Lokesh Red Book : లోకేష్‌ రెడ్‌ బుక్‌ ఓపెన్‌ చేశారా? ఏపీలో వరుస దాడులకు కారణం ఏంటి

లోకేష్‌ (Lokesh) రెడ్‌ బుక్‌ (Red Book) ఓపెన్‌ చేశారా ? తాను నోట్‌ చేసుకున్న వ్యక్తుల భరతంపట్టే పని ముందు పెట్టుకున్నారా ? ఏపీలో వరుసబెట్టి జరుగుతున్న దాడులు చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తోంది.

 

 

లోకేష్‌ (Lokesh) రెడ్‌ బుక్‌ (Red Book) ఓపెన్‌ చేశారా ? తాను నోట్‌ చేసుకున్న వ్యక్తుల భరతంపట్టే పని ముందు పెట్టుకున్నారా ? ఏపీలో వరుసబెట్టి జరుగుతున్న దాడులు చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తోంది. ఏపీలో కూటమి అలా గెలిచిందో లేదో.. ఇలా వైసీపీ నేతలను, గత ప్రభుత్వంలో వాళ్లకు సహకరించిన అధికారులను టార్గెట్‌ చేశారు. గతంలో ఏపీ బీవరేజెస్‌ చైర్మన్‌గా పని చేసిన వాసుదేవరెడ్డిపై సీఐడీ (CID) సోదాలు నిర్వహించింది. గత ప్రభుత్వంలో వైసీపీ నేతలకు లాభంచేకూర్చేలా వాసుదేవరెడ్డి వ్యవహించారనేది సీఐడీ వాదన. కేవలం ఇదే కాదు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత చాలా మంది వైసీపీ నేతలపై దాడులు జరుగుతున్నాయి.

ఇక కొడాలి నాని(Kodali Nani), వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) మీద ఇంటికి వెళ్లి మరీ దాడి చేశారు కొందరు యువకులు. కొడాలి నాని ఇంటిపై కోడిగుడ్లతో దాడి చేశారు. వంశీ ఇంటికి గేట్లు పగలగొట్టే ప్రయత్నం చేశారు. నూజివీడులో వైసీపీ కౌన్సిలర్‌పై కత్తులతో దాడి చేశారు. ఈ వ్యక్తిగత దాడుల విషయం పక్కన పెడితే అధికారుల్లో కూడా చాలా మంది మారుస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే జగన్‌ సర్కారులో పని చేసిన చాలా మంది లిస్ట్‌ రెడీ చేశారు చంద్రబాబు. త్వరలోనే తన టీంతో ఈ బ్యాచ్‌ను రీప్లేస్‌ చేయబోతున్నారు.

గత ప్రభుత్వంలో తమను ఇబ్బంది పెట్టిన అధికారుల పేర్లు రెడ్‌బుక్‌లో రాస్తున్నానని లోకేష్‌ బహిరంగ సభలో చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతీ ఒక్కరి అంతు చూస్తానని చెప్పారు. ఇప్పుడు ఎవరెవరు దాడులకు గురవుతున్నారో.. ఏ అధికారుల మార్పు జరుగుతుందో వాళ్లంతా లోకేష్‌ రెడ్‌బుక్‌లో ఉన్నవాళ్లే. దీంతో లోకేష్‌ యాక్షన్‌ మొదలుపెట్టారని అంటున్నారు. ఇదంతా లోకేష్‌ రెడ్‌ బుక్‌ ప్రభావమే అనే టాక్‌ నడుస్తోంది. ఇదే నిజమైతే ఇంకా ఎంతమంది అధికారులపై చర్యలుంటామో చూడాలి.