Dharmana Prasad Rao : రాజకీయాలకు ధర్మాన గుడ్‌బై…

శ్రీకాకుళం (Srikakulam) జిల్లాపై మంచి పట్టు ఉన్న నాయకుల్లో ధర్మాన ప్రసాద్‌ రావు (Dharmana Prasad) ఒకరు. నిజానికి ఆ జిల్లా నుంచి చాలా కాలంగా వైసీపీకి ఒక అసెట్‌గా ధర్మాన ఉన్నారు. కానీ అలాంటి ధర్మాన ఇప్పుడు ఏకంగా ప్రత్యక్ష రాజకీయాల నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

శ్రీకాకుళం (Srikakulam) జిల్లాపై మంచి పట్టు ఉన్న నాయకుల్లో ధర్మాన ప్రసాద్‌ రావు (Dharmana Prasad) ఒకరు. నిజానికి ఆ జిల్లా నుంచి చాలా కాలంగా వైసీపీకి ఒక అసెట్‌గా ధర్మాన ఉన్నారు. కానీ అలాంటి ధర్మాన ఇప్పుడు ఏకంగా ప్రత్యక్ష రాజకీయాల నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించనప్పటికీ.. భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీచేయబోనని తన స్నేహితులు, సన్నిహితుల వద్ద స్పష్టం చేశారు. ప్రస్తుత రాజకీయాల్లో నాయకులంటే ఏ మాత్రం గౌరవం లేదని.. అనుభవం గల నేతల సలహాలు, సూచనలు తీసుకోవడం అటుంచి, ముసలోడంటూ కించపరిచే తత్వం నాయకత్వాల్లో పెరిగిపోయిందన్నారు ధర్మాన. ఆత్మగౌరవాన్ని చంపుకొని రాజకీయాల్లో కొనసాగడంకంటే, దూరంగా ఉండి పెద్దరికం నిలుపుకోవడం మంచిదన్న నిర్ణయానికి ధర్మాన వచ్చారని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

AP MLC Elections : ఆగస్టు 30న స్థానిక సంస్థల MLC ఉపఎన్నిక..

తనకు 66 ఏళ్లు వచ్చాయని.. షుగర్‌ వ్యాధి (Diabetes) ఉన్నందున ఎన్నికల్లో పోటీచేయలేనని, విస్తృతంగా ప్రచారం చేయలేనని 2024 ఎన్నికల సమయంలోనే జగన్‌కు చెప్పారు ధర్మాన. తన బదులు తన కొడుకు రామ్‌ మనోహర్‌ నాయుడుని శ్రీకాకుళం అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దించాలని కోరారు. అయితే బందరు నుంచి పేర్ని నాని కుమారుడు కృష్ణమూర్తికి.. తిరుపతి నుంచి భూమన కరుణాకరరెడ్డి కుమారుడు అభినయ్.. చంద్రగిరి నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్‌రెడ్డి, గుంటూరు తూర్పు నుంచి షేక్ ముస్తఫా కుమార్తె నూరి ఫాతిమా షేక్‌కు అవకాశమిచ్చిన జగన్.. ధర్మాన కొడుక్కి మాత్రం టికెట్ ఇచ్చేందుకు నిరాకరించారు. ఐ-ప్యాక్ (I-Pack) సర్వేల్లో ధర్మాన ఓడిపో తారని వచ్చినా.. ఆయనే పోటీచేయాలని జగన్ పట్టుబట్టారు.

Chandrababu vs YS Jagan : పాబ్లో ఎస్కోబార్‌తో జగన్‌ను పోల్చిన చంద్రబాబు.. ఇంతకీ ఎవరితను.. అమెరికానే భయపడేంత ఏం చేశాడు?

దీంతో అయిష్టంగానే బరిలోకి దిగారు ధర్మాన. 52 వేలకు పైగా ఓట్ల తేడాతో తన రాజకీయ జీవితంలోనే ఘోరమైన పరాజయాన్ని మూటకట్టుకున్నారు. ఈ ఓటమి ఆయన్ను కలచివేసిందిని ఆయన అనుచరులంటున్నారు. 1989-99ల్లో నరసన్నపేట నుంచి, 2004, 2009 ఎన్ని కల్లో శ్రీకాకుళం నుంచి కాంగ్రెస్ తరపున విజయం సాధించిన ధర్మాన.. నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి, కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి, వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌ రెడ్డి కేబినెట్లలో పలు కీలక శాఖలు నిర్వర్తించారు. ఓ కుంభకోణం ఆరోపణతో 2012లో సీబీఐ కేసు నమోదు చేయడంతో. మంత్రి పదవికి రాజీనామా చేశారు. తర్వాత వైసీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో ఓడిపోయినా 2019లో గెలిచారు. జగన్ కేబినెట్లో (Jagan’s cabinet) రెవెన్యూ మంత్రిగా పనిచేశారు.

Vijayamma, JC Prabhakar : విజయమ్మ, జేసీ భేటీ వెనక.. అసలు సంగతి ఇదా..

నిజానికి రాజకీయాల్లో 66 ఏళ్లంటే ఏమంత పెద్ద వయసు కాదు.. మధుమేహం కూడా పెద్ద సమస్య కాదు. అయితే జగన్ తీరు తన మనస్తత్వానికి సరిపోనందునే ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని ఆయన భావిస్తున్నారని సన్నిహితులు చెబుతున్నారు. వైసీపీలో ఎంతటి సీనియర్ నాయకుడైనా.. పార్టీ కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నా.. జగన్ ముందు వంగి ఉండాల్సిందేనని అంటున్నారు. పైగా ఆయన్ను నలుగురిలో అయినా, ఏకాంతంగా ఉన్నా. ‘సర్’ అనాల్సిందేనని.. తమ నేత వైఎస్ రాజశేఖర్‌ రెడ్డితో తమకున్న చనువుకొద్దీ జగన్‌ను పేరుపెట్టి పిలిస్తే ఆయన సహించరని చెప్తున్నారు. సంప్రదాయ రాజకీయాలకు అలవాటు పడిన ధర్మాన.. వైసీపీ, జగన్ తీరు చూశాక ఇక ప్రత్యక్ష రాజకీయాల్లో ఇమడలేనన్న నిర్ణయానికి వచ్చారని ఆయన సన్నిహితులు అంటున్నారు. వైసీపీలోని కొందరు సీనియర్లు కూడా ధర్మాన బాటలోనే ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్‌బై చెప్పే యోచనలో ఉన్నట్లు పార్టీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి.