GVL : అమ్మ జీవీఎల్… అందుకేనా ? మద్యం స్కామ్ లో దొరికిపోయాడుగా..

ఏపీలో విశాఖపట్నం టిక్కెట్ ఆశించి భంగపడ్డాడు బీజేపీ మాజీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక పాలిటిక్స్ లో ఫేడవుట్ అయ్యారు.

 

 

ఏపీలో విశాఖపట్నం టిక్కెట్ ఆశించి భంగపడ్డాడు బీజేపీ మాజీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక పాలిటిక్స్ లో ఫేడవుట్ అయ్యారు. కానీ వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో GVL పేరు వినిపిస్తోంది. ఒకటి రెండు కాదు… ఏకంగా 40 కోట్ల రూపాయలు ఆయన ఖాతాకు చేరినట్టు బయటపడింది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విడుదల చేసిన మద్యం శ్వేతపత్రాల్లో… అనూహ్యంగా జీవీఎల్ పేరు బయటకు వచ్చింది. దాంతో ఆయన్ని సీఐడీ విచారించబోతోంది.

గత ఐదేళ్ళుగా కేంద్రంలో బీజేపీతో మంచి సంబంధాలు కొనసాగించింది వైసీపీ. పార్లమెంటులో బిల్లుల ఆమోదానికి మద్దతు ఇచ్చింది. అందుకే ఆ టైమ్ లో ఏపీ బీజేపీ నేతల్లో కొందరు… వైసీపీని కాకుండా టీడీపీపై విమర్శలు చేసేవారు. వాళ్ళల్లో సోము వీర్రాజు, జీవీఎల్ నర్సింహారావు, విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నారు. కానీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ముందు పవన్ కల్యాణ్ చొరవతో … బీజేపీ, టీడీపీ కలసి పోటీ చేశాయి. అయితే వైసీసీ హయాంలో మద్యం పాలసీలో 30 వేల కోట్ల స్కామ్ నడిచినట్టు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శ్వేతపత్రంలో తెలిపారు. ఇందులో బీజేపీ నేత జీవీఎల్ నర్సింహారావు పేరు కూడా ఉంది. దాదాపు 40 కోట్ల రూపాయలు ఆయన ఖాతాల్లోకి వెళ్ళినట్టు తేలింది. మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చింది జగన్ ప్రభుత్వం. రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ బాండ్లను స్టాక్ ఎక్చేంజ్ ల్లో తనఖా పెట్టి… రెండు సార్లు లోన్ తీసుకుంది. ఈ మీడియేషన్ కోసం అడ్వైజర్స్ ని కూడా పెట్టుకుంది. వాళ్ళకి 1.44 శాతం కమీషన్ ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. కానీ ఈ సలహాదారులకు ఇవ్వాల్సిన కమీషన్ కంటే 20 కోట్ల రూపాయలు అడిషినల్ గా చెల్లించినట్టు బయటపడింది. అడ్వైజర్ గా ఉన్న GVL తో పాటు మరో ఎంపీకి చెరో 40 కోట్లు బదిలీ అయినట్టు ఆరోపణలొస్తున్నాయి. ప్రస్తుతం ఈ కేసు ఏపీ సీఐడీకి చేరింది. దాంతో GVL పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయారు.

నిజానికి వైసీపీ హయాంలో జీవీఎల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాకుండా… ప్రతిపక్షమైన టీడీపీని ఎక్కువగా టార్గెట్ చేశారు. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నట్టుగా కనిపించినా… ఆవు కథ లాగా తిరిగి తిరిగి… చంద్రబాబును కూడా ఆ ఆరోపణల్లోకి లాగేవారు. ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ-బీజేపీ కలవబోవని కూడా జీవీఎల్ చెప్పేవారు. అదేదో మోడీయో, అద్వానీయో… ఈయనతో చెప్పించినట్టుగా మాట్లాడేవారు. వైసీపీ నుంచి మద్యం కమీషన్లు తీసుకోవడం వల్లే GVL ఇలా ప్రవర్తించారని ఇప్పుడు తెలుస్తోంది. ఐదేళ్ళుగా తమను టార్గెట్ చేసి… ఇప్పుడు మద్యం కేసులో ఇరుక్కున్న GVL ను అంత తొందరగా విడిచిపెట్టొద్దని టీడీపీ నేతలు డిసైడ్ అయ్యారు. మిగతా బీజేపీ నేతలు కూడా జీవీఎల్ పై పీకల్లోతు కోపంగా ఉన్నారు. దాంతో రాబోయే రోజుల్లో జీవీఎల్ ను CID అరెస్ట్ చేయడం ఖాయమని తెలుస్తోంది.