YCP vs TDP : ఎందుకు ఓడిపోయావో అర్థం కావట్లేదా? అయితే ఇదిచూడు..

ఎందుకు ఓడిపోయానో... ఎలా ఓడిపోయానో నాకు అర్థం కావడం లేదు. ఓటమి తర్వాత ఇప్పటికీ రెండు మూడుసార్లు వైసీపీ అధ్యక్షుడు జగన్ బహిరంగంగా చెప్పిన మాట ఇది. పార్టీ నాయకులతోనైతే రోజు చెప్తూనే ఉన్నాడు.

 

ఎందుకు ఓడిపోయానో… ఎలా ఓడిపోయానో నాకు అర్థం కావడం లేదు. ఓటమి తర్వాత ఇప్పటికీ రెండు మూడుసార్లు వైసీపీ అధ్యక్షుడు జగన్ బహిరంగంగా చెప్పిన మాట ఇది. పార్టీ నాయకులతోనైతే రోజు చెప్తూనే ఉన్నాడు. ఎందుకు ఓడిపోయాడో నిజంగా జగన్‌కు అర్థం కావడం లేదా? లేక అర్థంకానట్లు నటిస్తున్నాడా? దేశంలో ఒక ప్రాంతీయ పార్టీకి నాయకుడు, రాజకీయ కుటుంబం నుంచి వచ్చినవాడు. 151 సీట్లతో ప్రభుత్వాన్ని నడిపినవాడు. ఎందుకు ఓడిపోయానో తెలియదంటే… అర్థం కావడం లేదంటే… ఇలాంటి వాడినా జనం ఎన్నుకున్నది అనే డౌట్ కచ్చితంగా వస్తుంది. అందుకే ఈ స్పెషల్ స్టోరీ. ఎందుకు ఓడిపోయాడో… జగన్ ఈ స్టోరీ చూస్తే అర్థం అవుతుంది.

జగన్‌ పదేళ్ల పాలన మొత్తం పగ ప్రతీకారాలతోనే జరిగింది. తనను జైలుకు పంపడానికి సోనియాగాంధీ, చంద్రబాబే కారణమని బలంగా నమ్మే జగన్… అధికారంలోకి రాగానే చంద్రబాబు ఇంటి పక్కనే కట్టిన ప్రజా వేదికను కూల్చి పడేశారు. అది జనం సొమ్ముతో కట్టిన నిర్మాణమని తెలిసి కూడా… అడ్డగోలుగా నిర్ణయం తీసుకున్నారు. రాజధాని అమరావతిలో నిర్మాణాలను ఎక్కడెక్కడ ఆపేశారు. జనం సొమ్ము పోయినా పర్వాలేదు.. తన మాటే నెరవేరాలి అనుకున్నారు జగన్. చంద్రబాబు గవర్నమెంట్‌లో అమలు చేసిన అన్ని పనులకు సంబంధించి టెండర్లను రీకాల్ చేశారు. టీడీపీ నాయకుల్లో ఒక్కొక్కరిపై విడివిడిగా ప్రతీకారదాడులు కొనసాగాయ్‌. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి మైన్స్ మొత్తం మూత వేయించారు. డైరీ అక్రమాలు పేరుతో ధూళిపాల నరేంద్రను లోపలేశారు. అశోక గజపతిరాజు కుటుంబంలో కలహాలు సృష్టించి… సింహాచలం నుంచి ఆయన వెళ్లగొట్టేందుకు ప్రయత్నించారు. ఇక అయ్యన్నపాత్రుడినినైతే ఒక ఆట ఆడుకున్నారు.

రాష్ట్రంలో చిన్న పెద్ద టీడీపీ నాయకుల్ని… మొత్తం మీద ఒక వంద మందిని అరెస్ట్ చేసి లోపల వేశారు. ఎవడు నోరెత్తినా తన్ని లోపల వేయడమే! తన పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజును కూడా అరెస్ట్ చేసి చితక్కొట్టి పంపించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేశారు. నారాయణ విద్యాసంస్థల్ని దాదాపు మూసేసే పరిస్థితి తీసుకొచ్చారు. నారాయణపై కూడా కేసులు పెట్టారు, అరెస్ట్ చేశారు. చివరలో చంద్రబాబును కూడా స్కిల్ కేసులో కేసులు అరెస్ట్ చేసి 52రోజులు జైల్లో పెట్టారు. ఇలా జగన్ పరిపాలన మొత్తం పగ ప్రతీకారాలు… కేసులు, జైలుగానే నడిచాయ్‌. పోలీస్ వ్యవస్థ, ఇంటెలిజెన్స్, సిఐడి, ప్రభుత్వ న్యాయవాదులు మొత్తం రాజకీయ ప్రత్యర్థుల వేటకి ఉపయోగపడ్డారు. అంతేకాదు మంగళగిరి, విజయవాడ పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్‌ను పూర్తిగా కుప్పకూల్చేశారు. రియల్ వ్యాపారులంతా సగం నిర్మాణాల్ని వదిలేసి హైదరాబాద్‌కి పరారైపోయారు. సోషల్ మీడియాలో ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు పెట్టిన, చర్చలు జరిపినా.. కేసులు పెట్టి సీఐడీ ఆఫీస్ చుట్టూ తిప్పారు. చివరికి పవన్ కల్యాణ్‌ విశాఖలో సభ పెట్టుకుంటానంటే కూడా నానా యాగి చేశారు పోలీసులు. పైన జగన్ ఏం చేశాడో కింద ఎమ్మెల్యేలు నుంచి కార్పొరేటర్ల వరకు ఇదే అప్లై చేశారు. జిల్లాల్లో, గ్రామాల్లో తమకు నచ్చనివాడి మీద కేసులు పెట్టించడం.. చితక్కొట్టించడం ఇదే పని మీద కనిపించారు కింది స్థాయి నాయకులు. వీళ్లకు సేవ చేయడానికి మాత్రమే… ఐదేళ్లు ఏపీలో పోలీసులు పని చేశారు. ఈ ఐదేళ్లు నిత్యం ఏదో ఒక వివాదం, ఏదో ఒక రగడ నడుస్తూనే ఉన్నాయ్‌ ఏపీలో అన్‌రెస్ట్ అనేది సాధారణమైపోయింది.

జగన్ జోరు చూసి కింద మంత్రులు ఎమ్మెల్యేలు చెలరేగిపోయారు. ఉత్తరాంధ్ర ఇంచార్జిగా వెళ్లిన ఎంపీ విజయసాయిరెడ్డి… ఆ మూడు జిల్లాలని వణికించేశారు. సామాన్య ఉద్యోగులు. సాదాసీదా వ్యాపారులు కూడా భయపడి పోయే పరిస్థితి వచ్చింది. వ్యాపారాలు పెట్టారు కబ్జాలు చేశారు. రియల్ ఎస్టేట్ వాళ్లందరినీ తమ అదుపులో పెట్టుకున్నారు. తన్ని భూములు లాక్కున్నారు. విజయనగరంలో మజ్జి శ్రీనివాస్ అలియాస్ చిన్న శీను లాంటి వాళ్లు చెలరేగిపోయారు. ప్రభుత్వ కాంట్రాక్టులన్నీ వైసీపీ వాళ్లే కైవసం చేసుకున్నారు. సాయిరెడ్డితో పాటు వైసీపీ వాళ్లందరూ విశాఖలో వ్యాపారాలు విస్తరించారు. విశాఖ భూములుపైనే పడ్డారు. సహజంగా ప్రశాంతంగా ఉండే విశాఖపట్నం.. కబ్జాలపర్వంతో వణికిపోయింది. విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ తన రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాన్ని విస్తరించే పనిలో భాగంగా… అడ్డగోలుగా కబ్జాలు చేసి పడేశారు. జగన్‌కు అత్యంత సన్నిహితుడైన జీవి అనే ఆడిటర్.. విశాఖను గుప్పిట్లో పెట్టుకుని ఆడించారు. ఇక మిగిలిన ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు మైన్స్‌పై పడ్డారు. పెద్దిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, నెల్లూరు అనిల్ యాదవ్‌తో పాటు కనీసం 60, 70 మంది ఎమ్మెల్యేలు మైనింగ్‌పైనే ఆదాయాన్ని సమకూర్చుకున్నారు. ఆర్థిక మంత్రి ఏకంగా పాణ్యం సిమెంట్స్ కంపెనీనే కొనుక్కున్నారు. ఆ మంత్రి, ఈ మంత్రి అని లేదు… అందరూ 100ఏళ్లకు కావాల్సింది సంపాదించుకున్నారు. పైకి మాత్రం అంత సీఎం చూసుకుంటున్నాడు. తమకు రూపాయి సంపాదన లేదంటూ చెప్పుకుంటూ వచ్చారు. ఇవన్నీ ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ ద్వారా తెలుసుకుంటూనే జగన్ నిర్లక్ష్యంగా వదిలిపెట్టారు.

ఐదేళ్లలో ఎమ్మెల్యేలు గానీ మంత్రులను కానీ వన్ టూ వన్ కలవకపోవడం… జనాలను కూడా ఎన్నడు కలిసింది లేదు. ఈ ఐదేళ్లలో ఒక్క ప్రెస్‌మీట్‌ కూడా పెట్టని ముఖ్యమంత్రి జగన్. అభివృద్ధి పథకాలు అమలు చేసేటప్పుడు సంక్షేమ పథకాలు ప్రారంభించేటప్పుడు… బటన్ నొక్కడం, స్పీచ్ ఇవ్వడం… స్పీచ్ చివర్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ని తిట్టడం తప్ప ముఖ్యమంత్రి అనేవాడు తన ఎమ్మెల్యేలను, ఎంపీలను ఏ రోజు కలవలేదు. జనాలను అసలే కలవలేదు. ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఎంట్రీ ఇస్తే వాళ్ల డిమాండ్లు పెరిగిపోతాయని జగన్ భావన. జగన్‌కి నాయకులకు మధ్య సజ్జల అనే ఒక పోస్టుమాన్ మాత్రమే ఉన్నాడు. అసలు ఎమ్మెల్యేల్ని, జనాలను కలవకపోవడంతో తాడేపల్లి కోట బయట ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోయాడు జగన్. జగన్ చేసిన మరో భారీ తప్పిదం. ఏపీలో మద్యం అమ్మకాలను మొత్తం తన కంట్రోల్లో పెట్టుకోవడం. మద్యం అమ్మకం ద్వారా తనకు పార్టీ నాయకులకు ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చని పెద్ద ప్లాన్ వేశారు జగన్. దేశంలో దొరికే బ్రాండ్లు అన్నిటిని రాష్ట్రంలోకి అడుగుపెట్టనివ్వకుండా సొంత బ్రాండ్లు సృష్టించారు.

ఇది జగన్ విశృంకలకతకు మచ్చుతునక. బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్.. ఇలాంటి పిచ్చి పేర్లతో మద్యం బ్రాండ్లను సృష్టించి ఏపీకే పరిమితం చేసి అధిక రేట్లకి లిక్కర్ నమ్ముకున్నారు. అది తాగితే అనారోగ్యం, మరోవైపు రేట్ ఎక్కువ. కేవలం సొంత లిక్కర్ పాలసీ అమ్మకాల వల్ల… జగన్ ఆయన చుట్టూ ఉన్న కొందరు మాత్రమే వేలకోట్ల రూపాయలు సంపాదించుకున్నారని ఆరోపణలు ఉన్నాయ్. భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇలా లిక్కర్ బ్రాండ్లు పెట్టి ప్రభుత్వం అమ్ముకున్న పరిస్థితి ఎక్కడా లేదు. జగన్‌కు డబ్బు ఎలా సంపాదించాలో తెలుసు… ఎక్కడి నుంచి సంపాదించాలో కూడా తెలుసు… మద్యం మీద కబ్జా పెట్టి సొంత బ్రాండ్ల సృష్టించి లాభపడ్డాడు. మద్యాన్ని పూర్తిగా నిషేధిస్తానని ఇచ్చిన హామీని కూడా గాలికి వదిలేశారు. రాష్ట్రంలో లిక్కర్ చాలామందిని ప్రభావితం చేస్తుంది. ఒకపక్క డబ్బులు ఇస్తున్నాడు మరోపక్క ఇలా దోచేశాడు జనాన్ని అనేది బాగా పబ్లిక్‌లోకి వెళ్లిపోయింది. లిక్కర్ ద్వారా జగన్‌ వేల కోట్లు సంపాదించుకున్నాడు.

లిక్కర్ తర్వాత జగన్ సమకూర్చుకున్న ఆదాయ వనరు ఇసుక. మొత్తం రాష్ట్రంలోని ఇసుకను ప్రైవేట్ సంస్థకు లీజుకి ఇచ్చేశాడు. ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు గాని… నాయకులు ఎవరు అటువైపు చూడకూడదని ఆదేశించారు. ఆ ప్రైవేట్ సంస్థ ఇసుక తవ్వుకుంటది… దానికి ఎంత చెల్లించాలో అంత ప్రభుత్వానికి చెల్లిస్తుంది. దీంతో రాష్ట్రంలో ఇసుక కరువు వచ్చేసింది. చాలా నిర్మాణాలు ఇసుక లేక నిలిచిపోయాయి. చివరికి అధిక రేటు ఇచ్చి కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇసుక వలన జగన్‌ ఆర్థికంగా బాగా బలపడవచ్చేమో కానీ సామాన్యులు మాత్రం ఇసుక దెబ్బతో విలవిల్లాడిపోయారు. ఇక ఏపీలో అస్తవ్యస్తంగా ఉన్న రోడ్ల వ్యవస్థ గురించి పక్క రాష్ట్రంలోనే కాదు విదేశాల్లో కూడా చర్చ జరిగింది. ఏపీలో నేషనల్ హైవే మినహాయించి మిగిలిన రోడ్లన్నీ దారుణంగా ఉన్నాయి. చంద్రబాబు హయాంలో వేసిన సిమెంట్ రోడ్లు మినహా మిగతా రోడ్ల పరిస్థితి చెప్పలేం. డబ్బులన్నీ మొత్తం సంక్షేమ పథకానికి పోవడంతో పూర్తిగా వదిలేసింది జగన్ సర్కార్. సోషల్ మీడియాలో వేల జోక్స్, వీడియోస్ ఏపీ రోడ్లపై కనిపిస్తాయ్. ముందైనా మూడు నుంచి నాలుగు వేల కోట్లు వెచ్చించి రోడ్లు బాగు చేయించుకుంటే బాగుండేది… అదీ చేయలేకపోయారు. జనం ఏం మాట్లాడుకుంటున్నారో జగన్‌కి తెలియకపోవడమే చాలా సమస్యలు పరిష్కారం కాకపోవడానికి కారణం. దీనికి తోడు వేలకోట్ల రూపాయలు సంక్షేమ పథకాలకు ప్రతినెల పెట్టడం, ఆదాయం పెరగకపోవడంతో మౌలిక సదుపాయాలపై జగన్ దృష్టి పెట్టలేదు. అదే ఆయన చేసిన మరో తప్పు.

వాయిస్‌ : 2019లో జగన్ బాబాయ్ వివేకానంద రెడ్డిని హత్య చేశారు కొందరు. ఎన్నికల్లో ఈ హత్యని బాగా వాడుకున్నాడు జగన్. చంద్రబాబు ఈ హత్య చేయించాడని ప్రచారం చేశారు. కానీ ఆ తర్వాత ఐదేళ్లలో ఆ హత్య కేసులో జగన్ ఆయన కుటుంబం బాగా అబాసుపాలయింది. జగన్ సోదరుడు అవినాష్ రెడ్డి ఈ కేసులో నిందితుడిగా ఉన్నాడు. అవినాష్ తండ్రిని కూడా ఈ కేసులో అరెస్ట్ చేశారు. వివేకానందకి సన్నిహితుడైన దస్తగిరి.. తానే హత్య చేశానని అప్రూవర్‌గా మారాడు. ఆయన అవినాష్ రెడ్డిపైనే ఆరోపణలు చేశాడు. రకరకాల ప్రయత్నాలతో అవినాష్ రెడ్డి జైలుకి వెళ్లకుండా తప్పించుకున్నాడు. ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నాడు. వివేకానంద రెడ్డి గుండెపోటుతో చనిపోయాడని ఒకసారి.. లేదు లేదు హత్య జరిగిందని మరోసారి ఇలా రకరకాలుగా లీకులిచ్చి జగన్ చుట్టూ ఉన్న కోటరీ అడ్డంగా బుక్ అయిపోయింది. టీడపీ సోషల్ మీడియా వివేకా హత్యను ఒకటికి పదింతలు చేసింది. జగన్ మరో సోదరి సునీత రెడ్డి.. జగన్‌కు, అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా కోర్టులో పోరాడుతుండటంతో ఇంటిగుట్టు రచ్చకెక్కింది. సీబీఐకి ఇచ్చిన కూడా ఇప్పటివరకు ఈ కేసు తేలలేదు. వివేకానంద హత్యకు కారణాలేంటి… ఆహత్య వెనక ఉన్నదెవరు అన్నది ఎవరో తేలకపోయినా… ఈ కేసు ప్రభావం మాత్రం కచ్చితంగా జగన్ గెలుపోటములను నిర్ణయించింది. జగన్‌ రెడ్డి కుటుంబ సంస్కృతిపై జనం అసహ్యం పెంచుకునేలా వివేక హత్య పబ్లిక్‌లోకి వెళ్లింది.

వాయిస్ : ఐదేళ్లలో రాష్ట్రంలో విజిబుల్ డెవలప్‌మెంట్‌ కనిపించలేదు. డబ్బులు మొత్తం సంక్షేమ పథకాలకే పెట్టడంతో… ఖజానాలో రూపాయి మిగలడం లేదు. కాంట్రాక్టులకు డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. యూనివర్సిటీలు, ఇతర సంస్థలు దగ్గరున్న నిధుల్ని కూడా డైవర్ట్ చేసి గవర్నమెంట్ వాడేసుకుంది. కొత్తగా విద్యాసంస్థలు పెట్టినట్టుగా గాని… పరిశ్రమలు పెట్టినట్టుగా గాని ఎక్కడ కనిపించదు. రామాయంపేట పోర్టు, అదానీ డేటా సెంటరుతో పాటు మరికొన్ని ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నా.. ఏ రకంగానూ దోహదపడలేదు. కేంద్రంలో బీజేపీతో సన్నిహిత సంబంధాలు ఉండి కూడా సంక్షేమ పథకానికి డబ్బులు తెచ్చుకున్నారు తప్ప… అభివృద్ధి కోసం డబ్బులు తీసుకురాలేకపోయింది జగన్ ప్రభుత్వం. అంతేకాదు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకోలేకపోయింది. అదానీకి అడ్డగోలుగా ప్రాజెక్టులు కట్టబెట్టింది. రోడ్లు లేవు, వంతెనలు లేవు, పరిశ్రమలు లేవు, విద్యాసంస్థలు లేవు… దీంతో ఏపీలో అభివృద్ధి జరగలేదనేది జనంలోకి బాగా వెళ్లిపోయింది. అంతేకాదు బీజేపీతో రహస్యమైత్రి కూడా వైసీపీకి చేటు చేసింది. ఇక అసెంబ్లీలో అమరావతిని రాష్ట్ర రాజధానిగా ఆమోదించిన జగన్… అధికారంలోకి వచ్చాక అమరావతిని ఇనుపపాదంతో తొక్కేశారు. ఏపీకి మూడు రాజధానులు అంటూ ప్రకటించారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా ప్రకటించిన జగన్… కనీసం అక్కడ కూడా ఏమి డెవలప్ చేయలేదు. రుషికొండలో కొండకు గుండు కొట్టించి… తన కోసం అత్యంత ఖరీదైన అధికార నివాసాన్ని 2వందల కోట్లు ఖర్చుపెట్టి కట్టించుకోవడం తప్ప జగన్ చేసింది ఏమీ లేదు. కోర్టులు వ్యతిరేకించినా.. కేంద్రం వ్యతిరేకించినా.. జనం ఒప్పుకోకపోయినా విశాఖే రాజధాని అంటూ… కమ్మ వాళ్ళని టార్గెట్‌గా చేసుకొని అమరావతిని భ్రష్టు పట్టించారు. ఇంతచేసి ఏపీకి రాజధాని లేకుండా చేశాడు జగన్.

వాయిస్ : ఏపీ జనాన్ని తన పార్టీ గెలుపు కోసం కులాలువర్గాలుగా విడగొట్టేయడం జగన్ చేసిన మరో దుర్మార్గపు పని. ఒక రెడ్డి ముఖ్యమంత్రి బహిరంగ వేదికపై… నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు అంటూ… జనాన్ని కులాలవారీగా విడగొట్టేశారు. ఆ కులాలకు మాత్రమే తాను మేలు చేస్తానని నిస్సిగ్గుగా చెప్పుకున్నారు జగన్. అక్కడితో ఆగలేదు… తాను పీడిత తాడిత ప్రజలకు ప్రతినిధినని, భూస్వామ్య వర్గాలకు వ్యతిరేకనని… చంద్రబాబు, పవన్ వీళ్లంతా భూస్వామ్య వర్గాలని ఒక పిచ్చి వాదని ఎత్తుకున్నాడు జగన్. దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రి, వేలకోట్ల రూపాయల అధిపతి, ఎలక్షన్ అప్పుడు… 770 కోట్లు అధికారికంగా ప్రకటించిన నాయకుడు… తాను పేదల ప్రతినిధినని, పేదల కోసం పోరాడుతున్నానని చెప్పుకోవడం… పరమ జుగుప్సాకరంగా ఉంటుంది. మీ బిడ్డ… మీ బిడ్డ అంటూ చిల్లర మాటలు, చిల్లర వేషాలు కూడా జగన్ పట్ల అసహ్యాన్ని పెంచాయ్. పేదల ప్రతినిధిగా, సంపన్న వర్గాల నుంచి పేదలను కాపాడే విప్లవకారుడిగా తనను తాను జగన్ పాటించుకోవడం భయంకరమైన తప్పు.

