె కెరీర్‌కు ఈ ఎన్నికతో ఎండ్‌ కార్డ్‌ పడినట్టే అంటున్నారు విశ్లేషకులు. అధినేత మన్నన కోసం తాను ఇరుకున పడ్డ రోజా పరిస్థితి ఇక ముందు ఎలా ఉంటుందో చూడాలి మరి.