JAGAN HIMALAYAS : హిమాలయాలకు పోదామనుకున్నా.. జగన్ సన్యాసుల్లో కలుద్దామనుకున్నారా ?

జీవితంపై వ్యామోహం తగ్గిపోయి... భగవంతుడి సాన్నిధ్యంలో గడపాలని సన్యాసం తీసుకున్నవాళ్ళు హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసుకుంటారు. లేదంటే ప్రశాంతంగా జీవిస్తారు.

 

 

జీవితంపై వ్యామోహం తగ్గిపోయి… భగవంతుడి సాన్నిధ్యంలో గడపాలని సన్యాసం తీసుకున్నవాళ్ళు హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసుకుంటారు. లేదంటే ప్రశాంతంగా జీవిస్తారు. ఎన్నికల్లో ఓడిపోతే హిమాలయాలకు వెళ్లిపోదామని ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా ఆలోచిస్తున్నారా… ఏమో జగన్ మాటలు వింటుంటే… సన్యాసులకు పొలిటికల్ లీడర్ల నుంచి పోటీ తప్పదేమో అనిపిస్తోంది.

వై నాట్ 175 అంటూ అదో మాయా లోకంలో బతికిన జగన్ కు ఆంధ్ర జనం దిమ్మతిరిగే షాక్ ఇచ్చి 11 సీట్లే కట్టబెట్టారు. ఎగ్జిట్ పోల్స్ సర్వేలు కూడా ఊహించని రీతిలో జనం తీర్పు చెప్పారు. అరే… ఇంత తక్కువ ఎలా వచ్చాయని సామాన్యులు సైతం ఆశ్చర్యపోయారు. మరి ఐదేళ్ళు పాలించి… జనానికి లక్షల కోట్లు పంచిపెట్టినట్టు చెప్పుకున్న మాజీ సీఎం జగన్ కు ఎలా ఉండాలి. ఎన్నికల ఫలితాలు చూశాక ఆయన నైరాశ్యంలో కూరుకుపోయారు. రిజల్ట్స్ చూశాక.. షాక్ అయ్యా… ఇదేంటి ఇంత చేస్తే… రిజల్ట్స్ ఇలా వచ్చాయి. అసలు అన్నీ వదిలేసి హిమాలయాలకు వెళ్ళిపోదాం అనిపించింది. అంటూ తన పార్టీ నేతలు, కార్యకర్తలతో జగన్ కామెంట్ చేశారట. లేటుగా అయినా లేటెస్ట్ గా బయటకు వచ్చాయి ఈ కామెంట్స్. నిజంగా హిమాలయాలకు వెళ్లిపోదామనే అనిపించింది. ఆ షాక్ నుంచి బయటకు రావడానికి రెండు, మూడు రోజుల పైనే పట్టింది. కానీ ఎన్నికల్లో సీట్లు రాకపోయినా… 40 శాతం ఓట్లు వైసీపీకి వచ్చాయి. అంటే అంత పెద్ద సంఖ్యలో జనం మన మీద నమ్మకం పెట్టుకున్నారు. అది చూశాక నిలబడాలి అనిపించి… హిమాలయాలకు వెళ్ళే ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకున్నా అని చెప్పారు జగన్. దాంతో జగన్ సన్యాసుల్లో కలిసే కార్యక్రమం పోస్ట్ పోన్ అయిందట.

సర్వేలు, పథకాలు, రిపోర్టులు, అడ్వైజర్లు అంటూ వాళ్ళ లోకంలోనే బతికిన జగన్… గ్రౌండ్ లెవల్ లో కార్యకర్తలు, నేతలు, ఎమ్మెల్యేల ఇబ్బందులు ఏనాడూ పట్టించుకోలేదు. గ్రౌండ్ లెవల్లో పార్టీకి ఎలాంటి పరిస్థితి ఉందో వైసీపీ కేడర్ నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోకుండా… కాగితాలపై మ్యాజిక్ చేసే ఐప్యాక్, సోషల్ మీడియాను నమ్ముకొని నట్టేట మునిగారు. అయితే జగన్ హిమాలయాల ప్రకటనపై నెటిజెన్స్ భారీగా ట్రోల్ చేస్తున్నారు. ఏంటీ హిమాలయాల్లో కూడా ప్యాలెస్ లు కడదామని ప్లానా… అని ఒకరంటే… అక్కడ కూడా కొండల్ని కొట్టేద్దామనుకున్నారా అని ఇంకొకరు… ప్రపంచంలో అందరికంటే ఎత్తయిన ప్రదేశంలో ప్యాలెస్ కట్టాలని ప్లానేశారా అని ఫోటోలతో సహా మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.