Babu pramanam : ప్రమాణం స్వీకారంలో ఇబ్బందులు.. బాబు సీరియస్… విచారణకు ఆదేశం

ఏపీ సీఎంగా చంద్రబాబు (Chandrababu) ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎదురైన ఇబ్బందులపై CMO సీరియస్ గా ఉంది. అధికారుల పర్యవేక్షణా లోపంతో అనుకున్న టైమ్ కి గవర్నర్ సహా ముఖ్య అతిధులు స్టేజ్ మీదకు చేరుకోవడంలో ఆలస్యమైంది. సీఎం ప్రమాణానికి బాబు ప్రత్యేకంగా ముహూర్తం పెట్టుకున్నా... ఆ టైమ్ దాటిపోయాక స్టేజ్ మీద ప్రమాణం చేయాల్సి వచ్చింది. దీనికి బాధ్యులెవరన్న దారిపై ఎంక్వైరీ నడుస్తోంది.

ఏపీ సీఎంగా చంద్రబాబు (Chandrababu) ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎదురైన ఇబ్బందులపై CMO సీరియస్ గా ఉంది. అధికారుల పర్యవేక్షణా లోపంతో అనుకున్న టైమ్ కి గవర్నర్ సహా ముఖ్య అతిధులు స్టేజ్ మీదకు చేరుకోవడంలో ఆలస్యమైంది. సీఎం ప్రమాణానికి బాబు ప్రత్యేకంగా ముహూర్తం పెట్టుకున్నా… ఆ టైమ్ దాటిపోయాక స్టేజ్ మీద ప్రమాణం చేయాల్సి వచ్చింది. దీనికి బాధ్యులెవరన్న దారిపై ఎంక్వైరీ నడుస్తోంది.

చంద్రబాబు నాయుడు ఏపీ సీఎంగా కరెక్ట్ గా 11 గంటల 27 నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. కేసరపల్లిలోని ఐటీ పార్క్ పక్కన ఏర్పాటు చేసిన వేదికపై ఆ టైమ్ కి ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో ప్రమాణం చేయాలి. కానీ అధికారులు ఏర్పాట్ల విషయంలో ఘోరంగా విఫలమయ్యారు. రాష్ట్ర గవర్నర్ (Governor) అబ్దుల్ నజీర్ (Abdul Nazir) రావడం లేట్ అవడంతో కార్యక్రమం ఆలస్యమైంది. దాంతో చంద్రబాబు స్టేజీ వెనక గ్రీన్ రూమ్ లో మోడీ సమక్షంలో ముహూర్తం మించి పోకుండా… అనుకున్న టైమ్ కి సీఎంగా ప్రమాణం చేశారు. అసలు గవర్నర్ ఎందుకు ఆలస్యంగా వచ్చారు అన్నదానిపై ఎంక్వైరీ చేశారు. ప్రధాని మోడీకి స్టేజ్ మీదకు స్వాగతం పలికేందుకు గవర్నర్ ముందే రావాల్సి ఉంది. అంతేకాదు… ప్రధాని మోడీకి ఆహ్వానం పలకడానికి ఎయిర్ పోర్ట్ కి కూడా చేరుకోలేకపోయారు.

దీనంతటికీ కారణం… గవర్నర్ కాన్వాయ్ ట్రాఫిక్ లో ఇరుక్కుపోవడమే. అంతకుముందు గవర్నర్ కాన్వాయ్ కి ట్రయల్ రన్ నిర్వహించకపోవడంతో ఈ ఆలస్యం జరిగినట్టు తేలింది. ఈ విషయంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ వైఫల్యాన్ని గుర్తించారు. చంద్రబాబు ప్రమాణం ఉందని తెలిసినా… విజయవాడలో ట్రాఫిక్ ను సరిగా నిర్వహించకపోవడంపై ఉన్నతాధికారులు సీరియస్ గా ఉన్నారు. ఆఖరికి డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కూడా ట్రాఫిక్ లో చిక్కుకొని రెండు కిలోమీటర్లు దాకా నడిచి ప్రాంగణానికి చేరుకున్నారు. ఈ వ్యవహారంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ప్రమాణానికి ఆలస్యం అవడం, ట్రాఫిక్ ఇబ్బందులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై నివేదిక ఇవ్వాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు.