YS Jagan, Bharti : భారతి PA ఇన్ని దారుణాలు చేశాడా?

ఏపీలో అధికారం మారింది. రాజకీయ రచ్చకు తెరలేసింది. మాజీ సీఎం జగన్‌ చుట్టూ ఒకదాని తర్వాత ఒకటి వివాదాలు తెరమీదకు వస్తున్నాయ్.

 

 

ఏపీలో అధికారం మారింది. రాజకీయ రచ్చకు తెరలేసింది. మాజీ సీఎం జగన్‌ చుట్టూ ఒకదాని తర్వాత ఒకటి వివాదాలు తెరమీదకు వస్తున్నాయ్. కూటమి సర్కార్ ఇలా కొలువు తీరిందో లేదో.. జగన్ ఇంట్లో ప్రభుత్వ ఫర్నిచర్ ఉంది అంటూ టీడీపీ నుంచి సంచలన ఆరోపణలు తెరపైకి వచ్చాయ్. దాని గురించి చర్చ జరుగుతుండగానే.. వివాదాస్పదంగా మారిన రుషికొండ ప్యాలెస్ వ్యవహారం మరింత సెగలు పుట్టించింది. ఈ నిర్మాణాలపై టీడీపీ తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ నిర్మాణాల కోసం సుమారు 450 కోట్లు ఖర్చు చేశారని.. అవన్నీ జగన్ తన సతీమణి భారతి కోసమే అని కామెంట్లు వినిపించాయ్. ఇలాంటి పరిణామాల మధ్య భారతికి ఊహించని షాక్ తగిలింది. భారతి పీఏ వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్ అయినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో దీనికి సంబంధించి జోరు ప్రారం జరుగుతోంది.

ఈ విషయం వైరల్‌గా మారింది. ఐతే రవీంద్రారెడ్డి వ్యవహారానికి సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయ్. మహిళా నేతలే టార్గెట్‌గా రవీంద్రా రెడ్డి దారుణాలు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయ్. ప్రస్తుత హోంమంత్రి అనిత, వైఎస్ షర్మిళ, సునీత రెడ్డిలాంటి మహిళా నేతలపై.. రవీంద్రా రెడ్డి అనుచిత పోస్టులు పెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయ్. ఉద్దేశ్యపూర్వకంగా పోస్టులు పెట్టడమే కాకుండా అసభ్యకరమైన కామెంట్స్ చేసేవాడనే కామెంట్లు వినిపిస్తున్నాయ్. ఇదే సమయంలో టీడీపీకి చెందిన మహిళలను కించపరిచేలా పోస్టులు పెట్టేవాడని అంటున్నారు. మార్ఫింగ్ చేసిన ఫోటోలతో రచ్చ చేసేవాడని.. టీడీపీ మద్దతుదారులు ఫైర్ అవుతున్నారు.

ఇక అటు చంద్రబాబు, పవన్ కుటుంబ సభ్యులపైనా అసభ్యకరమైన పోస్టులు పెట్టినట్లు మండిడుతున్నారు. ఈ వరుస భారీ ఆరోపణలతో.. భారతి వ్యక్తిగత సహాయకుడు రవీంద్రారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. కడప నుంచి కదిరి వెళ్లే మార్గ మధ్యలో పోలీసులు.. రవీంద్రారెడ్డిని అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది. ఐతే అతన్ని పోలీసులూ అరెస్ట్ చేయలేదని.. ఇదంత టీడీపీ చేస్తున్న ప్రచారం మాత్రమే అని వైసీపీ నేతలు అంటున్నారు.