ఇక అటు పోలింగ్‌కి సరిగ్గా 15రోజుల ముందు… ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై టీడీపీ సోషల్ మీడియా లేపిన గబ్బు.. జగన్‌ను ముంచేసింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా జనాల భూముల్ని జగన్ లాక్కుంటాడని, వాటిని తనఖా పెట్టుకుని డబ్బులు తెచ్చుకుంటాడని… మీ భూములపై మీకు హక్కు లేకుండా పోయిందని… ఒరిజినల్ పట్టాలు సబ్ రిజిస్టర్ దగ్గరే ఉంటాయని… ఇలా రకరకాలుగా సోషల్ మీడియాలో ల్యాండ్ టైటిల్ యాక్ట్‌పై అల్లరి చేశారు. దీన్ని జనం బాగా నమ్మారు. వీటితో పాటు రైతు పాస్ పుస్తకాలపై జగన్ తన ఫోటో వేయించుకోవడం… భూ సర్వే చేసి పాతిన రాళ్లపై కూడా ఫోటోలు ఎంచుకోవడంతో… ఈ భూములన్నీ జగన్ లాక్కుంటాడని జనాన్ని బాగా నమ్మించగలిగింది సైకిల్ పార్టీ. టీడీపీ, జనసేన ఆరోపణలని సమర్థంగా ఖండించలేకపోయాడు జగన్. మేనిఫెస్టోతో మరో సెల్ఫ్‌గోల్‌ కొట్టుకున్నారు జగన్. అక్కడికి ఏదో ఆర్థికంగా చాలా క్రమశిక్షణతో ఉన్నట్లు కానీ హామీలు ఇవ్వలేనట్టు వృద్ధాప్య పెన్షన్‌ను 3వేల 5వందలకు పరిమితం చేశారు. పెద్ద ఆకర్షణ ఉన్న ప్రకటనలేవి మేనిఫెస్టోలో చేయలేదు. టీడీపీ వృద్ధాప్య పెన్షన్ 4వేలు ప్రకటించింది. అమ్మ ఒడి పథకాన్ని మాతృదేవోభవ పేరిట ఇంట్లో పిల్లలందరికీ వర్తింపచేస్తానని హామీ ఇచ్చింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా ప్రకటించింది. సహజంగానే టిడిపి మేనిఫెస్టో పై జనంలో ఆసక్తి పెరిగింది.

వాయిస్ : నేను మీకు వేలకోట్ల రూపాయలు ఇచ్చాను… నేను మీకు మంచి చేశాను.. ప్రతి వాడికి డబ్బు ఇచ్చానని సిగ్గు లేకుండా చెప్పుకున్నాడు జగన్. నువ్విచ్చింది నీ అమ్మ మొగుడు సొమ్మా.. మా డబ్బులు మాకిచ్చి నీ ఆస్తులు ఏవో మాకు ఇచ్చినట్లు ప్రతి నిమిషం చెప్పుకుంటావేంట్రా నాయనా అని జనం అసహ్యించుకున్నారు. ఇలా జగన్ అహంకారంతో తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వెళ్లాడు. చివరికి తన పతనాన్ని తానే కొని తెచ్చుకున్నాడు. ఈ వీడియో మొత్తం చూస్తే జగన్ తన చేసిన తప్పులు ఏంటో అర్థం అవుతుంది. ఎందుకు ఓడిపోయావు అనేది ఇప్పటికైనా అర్థమవుతుంది. ఇంకా అర్థం కాకపోతే జగన్ కర్మ. జనం అదృష్టం.